‘నమస్కారం గురూగారూ! ఉన్నపళంగా రమ్మని కబురంపించారు, ఏమైనా అర్జంటు పనాండీ?’
‘రారా... నువ్వొచ్చేలోగా హాలంతా పచార్లు చేస్తూనే ఉన్నాన్రా. మొత్తానికి వచ్చావ్...’
‘అయ్‌బాబోయ్! మీరు పచార్లు చేస్తూ మరీ ఎదురు చూశారంటే అదేదో గొప్ప పనే అయ్యుంటుందండి. చెప్పండి..’
‘అదేరా... ·ôÙడు కళ్లూ తెరిచి ఉండగా, ఓ కన్నును మాత్రమే నెమ్మదిగా మూసి తెరవడం నీకు వచ్చా రాదా అని కనుక్కుందామనీ...’
‘అదేంటి గురూగారూ! ఏదో కొంపలారిపోయే పననుకుంటే, ఇలా కన్నుకొట్టడం వచ్చా అని అడుగుతున్నారు?’
‘భలేవాడివిరా! ఇప్పుడదే సంచలనం అయిపోయిందిరా బాబూ... అదెంత గొప్ప విద్యో ఇప్పుడే టీవీ చూస్తుంటే అర్థమైంది. అందుకే మరి ఆదరాబాదరా కబురంపించాను. కాబట్టి నే చెప్పేదేంటంటే, నీకు కన్ను కొట్టడం వస్తే ఫర్వాలేదు. లేకపోతే ఎవర్నైనా కుర్రవెధవల దగ్గరకి పోయి ఎలా కన్నుకొట్టాలో నేర్చుకో...’
‘ఇప్పుడంత హడావుడిగా నేర్చుకోవడం ఎందుకండీ? కాస్త వివరంగా చెబుదూ?’
‘ఒరే... నువ్వు నా దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకోడానికి చేరావ్. నిన్ను సాధ్యమైనంత నీచ రాజకీయ వేత్తగా మార్చాలనేదే నా ధ్యేయం. ఆ ప్రయత్నంలో నువ్వు కూడా ఎంతో కొంత ఎదిగావు, కాదనను. కానీ ఇంకా రాటుదేలలేదురా. చుట్టూ జరుగుతున్న రాజకీయ తతంగాన్ని చూసుకోకుండా, నీ దారిన నువ్వు పోతున్నావు. అదే నా బాధ...’
‘అయ్యో బాధ పడకండి గురూగారూ! నన్నీ మాత్రమైనా మార్చింది మీరే. ఏదో కాలం కలిసిరాక ప్రతిపక్షంలో పడిపోయి, పక్షవాతం వచ్చినట్టు అయిపోయి, దిక్కుతోచక తిరుగుతున్నాను కానీ... మీ శిష్యుడిగా నా బాధ్యత మరువలేదండి. ఇంతకీ ఇప్పుడింత కంగారు ఎందుకు పడ్డారో తెలియజేయండి...’
‘అక్కడికే వస్తున్నానురా. మొన్న లోక్‌సభ ప్రత్యక్షప్రసారాలు టీవీలో వచ్చాయి చూశావా? అప్పుడు తెలిసిందిరా మనమెంత వెనకపడిపోయి ఉన్నామో. ఆ ప్రసారాల్లో కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ చేసింది చూశాక ఇక ఆగలేకపోయారా. ఇక నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ, వెంటనే కన్నుగీటడం నేర్చుకోవాల్సిందే...’
‘ఆ.. నేనూ చూశానండోయ్. ఆయనగారు ప్రధానమంత్రిని విమర్శిస్తూ ప్రసంగించి, ఆనక అకస్మాత్తుగా వెళ్లి ఆయన్ని అనూహ్యంగా కౌగలించేసుకున్నారండి. ఇదేంట్రా బాబూ... ఇలా చేశాడని నేను నోరెళ్లబెట్టి చూసేంతలోగానే, చేతులూపుకుంటూ నడుచుకొచ్చేసి తన సీట్లో చతికిలబడ్డారండి. తర్వాత మొహం పక్కకు పెట్టి అదోరకంగా కన్నుగిలిగారండి. కానీ నాకు తెలియక అడుగుతాను గురూగారూ, కన్నుకొట్టడం అంత గొప్ప విద్యాండీ?’
‘ఓరి సన్నాసీ! అదే కదురా చెబుతుంట? కన్నుగీటడం పలురకములు. రోడ్డు మీద ఓ కుర్రాడు, ఓ అమ్మాయిని చూసి కన్నుగీటాడనుకో. వాడిని ఆకతాయంటాం. ఆ అమ్మాయి చెప్పు తీసి కొట్టచ్చు, లేదా పోలీసులకు చెబితే ఈవ్‌టీజింగ్ కింద అరెస్టు కూడా చేయించొచ్చు. అది తుంటరి కన్నుగీత. మామూలుగా పనీపాటా లేని పోరంబోకులు, దగుల్బాజీలు చేసే పని అది. ఇక నువ్వు నీ స్నేహితుడి కేసి చూసి కన్ను కొట్టావనుకో. అది సరదా కన్నుగీత. నువ్వు ఎదుటివాడిని బుట్టలో వేయడానికో, లేదా ఉబ్బేయడానికో ఓ అబద్ధం ఆడి, ఆనక మరొకరి కేసి చూసి కన్ను చికిలించావనుకో. అది అతితెలివి కన్నుగీత...’
‘అబ్బో... కంటికొట్టుడులో ఇన్ని రకాలున్నాయా?’
‘ఇంకా ఉన్నాయిరా బడుద్దాయ్! ఒకోసారి ఈ కన్నుగీత నిన్ను రాత్రికి రాత్రి పెద్ద ప్రముఖుడిని చేసేయవచ్చు కూడా. ఆమధ్య ఓ మలయాళ నటి ఎవరో ఇలాగే చేసి, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించలేదూ?’
‘అవునండి. ప్రియావారియర్ అంటారండి. ఏదో సినిమా కోసం కన్నుగీకిందండి. నేను కూడా చూశానండి. కానీ అది నటనలో భాగం కదా గురూగారూ? మరి మన యువనేత కన్నుగీకుడేంటండి?’
‘ఒరే... అది నటనైతే, ఇది మహా రాజకీయ నేత్ర విన్యాసంరా బాబూ. ఆయన కన్నార్పడం తన పక్కన కూర్చున్న వాడికే అయినా, నిజానికి అది దేశ ప్రజలందరికీ కొట్టినట్టేరా నాయనా. అంతకు ముందు ఆయనేం చేశాడో గుర్తుందా?’
‘ఎందుకు లేదండి? ప్రధానమంత్రిని నానా మాటలూ అని, ఎంచక్కా వెళ్లి కౌగలించుకున్నారండి. మరి పనిలో పనిగా ఆ కన్నుగీటడంతో పాటు, ఆ కౌగిలింతలు కూడా నేర్చుకోమంటారా?’
‘కొంచెం ఎదుగుతున్నావురా..సంతోషం. ఈ కౌగిలింతలు కూడా పలు రకములు. విదేశాల్లో పరిచయం అవ్వగానే కౌగలించుకుంటారు చూడు. అది మర్యాద కౌగిలింత. నువ్వేదయినా గొప్ప పని సాధించినప్పుడు... అహ... నువ్వేమీ సాధించలేదనుకో, కానీ అలాంటి సందర్భంలో నీ సన్నిహితులు కౌగలించుకుంటారు చూడు, అది ఆత్మీయ కౌగిలింత. ఇద్దరు కలిసి ఏ బ్యాడ్మింటనో లాంటి ఓ ఆట ఆడేశాక, ఎవరు •Þలిచినా సరే, మరొకర్ని కౌగలించుకుంటారే, అది క్రీడాస్ఫూర్తి కౌగిలింత. ఇక మనకిష్టం ఉన్న వాళ్లను వాటేసుకున్నామనుకో, అది అభిమాన కౌగిలింత. అర్థమవుతోందా?’
‘ఆహా.. గురూగారూ! ఏది ఏమైనా మీతో మాట్లాడ్డమే ఓ ఎడ్యుకేషనండీ... కౌగిలింతల్లో మర్మాలు ఎంతబాగా చెబుతున్నారండీ!’
‘ఓరే.. గిరీశంలాగా నన్ను ఉబ్బేయాలనుకోకు. నా దగ్గర నేర్చుకున్న పాఠాలు నా మీదే ప్రయోగించాలనుకోకు. ఇంకా చెబుతాను విను. ఆమధ్య ఓ హిందీ సినిమా వచ్చింది చూశావా? అందులో సంజయ్‌దత్ అనే కథానాయకుడు అందరికీ కౌగలించుకుంటూ ఉంటాడు, గుర్తొచ్చిందా?’
‘వచ్చిందండీ. మున్నాభాయ్ సినిమా అండి. అందులో నేల తుడిచే ముసిలాడిని, కోపంతో బాధ పడుతున్నవారిని వెళ్లి వాటేసుకుంటాండండి. ఆ సినిమాలో అది బాగా హిట్టయిందండి.. కానీ నాకు అర్థం కాక అడుగుతానండీ, ఆ మున్నాభాయ్ కౌగిలింతకి, ఈ పొలిటికల్ భాయ్ కౌగిలింతకి తేడా ఏంటండీ?’
‘ఆ సినిమాలోది మానవత్వాన్ని చూపించే చర్యరా బాబూ. ఇది అలాకాదు, మన యువనేత నేర్పుతున్న ఓ వింత, విచిత్ర విన్యాసం. నీ కొడుకును కౌగలించుకుని ఆనందించడాన్ని పుత్రగాఢ పరిష్వంగనం అంటారు. కానీ ఇలా ప్రతిపక్ష నాయకుడిని ముందు విమర్శించి, ఆనక తీరిగ్గా వెళ్లి వాటేసుకోడాన్ని రాజకీయ అతి చాతుర్య గాఢపరిష్వంగనం అనుకోవచ్చు...’
‘వార్నాయనో! పైకి ఏమీ తెలియని అమాయకుడిలాగా కనిపిస్తాడు కానీ ఈ యువనేత మహా గడుగ్గాయిలా ఉన్నాడండోయ్. ప్రియావారియర్ నుంచి, మున్నాభాయ్ నుంచీ ఈ విద్యలు నేర్చుకున్నాడంటారా?’
‘ఇది నేర్చుకుంటే వచ్చేది కాదురా. స్వయంగా, స్వభావ సిద్ధంగా పెరిగిపోయే లక్షణం. Ëదాన్నుంచి మనం ఏం నేర్చుకోవాలనేదే ముఖ్యం’
‘ఏం నేర్చుకోవచ్చంటారు గురూగారూ!’
‘ప్రజల్ని ఏమార్చే గొప్ప కనికట్టురా ఇది. అనేసిన మాటలు అనేసి, తర్వాత వెళ్లి మీద పడి పట్టేసుకున్నామనుకో, ఆహా.. ఎంతటి మంచి మనసు, ఎంతటి గొప్ప విశాల హృదయం, అనిపించదూ? అదన్నమాట కిటుకు. ఇక ఆ కన్నుగీకుడుంది చూశావూ? తన వాళ్లకి తానెందుకు అలా చేశానో చెప్పే నేత్రావధానం అన్నమాట. .తెలిసిందా?’
‘కానీ గురూగారూ! నాదో చిన్న సందేహం. ప్రజలు ఇలాంటి కిటుకుల్ని గమనించరంటారా?’
‘ఓరి పిచ్చి సన్నాసీ.ప్రజానీకం నాకన్నా, నీకన్నా, ఆ యువనేత కన్నా తెలివైన వాళ్లురా. వాళ్లు అందరినీ గమనిస్తూ ఉంటారు. అలా గమనించబట్టే మనం ఇలా వెనక బెంచీల్లో ఉన్నామన్న సంగతి తెలుసుకో ముందు. ప్రజలకి ఎప్పుడు ఎవరిని కౌగలించుకోవాలో, ఎవరికి కన్నుకొట్టాలో బాగా తెలుసు. అది మనకి అనవసరం. కొత్త విద్యలు ఎవరిలో కనిపించినా, ముందు నేర్చుకోవడమే మన పని. కాబట్టి వెళ్లి కన్నుకొట్టడం, కౌగిలించడం నేర్చుకుని వచ్చి కనబడు’.
-ఎ.వి.ఎన్.హెచ్.ఎస్.శర్మ

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి