శనివారం, మే 29, 2021

జ‌గ‌మొండిత‌నం!


 "ఏరా అలా మొహం వేలాడేసుకుని వ‌చ్చావ్‌? ఏంటి క‌త‌?"

అంటూ గురువుగారు ప‌ల‌క‌రించారు. శిష్యుడు వంచిన త‌ల ఎత్త‌కుండానే చెప్పాడు, "ఏంలేదు గురూగారూ! మా బాస్ తిట్టాడండి..."

"ఏమ‌ని తిట్టాడ్రా..."

"యూజ్‌లెస్ ఫెలో అన్నాడండి..."

"వ‌హార్నీ... అది తిట్టు ఏలా అవుతుందిరా? ఆయ‌న‌న్న‌ది నిజ‌మే క‌దా?"

"ఏంటి గురూగారూ మీరు కూడానూ! అస‌లే సిగ్గుప‌డి చితికిపోతుంటే మీరిలా ఎకసెక్కాలు చేస్తారేంటండీ?"

గురువుగారు న‌వ్వుతూ, "అలా ఉడుక్కోకురా... ఇంత‌కీ ఆయ‌న పొర‌బ‌డి తిట్టాడా?  లేక నువ్వు నిజంగానే త‌ప్పు చేశావా?"

"త‌ప్పు నాదేనండి... అందుకే క‌దండీ, తెగ బాధ ప‌డుతుంట‌?  కాస్త మ‌న‌సు తెరిపిగా ఉంటుంద‌ని మీ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చానండి..."

"ఒరే... త‌ప్పుచేస్తే త‌లెత్తుకుని తిర‌గాలి. ఎవ‌డైనా తిడితే అడ్డ‌గోలుగా వాదించాలి. ఆడి మీద ఉన్న‌వీ లేనివీ క‌ల్పించి ఎదురెట్టాలి. వీలుంటే త‌ప్పుడు కేసులు బ‌నాయించాలి. ఇవ‌న్నీ చేయ‌డం మానేసి ఇలా సిగ్గు ప‌డితే ఎలారా?" 

"అదేంటి గురూగారూ! అలా అడ్డ‌దిడ్డంగా చెబుతారు? మ‌నం చేసిన త‌ప్పు మ‌న‌క‌న్నా ఉన్న‌త స్థితిలో ఉన్న‌వాళ్లు గుర్తించి తిడితే మ‌నసు కుంచించుకుపోదాండీ? అరె... మాట ప‌డ్డామే అని మ‌థ‌న‌ప‌డిపోదాండీ? మ‌న సామ‌ర్థ్యం మీద మ‌నకే సందేహం వ‌చ్చి కునారిల్లి పోదాండీ? అలా కాకుండా మీరు చెప్పిన‌ట్టు ఎవ‌డైనా త‌లెగ‌రేస్తాడాండీ?  పొగ‌రుతో ప్ర‌వ‌ర్తిస్తాడాండీ? అలా చేసిన వాడెవ‌డైనా మ‌నిషా దున్న‌పోతా, చెప్పండి? అస‌లు అలాంటి ద‌గుల్బాజీలు ఎక్క‌డైనా ఉంటారా చెప్పండి?"

"ఒరే... ఒరే... అలా ఆవేశ‌ప‌డిపోకురా బడుద్దాయ్‌! కాస్త క‌ళ్లెట్టుకు చూడు. నీ రాష్ట్ర అధినేత‌నే నువ్వు మ‌ర్చిపోతే ఎలారా? య‌ధా రాజా త‌థా ప్ర‌జా అన్న‌ట్టు ఆయ‌నగారి ద‌గ్గ‌ర నుంచి హాయిగా నేర్చుకోవాల్సిన నాణ్య‌మైన గుణాలే క‌ద‌రా ఇవి?"

"ఆహా... గురూగారూ! నన్ను మాట‌ల్లో పెట్టి రాజ‌కీయ పాఠాలు మొద‌లుపెట్టేశార‌న్న మాట‌. చెప్పండి గురూగారూ రాసుకుంటాను..."

"నేను చెప్ప‌డం కాదురా... నువ్వే చెప్పు. మ‌న రాష్ట్రానికి న్యాయం చెప్పే పెద్ద‌బాస్‌ ఎవ‌ర్రా?"

"హైకోర్ట్ గురూగారూ!"

"మ‌రి మ‌న దేశానికే త‌ల‌మానికంగా మార్గ‌నిర్దేశం చేసి నిజాల నిగ్గుదీసేదెవ‌ర్రా?"

"సుప్రీం కోర్ట్  క‌దండీ!"

"మ‌రి ఆ రెండు న్యాయ పెద్ద‌న్న‌లు మ‌న రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాల‌ను  ఎన్నిసార్లు త‌ప్పుప‌ట్టాయో చెప్ప‌గ‌ల‌వా?"

శిష్యుడు తెల్ల‌మొహం వేశాడు. బుర్ర‌గోక్కున్నాడు. ఆపై అన్నాడు, "చాలా అన్యాయం గురూగారూ! ఇంత చిక్కుప్ర‌శ్న వేస్తే ఎలాగండీ?" 

గురువుగారు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేశారు, "నిజ‌మేరోయ్ ఇది నిజంగా చిక్కు ప్ర‌శ్నే. దీనికి స‌రైన స‌మాధానం చెప్పాలంటే మ‌హామ‌హుల‌కే సాధ్యం కాదు... నేను కూడా అధినేత‌లుంగారు కుర్చీ ఎక్కాక ఓ ఏడాది వ‌ర‌కు లెక్కెట్టాన్రా... హైకోర్ట‌ను, సుప్రీంకోర్ట‌ను ఏడాదిపాల‌న‌లో మంద‌లింపులో, చివాట్లో, మొట్టికాయ‌లో, చెంప‌దెబ్బ‌లో, తీవ్ర ఆస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డ‌మో... ఇలా ఏదైనా అనుకో... ఏడాది కాలంలో దాదాపు 65 సంద‌ర్భాలు ఉన్నాయిరా! అవీపాటికి శ‌త‌మానం దాటేసి ఉంటాయి. మ‌రి మానం, మ‌ర్యాదా ఉన్న నేత ఎవ‌డైనా అయితే ఈ పాటికి ఆత్మ విమ‌ర్శ చేసుకుని, సిగ్గు ప‌డిపోయి, త‌న త‌ప్పులేంటో తెలుసుకుని, తీరు మార్చుకుని, సమీక్షించుకుని, స‌రిదిద్దుకుని, విశ్లేషించుకుని, చెంప‌లేసుకుని, జాగ్ర‌త్త‌ప‌డి,అప్ర‌మ‌త్తుడై, జాగురూకుడై, స‌రైనా దారిలో న‌డుస్తాడా లేడా?" 

"మ‌రంతే క‌దండీ? మ‌నిష‌న్న వాడెవ‌డైనా, సిగ్గూశ‌రం ఉన్న‌వాడెవ‌డైనా చేసేప‌ని ఇదేకందండీ?" 

"కానీ మ‌ర‌లా జ‌రుగుతోందా?"

"అబ్బే... ఎక్కడండీ?  దున్న‌పోతు మీద వ‌ర్షం ప‌డుతున్న‌ట్టు ఉంది క‌దండీ ప‌రిస్థితి..."

"మ‌ర‌దే నువ్వు నేర్చుకోవ‌ల‌సింది. నికార్స‌యిన నీచ రాజ‌కీయ పాఠాలు నేర్చుకునేవాడికి ఆయ‌నొక న‌డిచే విజ్ఞాన భాండాగారం. నిస్సిగ్గు రాజ‌కీయాల నిగ్గు తేల్చే నిఘంటువు. ఉదాహ‌ర‌ణ‌కు హైకోర్టు వాత పెట్టిన తాజా ప‌రిణామం చెప్పు, నీ ప‌రిజ్ఞానం ఎంతుందో చూద్దాం..."

శిష్యుడు కాసేపు ఆలోచించి చెప్పాడు, "ఆ...గుర్తొచ్చింది గురూగారూ! ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను హైకోర్టు ర‌ద్దు చేసింది క‌దండీ? అంత‌కంటే సిగ్గుచేటు ఇంకేముంటుందండీ? నాకు తెలిసి ఇలా జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారేమోనండి... ఆయ్‌!"

"శెభాష్ బాగా చెప్పావ్‌. మ‌రి తాజాగా సుప్రీం కోర్టు పెట్టిన చివాట్లేంటో కూడా చెప్పు చూద్దాం, నీకెంత గుర్తుందో?"

"గుర్తు లేకేండీ?  సొంత పార్టీ ఎంపీపై అడ్డ‌గోలుగా పెట్టిన  కేసులో పోలీసులు అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు ప్రాథ‌మిక నిర్దార‌ణ‌కు వ‌చ్చానందండి. మ‌రది  చాల‌దండీ, జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం ప‌రువు దెబ్బ‌తినింద‌ని చెప్ప‌డానికి?  ప్ర‌భుత్వానికే కాదండి, ప్ర‌జానీకానికి కూడా ఎంత నామ‌ర్దా అండీ?"

"బాగా చెప్పావ్‌. కానీ ఎక్క‌డైనా మ‌న నేత సిగ్గుప‌డ‌డం చూశావా?  పైగా సుప్రీం కోర్టు తీర్పుకు కూడా వ‌క్ర‌భాష్యాలు చెప్పే ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డం లేదూ? అదీ నువ్వు నేర్చుకోవ‌ల‌సిన మొదటి సూత్రం.  న్యాయ స్థానం తీర్పుని కూడా మ‌సిపూసి మారేడు కాయ చేసే తెలివితేట‌లు వంట ప‌ట్టించుకో. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్య ప్ర‌మాణాలు దిగ‌జారాయ‌ని హైకోర్ట్‌ వ్యాఖ్యానిస్తే, ప‌ట్టించుకోకుండా ఉండ‌గ‌లిగే తెగువ‌ను అల‌వర్చుకో. న్యాయ పాల‌న‌ను బ‌ల‌హీన ప‌రుస్తూ, న్యాయ‌వ్య‌వ‌స్థ‌నే బెదిరించే తెంప‌రిత‌నాన్ని అల‌వాటు చేసుకో. నిజాలు రాసే మీడియా సంస్థ‌ల‌పై కేసులు బ‌నాయించే జ‌గ‌మొండిత‌నాన్ని న‌ర‌న‌రానా ఎక్కించుకో. ఎవ‌రైనా నీమీద విమ‌ర్శ‌లు చేస్తే, అందులో  నిజానిజాలు విశ్లేషించుకోవ‌డం మానేసి, వాళ్ల‌పై రాజ‌ద్రోహం కేసు బ‌నాయించే దౌర్జ‌న్య రాజ‌కీయాన్ని ఔపాస‌న ప‌ట్టు. పోలీసు యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని,  బెదిరించి నీ ఆలోచ‌న‌లకు అనుగుణంగా న‌డుచుకునేలా చేయ‌గ‌లిగే రాజ‌కీయ రౌడీయిజాన్ని ఎలా చెలాయించాలో  అవ‌గాహ‌న చేసుకో. సీఐడీ విభాగాన్ని నీ వ్య‌క్తిగ‌త ప‌గ‌ల‌కు, ప్ర‌తీకారాల‌కు వీలుగా వ్య‌వ‌హ‌రించేలా చేయ‌గ‌లిగే రాజ‌కీయ గుండాయిజాన్ని గుండెల నిండా నింపుకో. ప్ర‌భుత్వ భూముల‌ను ప్రైవేటు వ్య‌క్తుల‌కు, సంస్థ‌ల‌కు కేటాయించ‌డానికి ఓ విధానం అంటూ లేదా అని న్యాయ‌స్థానం ప్ర‌శ్నిస్తే, ఏమాత్రం ప‌ట్టించుకోకుండా నీ ప‌ద్దతిలో నువ్వు సాగిపోయే నిబ్బ‌రాన్ని అభ్యసించు. క‌రోనా నేప‌థ్యంలో దేశంలో చాలా రాష్ట్రాలు ప‌రీక్ష‌ల్ని ర‌ద్దు చేసినా,  నేను మాత్రం నిర్వ‌హిస్తానంటూ ల‌క్ష‌లాది విద్యార్ధులను, త‌ల్లిదండ్రుల‌ను చివ‌రి వ‌ర‌కు ఆందోళ‌న‌కు, క్షోభ‌కు గురిచేసే 

మొండి మోటు విధానాల్నివ‌ల్లెవేసుకో. స్వ‌తంత్ర సంస్థ అయిన ఎన్నికల క‌మీష‌న్ నీకు అనుగుణంగా న‌డుచుకోక‌పోతే ఆ సంస్థ ఉన్న‌తాధికారినే మార్చేసే తెగువ‌ను తెలుసుకో. క‌రోనాతో జ‌నం అల్లాడిపోతున్నా, ఆ సంగ‌తి గాలికొదిలేసి నీ రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ల‌కే ప్రాముఖ్యాన్నిచ్చే ప్ర‌జ్ఞ‌ను అల‌వ‌ర్చుకో. ఇలా ఒక‌టా రెండా... ఇక్క‌డి నేత‌ని, అత‌డి అనుచ‌రుల‌ను ప‌రిశీలిస్తుంటే నీచ రాజ‌కీయ ప్ర‌హ‌స‌నంలో సూత్రాలు వేల‌కు వేలు. రాసుకుంటున్నావా?" 

ఆ పాటికే శిష్యుడు చెమ‌ట‌లు క‌క్కేస్తున్నాడు. ఆయాస‌ప‌డిపోతూ, "గురూగారూ! ఇక ఆపేయండి. నా నోట్స్ పుస్త‌కం అయిపోయిందండి. అరాచ‌క సూత్రాలు రాసుకోలేక చేతులు నెప్పులు పుడుతున్నాయండి..." అన్నాడు.

గురువుగారు న‌వ్వి, "స‌రే ఇక పోయిరా. ఇంత‌కీ నీ బాస్ తిట్టాడ‌నే సిగ్గు పోయిందా?"

"ఇంత విన్నాక ఇక సిగ్గా, ఎగ్గా గురూగారూ! నా బాస్ మీద ఉద్యోగ ద్రోహం కేసు పెడ‌తానండి. నేను చేసింది త‌ప్పే కాద‌ని జ‌గ‌మొండిగా వాదించేస్తానండి. ఇక ఉంటానండి!" 

-సృజ‌న‌

PUBLISHED IN JANASENA WEBSITE ON 29.5.21

ఆదివారం, మే 23, 2021

అరాచ‌క రాజ‌కీయం!




"అన‌గ‌న‌గా ఓ రాజ్యంలో ఓరాజుగారు..."

-అంటూ మొద‌లుపెట్టారు గురువుగారు. శిష్యుడు ఉత్సాహంగా ముందుకు ఒంగి కూర్చుని, "ఏ రాజ్యంలోనండీ...?" అన‌డిగాడు.

"ఏదో అరాచ‌క రాజ్యంరా... మ‌ధ్య‌లో ప్ర‌శ్న‌లు అడ‌క్కు... నీకంత‌గా కావాల‌నుకుంటే మ‌న ఆంధ్ర రాష్ట్ర‌మే అనుకో. పోయేదేముంది?  ముందు క‌థ విను..."

"మ‌న్నించండి గురూగారూ. చెప్పండి" అన్నాడు శిష్యుడు నాలిక్క‌రుచుకుని.

"స‌రే... ఆ రాజుగారికి తానంత గొప్ప‌వాడు మ‌రొహ‌డు ఉండ‌డ‌ని  మా చెడ్డ న‌మ్మ‌కం. ఆ సంగ‌తిని ఆయ‌న మంత్రులు, స‌హ‌చ‌రులు, అనుచ‌రులు ఎలాగో ప‌సిగ‌ట్టేశారు. ఇంకేముంది?  రాజుగారు 'ఊ...' అన్నా గొప్పే. 'ఊహూ' అన్నా గొప్పే. 'ఆహా... ఏం చెప్పారండీ, ఇంత గొప్ప ఆలోచ‌న‌లు ఇంకెవరికొస్తాయండీ, తమ‌కి కాక‌?' అంటూ భ‌జ‌న చేసేవాళ్లు. దాంతో ఆయ‌న‌కిక ఎటు చూసినా ప్ర‌శంస‌లే వినిపించేవి. పొగ‌డ్త‌లే క‌నిపించేవి. చివ‌రాక‌రికి ఆయ‌న పొగ‌డ్త త‌ప్ప మ‌రొక‌టి విన‌లేని ప‌రిస్థితికి చేరిపోయాడు. ఎవ‌రైనా ఎక్క‌డైనా విమ‌ర్శిస్తే అగ్గిమీద గుగ్గిలం అయిపోయేవాడు. మ‌రి  ఆయ‌న మీద ఆయ‌న‌కున్నంత న‌మ్మ‌కం రాజ్యంలో ప్ర‌జానీకానికి ఉందాలేదా అని అడ‌క్కు. అది మ‌న‌క‌న‌వ‌స‌రం. ఏం? ఓసారి రాజుగారు కోట మీద ప‌చార్లు చేస్తూ త‌న గొప్ప‌ద‌నం గురించి తెగ ఆలోచించి సంబ‌ర‌ప‌డిపోతున్నారు. 

'నిజ‌మే.... ఇంత రాజ్యాన్ని ఇంత‌బాగా ప‌రిపాలిస్తున్న నేను చాలా గొప్ప‌వాడిని' అనుకున్నాడు.

ఆ ప‌క్క‌నే చెట్టుమీద ఉన్న కాకి అరిచింది.

'అస‌లు... ప్ర‌జ‌ల గురించి ఇంత‌గా ఆలోచించే నేను చాలా ఉన్న‌తుడిని కూడా...' అనుకున్నాడు.

చెట్టుమీద కాకి మ‌ళ్లీ అరిచింది. 

'నేనెంతో సౌమ్యుడిని. ధ‌ర్మాత్ముడిని.  గొప్ప ప‌రిపాల‌నా ద‌క్షుడిని' అనుకున్నారు రాజుగారు. 

చెట్టు మీద కాకి వ‌ర‌స‌గా మూడు సార్లు అరిచింది. 

అంతే... ఆయ‌న‌కి ఎక్క‌డ లేని కోపం వ‌చ్చింది. 

'ఎవ‌ర‌క్క‌డ‌?' అని అరిచారు. 

'చిత్తం ప్ర‌భూ' అని వ‌చ్చారు రాజ భ‌టులు.

'వెంట‌నే ఆ చెట్టుమీద కాకికి మ‌ర‌ణ శిక్ష విధించండి...' అంటూ రాజుగారు హుంక‌రించారు.

వాళ్ల‌కేం అర్థం కాలేదు. మొహ‌మొహాలు చూసుకున్నారు. ఆపై భ‌య‌ప‌డుతూనే అడిగారు. 

'క‌... క‌... కాకికా మ‌హారాజా...?'

'అవును. కాకికే. అది రాజ‌ద్రోహం చేసింది. అందుకే... ' అంటూ అరిచారు.  

అంతే... రాజ భ‌టులు, మంత్రులు, వందిమాగ‌ధులు, అనుచ‌రులు, స‌హ‌చ‌రులు... అంద‌రూ పొలోమ‌ని బ‌య‌ల్దేరారు  కాకి మీద దండ‌యాత్ర‌కి. వింటున్నావా?" అని అడిగారు గురూగారు.

"భ‌లే ఉందండీ క‌థ‌.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందండీ?" అని అడిగాడు శిష్యుడు. 

"క‌థ సంగ‌తి అలా ఉంచ‌రా... ఇప్పుడో ప్ర‌శ్న అడుగుతాను  చెప్పు.  ఇంత‌కీ రాజుగారికి ఆ చెట్టు మీద కాకి మీద అంత ఆగ్రహం ఎందుకు క‌లిగింది?   కాకి చేసిన రాజ‌ద్రోహం ఏమిటి?"

శిష్యుడు ఎంత ఆలోచించినా స‌మాధానం తెలియ‌లేదు. 

"నాకు త‌ట్ట‌డం లేదు గురూగారూ. అంత గొప్ప రాజుగారికి ఆ కాకి మీద అంత ద‌గ్డ ఎందుకండీ?" అన‌డిగాడు.

"నాకు తెలుసురా. నీకు అర్థం కాద‌ని. జ‌వాబు చాలా సులువురా. కాకి ఏమ‌ని అరుస్తుంది?"

"కావు...కావు... అని" అన్నాడు శిష్యుడు బుర్ర‌గోక్కుంటూ. 

గురూగారు న‌వ్వేసి చెప్పారు... "అదే మ‌రి దాని త‌ప్పు.  ఆయ‌న త‌నెంతో గొప్ప‌వాడిని అనుకుంటే అది 'కావు.. కావు...' అంది.  ఉన్న‌తుడిని అనుకుంటే 'కావు.. కావు' అంది. సౌమ్యుడిని, ధ‌ర్మాత్ముడిని, ప‌రిపాల‌నా ద‌క్షుడిని అనుకంటే మ‌ళ్లీ అదే కూత కూసింది. అదీ సంగ‌తి. అర్థమైందా?"

శిష్యుడు తెల్ల‌బోయాడు. 

"వీడెక్క‌డి రాజండీ? ఏమ‌న్నా అర్థం ఉందా?  ఇలాంటి రాజు ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ఉంటాడాండీ అస‌లు?  బుర్రా, బుద్ధీ ఉన్న రాజెవ‌డైనా త‌న ప్ర‌జ‌ల గురించి, వాళ్ల స‌మ‌స్య‌ల గురించి ఆలోచిస్తాడు కానీ, ఇలాంటి ప‌నికిమాలిన, పిచ్చి విష‌యాల‌ను ప‌ట్టించుకుంటాడాండీ... "  అంటూ ఆయాస‌ప‌డ్డాడు.

గురువుగారు తాపీగా ప‌డ‌క్కుర్చీలో జార‌గిల ప‌డి, "ఎందుకు ఉండ‌డ్రా... ఓసారి ఊహా ప్ర‌పంచంలోంచి వాస్త‌వ ప‌రిస్థితుల్లోకి వ‌చ్చి నీ చుట్టూ జ‌రుగుతున్న ప‌రిణామాలు చూడు. ఎక్క‌డదాకానో ఎందుకు నీ రాష్ట్రంలోనే క‌నిపిస్తాడు..." అన్నారు. 

 కాసేపు ఆలోచించిన శిష్యుడి మొహం  పెట్రోమాక్స్ లైట్‌  లాగా వెలిగింది.

"అర్థ‌మైంది గురూగారూ! ఏవో విమ‌ర్శ‌లు చేశాడ‌ని సొంత పార్టీ ఎంపీ మీద‌నే క‌క్ష‌క‌ట్టిన అధినేత‌ను మ‌ర్చిపోయానండి. అయినా నాకు అర్థం కాక అడుగుతానీండి, ఓ ప‌క్క జ‌నం క‌రోనాతో అల్లాడిపోతుండ‌గా... మ‌రో ప‌క్క స‌రైన స‌దుపాయాలు అంద‌క ప్రాణాలు అడుగంటిపోతుండ‌గా... ఇంకో ప‌క్క ఈ విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎన్నాళ్లు ఉంటాయో తెలియ‌ని అయోమ‌య దుస్థితి నెల‌కొని ఉండ‌గా... అవేమీ ప‌ట్ట‌కుండా, ప‌ట్టించుకోకుండా... ప్ర‌జ‌ల గురించి ఆవేద‌న ప‌డ‌కుండా... ఈ ద‌య‌నీయ స్థితిగ‌తుల నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి మొత్తం యంత్రాంగాన్నంత‌టినీ ఏకత్రాటిపై న‌డిపించాల్సింది పోయి... రోజుకు 24 గంట‌లూ యుద్ధ‌ప్రాతిప‌దిక మీద నిరంత‌రం నిర్ణ‌యాలు తీసుకుంటూ, వాటి ఫ‌లితాలను విశ్లేషించుకుంటూ, న‌మ్ముకుని ఓటేసిన ప్ర‌జల బాగోగుల కోసం అహ‌ర‌హం త‌ప‌న ప‌డాల్సింది పోయి... ఎవ‌డో ఏదో అన్నాడ‌ని ఇలాంటి ప‌నులు చేయ‌డ‌మేంటండీ? ఇలాంటి ప్ర‌తిచ‌ర్య‌ల‌కు ఇదాండీ స‌మ‌యం?  దీని కోస‌మాండీ, చ‌ట్టాన్ని, పోలీసుల్ని, అనుచ‌రుల్ని, స‌హ‌చ‌రుల్ని వాడ‌డం? మ‌రో ప‌క్క ఇలాంటి దిగ‌జారుడు, దివాళాకోరు, ద‌గుల్బాజీ, దౌర్భాగ్య‌, దారుణ చ‌ర్య‌ల‌ను ఉన్న‌త న్యాయ‌స్థానాలు సైతం త‌ప్పుప‌డుతున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదాండీ? ఇదెంత సిగ్గుచేటండీ. రాష్ట్రం ప‌రువు దేశ‌వ్యాప్తంగా ప‌ల్చ‌నైపోదండీ?  అబ్బే... నా రక్తం ఉడికిపోతోందండి... మీరేమ‌న్నా అనుకోండి అంతే..." అంటూ శిష్యుడు ఊగిపోయాడు.

గురువుగారు న‌వ్వి, "ఆగ‌రా బ‌డుద్దాయ్‌! కాస్త నీ ఆవేశాన్ని ప‌క్క‌న పెట్టు. నువ్వొచ్చింది రాజకీయ పాఠాలు నేర్చుకోడానిక‌న్న సంగ‌తి మ‌ర్చిపోకు. ఓ నేత‌గా ఎద‌గాల‌నుకునే నీకు ఇంత‌కంటే గొప్ప నీచ సూత్రాలు ఎక్క‌డ దొరుకుతాయిరా?  అధికార‌మే ప‌ర‌మావ‌ధి అనుకుని రంగంలోకి దిగాక‌, ఇలాంటి ప‌నులు చేయ‌డానికి సిగ్గు ప‌డ‌కూడ‌దురా. అస‌లు సిగ్గూ ఎగ్గూ వ‌దిలేయ‌క‌పోతే రాజ‌కీయాల్లో ఎలా రాణిస్తావురా? ఈ మొత్తం వ్య‌వ‌హారంలో గూడార్థం చూడు. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు మ‌న అమ్ముల పొదిలో అస్త్రాల్లాంటివిరోయ్‌! వాటిని ఎలా వాడాలో కానుకోవాలి. ఇవి లేకుండా అస‌లు అధికారంలోకి రావ‌డం సాధ్య‌మ‌వుతుందా చెప్పు? ఒక‌ప్పుడు ఈ నేత‌, ఆయ‌న పితా కూడా ఊరూవాడా పాద‌యాత్ర‌లు చేసి, అధికారంలో ఉన్న‌వారిని నానా తిట్లూ తిట్టి, అడ్డ‌మైన ఆరోప‌ణ‌లు చేసి, దుమ్మెత్తి పోసి, విమ‌ర్శలు గుప్పించి, జ‌నాన్ని ఏమార్చి కుర్చీ ఎక్కిన వాళ్లే క‌ద‌ట్రా! మ‌రా సంగ‌తి మ‌ర్చిపోతే ఎలా? అధికారం అందాక కూడా అనుచ‌రుల చేత‌, స‌హ‌చ‌రుల చేత, మంత్రుల చేత చేయిస్తున్న ప‌నే వితండ విమ‌ర్శ‌ల వింత పురాణ  పారాయ‌ణే క‌ద‌రా? అలాంటి విమ‌ర్శ‌ల్ని, ఆరోప‌ణ‌ల్ని మ‌నం వాడుకోవాలి కానీ, మ‌రొక‌డిని వాడ‌నిస్తే ఎలారా? మ‌రిలాంటి విమ‌ర్శ‌లే రేపు పెద్దవై, ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని పాడుచేస్తే కుర్చీకింద‌కి నీళ్లు వ‌స్తాయోమోన‌నే భ‌యం, ముందు జాగ్ర‌త్త, ఉలికిపాటు, ఉడుకుమోత్తనం లేక‌పోతే ఎలారా? అందుకే ఎక్క‌డ ఎవ‌రు ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిపోవాలి. వాడి మీద వీల‌యిన‌న్ని అడ్డ‌గోలు కేసులు బ‌నాయించి, అనుచ‌రుల చేత అవాకులు, చెవాకులు వాగించి, పోలీసుల్ని ఎగ‌దోసి, థ‌ర్డ్ డిగ్రీలో, థౌజండ్ డిగ్రీలో ఉప‌యోగించి, చీక‌టి కొట్లో ప‌డేసి దుండ‌గుల చేత చిత‌గ్గొట్టించి, మ‌క్కెలిర‌గ‌ద‌న్ని, కుళ్ల‌బొడిచి, కాళ్లు విర‌గ్గొట్టి, ఒళ్లు హూనం చేసి మ‌రీ వ‌ద‌లాలి.  ఇక‌పై ఎవ‌రూ కూడా నోరెత్త‌డానికి కూడా భ‌య‌ప‌డేలా చేయాలి.  అదీ అస‌లు రాజ‌కీయం! అర్థ‌మైందా నీ మ‌ట్టి బుర్ర‌కి?" అన్నారు.

శిష్యుడు ఆవేశం నుంచి తేరుకుని, "త‌మ‌రింత‌గా చెప్పాక అర్థం కాక చ‌స్తుందాండీ?  కానీ నాదో సందేహం గురూగారూ! మ‌రిలాంటి  నీచ‌, నికృష్ట‌, నిర్ల‌జ్జాక‌ర‌, నిర్ల‌క్ష్య‌, దుష్ట‌, దురంత‌, దురంహంకార‌, దుర్మార్గ‌, దుర్భ‌ర‌, దారుణ చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించి, చైత‌న్య పూరితులైపోతే అస‌లుకే మోసం వ‌స్తుంది క‌దాండీ?" అని అడిగాడు.

గురువుగారు ప‌క‌ప‌కా న‌వ్వారు. "ఓరినీ అమాయ‌క‌త్వం అడ‌వులు ప‌ట్టిపోనూ! ప్ర‌జ‌ల మీద‌, వాళ్ల చైత‌న్యం మీద న‌మ్మ‌కం ఉన్న‌వాడెవ‌డైనా ఇలాంటి ప‌నులు చేస్తార్రా? ఇలాంటి వాళ్ల దృష్టిలో ప్ర‌జ‌లు ఒట్టి వెర్రిబాగులోళ్లు!  తాత్కాలిక తాయిలాల‌కి ఎగ‌బ‌డి ఓట్లు గుద్దేసే అమాయ‌కులు! జ‌నం మీద ఇంత‌టి చుల‌క‌న భావం పెంచుకోవ‌డం కూడా నీచ రాజ‌కీయ సోపానంలో ఓ నిచ్చెనేరా!  ఇలాంటి ఆలోచ‌న‌లు పెట్టుకోకుండా అధికారం ఉన్నందుకు దాన్ని ఎంత దారుణంగా వాడుకోవాలో అది నేర్చుకోవాలి ముందు. తెలిసిందా? ఇక పోయిరా!" 

-సృజ‌న‌


 PUBLISHED IN JANASENA WEBSITE ON 21.5.21

సోమవారం, మే 17, 2021

ప్రజల ప్రాణాలతో చెలగాటం!


 

“రండి బాబూ రండి... ఆలసించిన ఆశాభంగం... మంచి తరుణం మించిన దొరకదు... భలే మంచి చౌక బేరం... ఆసుపత్రి బెడ్లు... ఆక్సిజన్ సిలెండర్లు... రెమ్డెసివర్ ఇంజక్షన్లు... కరోనా కిట్లు... మీ కోసమే సిద్ధం చేశాం... రండి బాబూ రండి!”

- గురువుగారు చేతిలో పెట్టిన కాగితం చూసి శిష్యుడి మతి పోయింది. అర్థం కాక అయోమయంగా చూస్తూ గురువుగారినే అడిగాడు.
“ఇదేంటి గురూ గారూ! నేనేదో రాజకీయ పాఠాల కోసం మీ దగ్గరకి వస్తే, ఇదేదో కాగితం ఇచ్చి కంఠతా పట్టి అప్పజెప్పమంటున్నారు?”
“ఒరే రాజకీయ పాఠాలకేంరా? అయ్యెప్పుడూ ఉంటాయి. ముందు అర్జంటుగా లక్షలు, కోట్లు సంపాదించే మార్గం చూడరా. ఇలా అడ్డగోలుగా వెనకేశావనుకో, ఆనక రాజకీయాల్లో నిలబడితే పస లేని పథకాలకి ఖర్చు పెట్టడానికైనా పనికొస్తాయ్. ఏమంటావ్?”

“ఊరుకోండి గురూగారూ! ఇవన్నీ దొరకకే దండీ,  ఆంధ్ర ప్రజానీకం అల్లాడిపోతుంట? దొరకని వస్తువులతో వ్యాపారం చేయడమేంటండి?”
“ఒరేయ్ పిచ్చి సన్నాసీ! ఈటన్నిటినీ ముందు నువ్వు ఎలాగోలా దొరకపుచ్చుకోవాల్రా. ఆనక ఆటిని నీ ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మేసుకోవచ్చు. సమస్యలోంచే అవకాశాలు వెతుక్కోవాలనే ఇంగితం తెలీదట్రా నీకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే కదరా, మా మంచి లాభసాటి వ్యాపారం?”
“అదేంటండీ... రాష్ట్రంలో కరోనా రోగులకు ఎలాంటి భయాలు అక్కర్లేదని, రెమ్డెసివర్ ఇంజక్షన్లు గట్రా పుష్కలంగా దొరుకుతున్నాయని, దేనికీ కొరతే లేదని ఇప్పుడే ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన టీవీల్లో చూసి వస్తుంటేనూ? మీరిలాగంటారేంటి?”
“అది సరేరా... మరి రాష్ట్రంలో వాస్తవంగా ఉన్న పరిస్థితేంటో నువ్వు చెప్పు, నీ అవగాహన ఎంతో చూద్దాం...”
“ఏముందండీ? దినదిన గండంగా ఉందండి. ఎప్పుడెవరికి మూడుతుందో తెలియడం లేదండి. కరోనా వచ్చిందంటే ఆసుపత్రులు కాపాడతాయనే ఆశ ఏ కోశానా కనబడ్డం లేదండి. కరోనా పరీక్షకని వెళితే, అదే రోజు జరుగుతుందో లేదో అనుమానమండి. పరీక్షించే పరికరాలు కావలసినన్ని లేవంటున్నారండి. ఒకవేళ పరీక్ష జరిగి పాజిటివ్ వస్తే రోగులకిచ్చే కిట్లు లేవంటున్నారండి. కర్మకాలి పరిస్థితి విషమించి ఆసుపత్రికి పరిగెడితే అక్కడ బెడ్లు లేవంటున్నారండి. కిందా మీదా పడి బెడ్ దొరికినా, ఎగ ఊపిరి వస్తే ఆక్సిజన్ లేదంటున్నారండి. పోనీ అది కూడా దొరికి ముక్కుకి ఆక్సిజన్ గొట్టం తగిలించినా పూర్తిగా ఉంటుందో లేదో అనుమానమేనండి. మధ్యలోనే ఆక్సిజన్ అయిపోయి పోవచ్చండి. లేదా మరో చోటకి తరలిస్తుంటే మధ్యలోనే ప్రాణాలు హరీమనొచ్చండి. ఈ మధ్య విజయనగరం, ప్రొద్దుటూరు, గూడూరు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోందండి. అంతే కదండీ?”
“బాగానే చెప్పావురా... కానీ డబ్బులు వెదజల్లడానికి సిద్ధపడితే ఇవన్నీ దొరుకుతున్నాయని వినలేదా?”
“వినడమేంటండి బాబూ... కళ్లారా చూశానండి. మొన్న మా బాబాయ్కి ప్రాణం మీదకొస్తే ఇదే జరిగిందండి. రెమ్డెసివర్ ఇంజక్షన్ ముందు లేదన్నారండి. ఆ తర్వాత నలభై వేలకి దొరుకుతుందని చెప్పారండి. అందరం కలిసి డబ్బులు పోగుచేసి కడితే దొరికిందండి”
“మరంటే ఏంటి దానర్థం? ప్రజల కళ్ళ ఎదురుగానే బ్లాక్ మార్కెటింగ్ జరిగిపోతున్నట్టేగా? అంటే దొరకబుచ్చుకునే వాడికి ముందుగానే అవన్నీ దొరుకుతున్నట్టేగా? అందుకనే మరి నిన్ను కొన్నాళ్లు ఈ వ్యాపారం చేయమంట? అర్థమైందా?”
“ఛీ... ఛీ... ఇలాంటి నీచమైన పని నేను చేయలేనండి... ఇది ప్రజల శవాల మీద చిల్లర ఏరుకోవడం లాంటి దరిద్రమైన పని లాంటిదే కదండి? జనం ప్రాణాల్ని పణంగా పెట్టి మన లాభం మనం చూసుకోవడమే కదండి?”
“వార్నీ అలా ఆవేశపడిపోతే ఎలారా? ఒక రాజకీయ నేతగా ఎదగాలనుకుంటే ఇలాంటి అడ్డగోలు వ్యాపారాలు ఎన్నో చేయాలొరే! ఇలా వెనకేస్తే కానీ ఎన్నికల్లో గెలవలేవు కూడాను. ఇక్కడ రాజకీయ రంగోళీ ఆడుతున్నవారిని చూసైనా నేర్చుకోరా బడుద్ధాయ్! ముందు నీ మనసులోంచి ప్రజానీకం పట్ల జాలి, దయ, కనికరం, నిజాయితీ లాంటి లొల్లాయి భావాలన్నీ తుడిచేయ్! ఇది నీచ రాజకీయంలో నికార్సయిన పాఠం. అర్థమైందా?”
“మీరింతగా చెప్పాక అర్థం కాక ఏమవుతుందండీ? మరైతే నాదొక సందేహం గురూ గారూ! ఒకవేళ మీరు చెబుతున్న పాఠాలు ఒంటబట్టి, రేపో, ఎళ్లుండో, కొన్నాళ్లకో నేను ఓ పరగణాకి ముఖ్యమంత్రినై పోయాననుకోండి... మరప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలో అది కూడా కాస్త చెబుదురూ?”
“ఒరేయ్ ఆ రాజకీయ పాఠాలకి కూడా నువ్వు ఎక్కడికీ వెళ్లక్కర్లేదురా. హాయిగా ఆంధ్ర రాష్ట్రంలో పరిణామాలు గమనిస్తూ ఎప్పటికప్పుడు సూత్రాలు రాసుకున్నావనుకో. నాణ్యమైన నీచ రాజకీయ అధినేతగా ఎదిగిపోతావ్. ఓ పక్క ప్రజలు అల్లాడిపోతుంటే ఇక్కడి నేతలు ఏం చేస్తున్నరో కాస్త గమనించు. నిజాలకి మసిబూసి అబద్దాలుగా చెలామణీ చేయిస్తున్నారు. కళ్ల ముందు వేల మంది చనిపోతుంటే... శ్మశానాల్లో శవాలు క్యూలో పడుకుని ఉంటే, మృతుల లెక్క నికార్సుగా బయటకి వస్తోందా? లేదే! దానికంటే నిస్సిగ్గు అరాచకీయం ఎక్కడుంటుందిరా? మరో పక్క ప్రాణావసరమైన ఇంజెక్షన్లు సమయానికి దొరక్క జనం గిలగిలలాడిపోతుంటే, అబ్బే... ఆ ఇంజెక్షన్లకు అసలు కొరతే లేదంటూ టీవీ కెమేరాల్లో మైకుల ముందు మూతులు పెట్టి అబద్దపు కూతులు కూస్తున్నారే? అంతకు మించిన నికృష్ట నిబ్బరం మరెక్కడైనా కనిపిస్తోందిరా? అలా వాగడం నేర్చుకో. ఇక ఆసుపత్రల్లో బెడ్స్ లేక రోగులు అతలాకుతలం అయిపోతుంటే, ప్రభుత్వం ప్రకటించే డ్యాష్ బోర్డుల్లో మాత్రం బోలెడన్ని ఖాళీ బెడ్లు ఉన్నట్టు కాకి లెక్కలు చూపెడుతున్నారే? అలా అడ్డగోలుగా బుకాయించడం ఎలాగో అర్థం చేసుకో! ఆక్సిజన్ సరఫరా తగినంత లేదని తెలిసినా, ఆ కొరతను నివారించే బాధ్యత మరచి ఎలాంటి ప్రయత్నాలూ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నరే? ఆ బాధ్యతా రాహిత్యాన్ని నరనరానా ఒంటబట్టించుకో! కళ్ల ముందు జనం పిట్టల్లా రాలిపోతున్నా, ఎలాంటి చలనం లేకుండా పెను నిద్రపోతున్న ముఖ్య నేతల్ని చూసి, నీకు నీ కుర్చీ, అధికారం తప్ప మరేదీ ముఖ్యం కాదన్నంత దగుల్బాజీతనాన్ని ఎలా అలవర్చుకోవాలో ఆలోచించు. చనిపోయిన వాళ్ల బంధువులు, వాళ్ల బాధ చూడలేక ముందుకొచ్చిన ప్రజాసంఘాలు ఆవేశం పట్టలేక ఆందోళనలు చేస్తుంటే, వారి ఆవేదనని అర్థం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలనే ఇంగితం లేకుండా, అవన్నీప్రతిపక్ష నేతల కుట్రలంటూ అడ్డగోలుగా బుకాయించే నేర్పరితనం నేర్చుకో. తెలిసిందా?”
“అయ్య బాబోయ్! గురూ గారూ! బుర్ర తిరిగిపోతోందండి... ఇంతలేసి పాఠాలు ఎప్పుడూ వినలేదండి. ఇలాంటి సిగ్గుమాలిన, జగమొండి, శిఖండి, దగుల్బాజీ, దగాకోరు, దుర్మార్గ, దుర్భర, దుర్నీతి, దురంహంకార, దారుణాతి దారుణ నేతగా ఎదగాలంటే నాకు ఎన్నాళ్లు పడుతుందో అర్థం కావడం లేదండి... ఆయ్!”
“ఇవాళ్టికి చాలులే కానీ ఇక వెళ్లిరా! నీ ప్రాణాన్ని నువ్వే కాపాడుకో. నీ స్వీయ జాగ్రత్తే నీకు రక్ష”
                                                                                                                              -సృజన

PUBLISHED IN JANASENA SITE ON 12.5.21

ఆదివారం, మే 09, 2021

దివాళాకోరు తనం!



శిష్యుడు చెమలు క్కుకుంటూ చ్చేసరికి గురువుగారు డక్కుర్చీలో కూర్చునిఅప్పు చేసి ప్పుకూడు’ సినిమా చూస్తున్నారు.

“గురూగారూ! అర్జంటు నుండి చ్చానండి... మీరెలాగైనా రే నాకు అప్పు ఇవ్వాలి... లేదా ఇప్పించాలి...”

“ముందు కాస్త నిమ్మళించరా శిష్యా! కాసేపు సినిమా చూడు. అప్పు చేసి ప్పుకూడు. ఎన్టీవోడు ఎంత బాగా చేశాడ్రా... అన్నీ చేసి చివరాకరికి గొప్పకు అప్పులు  చేస్తే తిప్పలు ప్పని మా బాగా చెప్పార్రా...”

“ఆయ చెబితే చెప్పాడు కానీ... నాకు మాత్రం అప్పు కావాలి ర్‌... రిస్థితి ఘోరంగా ఉంది... ఇంటి నోళ్లకు జీతం ఇవ్వడానికి కూడా బ్బుల్లేవండి... జీతాలిస్తే ఇంటి అవరాలకు రిపోవండి... అవరాలు చూస్తే ఫీజులు ట్టలేనండి... ఫీజులు డితే తిండికి టండి... ఆయ్‌!”

“ఓరోరి ఆగరా శిష్యా! ... తెగ ఆయాసడిపోతన్నావ్‌. మొత్తానికి చూస్తే నీ ని ఆంధ్రప్రదేశ్ వ్వారంగా ఏడుస్తోందన్నమాట‌. కానీ నీలాగా ప్రభుత్వం కంగారు డుతోందా చెప్పు. ఎక్కడా సిగ్గూ ఎగ్గూ లేకుండా చేసిన నిర్వాకాన్ని ర్థించుకుంటోంది. రి అధినేతను చూసైనా నేర్చుకోవద్దురా, దిగాలు డిపోకూడని?”

“సార్‌... నేనేదో అవరం కోసం స్తే మీరు పాఠాలు మొదలెట్టారేంటి సార్‌... “

“ఓరి నీ డావుడి పాడుగానూ! నీకెలాగో ర్దుతాలే కానీ, ముందు నిదానించరా. బ్బులున్నప్పుడు ఎవడైనా ర్చుపెడతాడు. లేకపోయినా ర్చుపెట్టేవాడే హీరో. ఏమంటావ్‌?”

“ఇంకేమంటానండీ, మీరు ర్దుతానన్నాక ధైర్యం చ్చిందండి. కానీ నేనెక్క‌? రాష్ట్ర ప్రభుత్వం ఎక్క‌?  దాంతో పోల్చారేంటండీ?”

“ఒరే నువ్విక్క ఎలా దివాళా తీశావో, అక్కడది కూడా దివాళా తీయడానికి సిద్దంగా ఉందిరా రి... “

“అదేంటండీ... అంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వం నాలాంటి రిస్థితిలో డిపోవమేంటండీ?”

“అదేరా నీకు చెప్పబోయే పాఠం ఇవాళ‌. ఇంటినే రిదిద్దుకోలేని నువ్వు ప్రభుత్వం నేత నుంచి చాలా చాలా నేర్చుకోవాల్రా... అప్పుడు గానీ నీకు నిబ్బరం అబ్బదు...”

“బాబ్బాబూ... నిబ్బరం సంగతేంటో కాస్త చెప్పండి, నేర్చుకుంటాను...”

“సరేరా... ముందు నీకెన్ని అప్పులున్నాయో లెక్కట్టుకుని దాని రో 70 వేల రూపాయలు జోడించుకోరా. నువ్వు కూడా ణావాడివే దా?”

“అదేంటి సార్‌?  నా అప్పులతోనే వుతుంటే, రో 70 వేల రూపాయలు లుపుతారు. గుండె గుబేలు మంటోంది సార్‌!”

“మరదేరా బు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ నాభా దాదాపు 5 కోట్లు అనుకో. వాళ్లందరికీ లా 70 వేల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టాడ్రా నేత‌...”

“అయ్యబాబోయ్‌. అంతలేసి అప్పులా? ఎందుకు చేస్తున్నాడండీ అలా అడ్డగోలుగానూ?”

“ఒరే అది అడ్డగోలు నం కాదురా... నికార్సయిన నీచ రాజకీయ తంత్రం. నీలాంటి ర్ధమాన రాజకీయ నేతకి నిగ్గుతేలే నిస్సిగ్గు పాఠం... రే... సంగతి చెప్పు... నువ్వే నుక ముఖ్యమంత్రివయ్యావనుకో. ఏం చేస్తావ్‌?”

“ఆహా... ఊహే అద్భుతంగా ఉంది సార్‌! న్ను ఎన్నుకున్నప్రజానీకానికి మేలు చేయడానికి అహర్నిశం శ్రమిస్తానండి. రిశ్రమలు అవీ చ్చేలా చేసి, నం జీవ ప్రమాణాలు పెంచడానికి ష్టతానండి. ఉద్యోగాలూ అవీ ల్పించి ప్రలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలడి నిలదొక్కుకునేలా చేస్తానండి... ఇంకా...”

“ఏడిశావ్లే ఆపేసెయ్‌! నువ్విలా ఆదర్శాలు ట్రా ల్లించావనుకో. ఎందుకూ కొరగాకుండా పోతావ్‌. అందుకే అవన్నీ ట్టిపెట్టి రాష్ట్ర నేత నుంచి నాణ్యమైన నికృష్ట విధానాలు నేర్చుకోవాలి. నీ సొంత అధికారాన్ని కాపాడుకోడానికి బాధ్య‌‌తారాహిత్యంగా వ్యరించాలి. అర్థమైందా?”

“ఓహో అర్థమైందండి. ఇంతకీ ఏంచేశాడండీ ఆయ‌?”

“అద్గదీ ఇప్పుడు దార్లోకి చ్చావురా శిష్యా! ఆయ ప్రలకు తాత్కాలిక తాయిలాలు పంచిపెడుతున్నాడ్రా. అందుకోసం ఆచ సాధ్యం కాని కాలు చించాడునించలేదా?”

“అవునండి. బెడ్డలో, రాళ్లో అని కాలండి...”

“ఆ... రిగ్గా చెప్పావ్‌! ఆటిని ప్రటించి ఆశలు పెంచే, అధికారంలోకి చ్చాడు. అంచేత ఆటిని కొనసాగించడం కోసం ఎక్కడెక్క నుంచో అప్పులు చేస్తూ ఆఖరికి రాష్ట్రాన్ని దివాళా తీసే కు తీసుకువచ్చాడు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద అప్పులు లెక్కడితే ఏకంగా 3క్ష 73 వేల కోట్లకు పైగానే తేలింది. నేత అయిదేళ్ల అధికార కాలానికి అది ఆరున్న క్ష కోట్లకు చేరిపోయేలా ఉంది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించలేని రిస్థితి నిపిస్తోంది. క్క చేయించిన నులకు బిల్లులు చెల్లించపోవడంతో కొత్త నులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఆఖరికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కూడా అడ్డగోలుగా అమ్మకానికి పెట్టేస్తున్నాడు... ఇవన్నీచూస్తే నీకేమనిపిస్తోందో చెప్పు...”

“అయ్యబాబోయ్‌! రాష్ట్ర రిస్థితి నా ఇంటి రిస్థితి న్నా ఘోరంగా ఉన్నట్టుందండి. ఇలాగైతే మున్ముందు రాష్ట్రం రిస్థితి ఏమిటండీపాపం అన్యాయమైపోదాండీదివాళా తీస్తే ఎంత దారుణమండీ?”

“ఓరే... నీలో ఇంకా జాలీ, యా లాంటి గుణాలు ఉన్నట్టున్నాయిరా. అవి నువ్వు నీచ రాజకీయ నేతగా ఎదడానికి ఎందుకూ నికిరావు. కాబట్టి వాటిని వెంటనే దిలించుకో. అయినా... రాష్ట్రం ఎలా పోతే నీకెందుకురాదాని ప్రతిష్ట ఎలా బారితే నీకేల‌?  నీకు కావసింది అధికారం. ఓటేసే నానికి తాత్కాలిక తాయిలాలు డేస్తూ నువ్వు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీ వాళ్లకి, నీకు ముడుపులు చెల్లించే డా బాబులకీ భూములు, సెజ్లు ట్టబెడుతూ కుర్చీ ఎక్కి కాసుల థాకళి ఆడమే ముఖ్యం. ముందు పాఠాలు నేర్చుకో. అర్థమైందా?”

“ఆహా... అద్భతమైన పాఠాలు సార్‌.  కానీ నాదో సందేహం సార్‌. తాత్కాలిక తాయిలాల కోసం అంతలేసి సొమ్ములు ళ్లిస్తున్నాడు దా? రి ఆదాయం సంగతేంటండీ?”

“అయితే నువ్వు పూర్తిగా అక్కడి రిస్థితిని అర్థం చేసుకోలేదని తెలుస్తోందిరా. తాత్కాలికంగా ఇచ్చినట్టే ఇచ్చి రిమానాలు అవీ భారీగా పెంచేసి నం డ్డి విరగ్గొట్టడం లేదూతాయిలాల సొమ్ముతో నం తాగి తందనాలు ఆడతారని తెలిసి ద్యం లు పెంచేసి జెల్ల కొట్టి సూలు చేయడం లేదూ?”

“అద్భతం సార్‌. పైకి ప్రజాసేవ పేరు చెప్పి తాయిలాల డ్డింపు. ఆన దొడ్డిదారిన వాళ్ల గ్గ నుంచే పిండుకోవడం. ఎంత మంచి అడ్డదిడ్డ రాజకీయ పాఠాలండీ ఇవన్నీ? డుపు నిండిపోయిందండి. ఇక స్తానండి...”

 “మరి అప్పేదో కావాలని అడిగావ్‌? “

“అక్కర్లేదు సార్‌... నిస్సిగ్గు నేతని చూశాక ధైర్యం చ్చేసిందండి. ఇల్లు అమ్మేసి జల్సా చేస్తానండి. కుటుంబం ఏమై పోతే నాకేంటి చెప్పండి!”

-సృజ 

PUBLISHED IN JANASENA WEBSITE ON 8.5.2021