ఆదివారం, ఆగస్టు 29, 2021

ఉత్త‌మ చెత్త పాల‌న!


"ఏరా... నువ్వెన్నింటికి రావాలి? ఎన్నింటికి వ‌చ్చావునా కోసం నువ్వు ఎదురుచూడాలాలేక నీ కోసం నేను ఎదురుచూడాలా?" అంటూ క‌స్సుమ‌న్నారు గురువుగారు, శిష్యుడు రాగానే.

శిష్యుడు బిక్క‌మొహం వేసుకుని, "మన్నించండి గురూగారూ! అనుకోకుండా ఆలస్య‌మైపోయింది..." అన్నాడు విన‌యంగా.

"ఎందుకు ఆల‌స్య‌మైంది?"

"అదే సార్‌... లేట‌యిపోయింది..."

"ఒరే ఆల‌స్య‌మెందుకైందంటే లేట‌యిందంటావు... లేటెందుకైందంటే ఆలస్య‌మైందంటావ్‌. అస‌లు సంగ‌తి చెప్పి చావ‌వేం?"

"సార్... ఏం లేదు సార్‌... మీతో చెప్ప‌క‌పోవ‌డ‌మేంనాకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి... అవి చెబితే సిల్లీగా ఉంటాయి. అందుకే న‌సుగుతున్నాను సార్‌... అంతే..."

"ఒరే... సెంటిమెంట్లు సినీ న‌టుల ద‌గ్గ‌ర్నుంచి, రాజ‌కీయ నేత‌ల వ‌ర‌కు అంద‌రికీ  ఉంటాయి. త‌ప్పులేదు. వాటికి సిగ్గు ప‌డితే ఎలాసినిమా వాళ్ల సెంటిమెంట్ల గురించి అంద‌రికీ తెలిసిందే. ఇక రాజ‌కీయ నేత‌ల‌కి కూడా చిత్రవిచిత్ర‌మైన న‌మ్మ‌కాలు, అల‌వాట్లు ఉంటాయి.  ఒక నేత‌కి అర్థ‌రాత్రి దేవుడితో మాట్లాడడం సెంటిమెంటు కావ‌చ్చు. లేక‌పోతే చ‌నిపోయిన ఆత్మీయులతోనే ప‌రిపాల‌న గురించి చ‌ర్చించ‌డం సెంటిమెంటు కావ‌చ్చు. వాటి గురించి అధికారుల‌తో చెబితే వాళ్లు కంగు తిన‌చ్చు కూడా. కానీ మ‌న న‌మ్మ‌కాల గురించి ఏమాత్రం సిగ్గు ప‌డ‌కూడ‌దురా. ఒక అధినేత ఉన్న‌ట్టుండి గ‌డ్డం పెంచుతాడు. మ‌రో నాయ‌కుడు అక‌స్మాత్తుగా యాగాలు గ‌ట్రా చేయిస్తాడు. ఒక నాయ‌కుడు గుడి నుంచి యాత్ర‌లు మొద‌లు పెడితే, మ‌రో నాయ‌కుడు త‌ర‌చు తిరుప‌తికి పోయి గుండు కొట్టించుకుంటాడు. మ‌న‌కి కాషాయాలు క‌ట్టిన వాళ్లు, త‌ల‌పాగాలు చుట్టిన వాళ్ల గురించి కూడా తెలుసుక‌ద‌రా. అంతెందుకు... అంత‌రిక్షంలోకి పంపే రాకెట్టుని కూడా అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ‌నాయ‌కుడి కాళ్ల ముందు పెట్టే సైంటిస్టుల గురించి కూడా తెలుసు క‌దాకాబ‌ట్టి  నీ న‌మ్మ‌క‌మేదైనా నిర్భ‌యంగా, నిర్ల‌జ్జ‌గా ఇంకా మాట్లాడితే మ‌హ గొప్ప‌గా కూడా చెప్పుకోవ‌డం నేర్చుకో. ఇంత‌లా ఎందుకు అడుగుతున్నానంటే, నీలో సిగ్గు గ‌ట్రా పోగొట్ట‌డం కోసం.  ఇవి పోక‌పోతే ఇక నువ్వు రాజ‌కీయ పాఠాలు ఏం నేర్చుకుంటావు? ఓ బ‌రితెగించిన నేత‌గా ఎలా ఎదుగుతావుఅంచేత నువ్వు ఏం సెంటిమెంటు వ‌ల్ల ఆల‌స్యంగా వ‌చ్చావో చెప్పు..."

" అయితే స‌రే సార్‌... నేన‌స‌లు ఓ అర‌గంట ముందే రావాలండి. కానీ ఇలా వీధిలోకి వ‌చ్చానో లేదో, అలా చెత్త బండి ఎదురైందండి. చెత్త శ‌కునం వ‌స్తే ఇక మీ ద‌గ్గ‌ర రాజ‌కీయ పాఠాలు ఏం వంట‌బ‌డ‌తాయండీపైగా ప్ర‌తి మ‌లుపులోనూ చెత్త బ‌ళ్లేనండి బాబూ... అలా ఆగి, ఆగి వ‌చ్చేస‌రికి ఇంతాల‌స్యం అయిందండి... ఆయ్‌!"

"వార్నీ... చెత్త బండి అడ్డుప‌డింద‌న్న‌మాట‌. కానీ నీకో సంగ‌తి తెలుసురా... చెత్త బండి చెడ్డ శ‌కునం కాదురా... మా మంచి శ‌కునం... కావ‌లిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు వారిని అడుగు తెలుస్తుంది..."

"అయ్‌బాబోయ్‌... అదేంటండి బాబూ అలాగంటారుచెత్త బండి ఎదురైతే త‌ల‌పెట్టిన ప‌నుల‌న్నీ చెత్త‌యిపోతాయంటారు క‌దండీ... మ‌రి మీరు సర్కారువారిని అడ‌గ‌మంటారేంటండీ?"

"ఓరెర్రి శిష్యా... రాష్ట్రం మొత్తం మీద పేరుకుంటున్న చెత్తంతా ఇప్పుడు శ్రీ స‌ర్కారు వారికి సిరులు కురిపించే వన‌రైంది క‌ద‌రా... అంటే మ‌న రాష్ట్రంలో చెత్త బండి ఎదురొస్తే, సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి వ‌చ్చిన‌ట్టే క‌ద‌రా..."

"మీర‌న్నీ విచిత్రంగా చెబుతారు సార్‌... మీతో వాదించ‌డం క‌ష్టం... అయినా, ఇంత పెద్ద స‌ర్కారుకి చెత్త కుప్ప‌లు ఆదాయాన్ని ఇవ్వ‌డ‌మేంటి సార్‌?"

"మ‌రి నువ్వు నీ చుట్టూ ఉన్న రాజ‌కీయ స్థితిగ‌తుల్ని ఏం పరిశీలిస్తున్నావురాకాస్తంతైనా సామాజిక స్పృహ ఉండ‌ద్దూ? మ‌రి మ‌న స‌ర్కారు వారు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నారు? ఎక్క‌డ ఎంత దొరుకుతుందా, ఎక్క‌డ ఎవ‌రు అప్పిస్తారా? ఎక్క‌డ నుంచి ఎంత‌ పిండుకోవాలా? ఆదాయ వ‌న‌రుల్ని ఎలా పెంచుకోవాలా? వ‌డ్డీలెలా క‌ట్టాలాజీతాలు, పింఛ‌న్లు ఎలా ఇవ్వాలాచెల్లించాల్సిన బ‌కాయిలు ఎలా తీర్చాలా? ఏ నిధుల్ని ఎలా మ‌ళ్లించాలా? ఏ ప‌థ‌కాల సొమ్ములో ఎలా కొర్రీలు వేయాలా? ఇదే క‌ద‌రా చింత‌! మ‌రి ఇంత‌టి దారుణ‌మైన ప‌రిస్థితి ఎందుకొచ్చింది? మ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం, మ‌న అధికారం కొన‌సాగ‌డం కోసం, మ‌న ప‌ద‌వి ప‌ది కాలాల పాటు సుస్థిరంగా ఉండ‌డం కోసం, అమాయ‌క జ‌నాన్ని ఊరించి, ప్ర‌లోభ‌పెట్టి, ప‌దో ప‌ర‌కో ముట్ట‌జెప్పి, కోట్ల‌కుకోట్లు కొల్ల‌గొట్టే అవ‌కాశం కోసం, అనాలోచితంగా, అడ్డ‌గోలుగా కేవ‌లం ప్ర‌జాక‌ర్ష‌ణ‌ను మాత్ర‌మే దృష్టిలో పెట్టుకుని సృష్టించిన ప‌థ‌కాల‌ను మొండిగా, జ‌గ‌మొండిగా అమలు చేయ‌డం కోసం, రాష్ట్రం భ‌విష్య‌త్తు అనేది ప‌ట్టించుకోకుండా, రాష్ట్రం ఏమైపోయినా నాకేమ‌నేంత నిర్లక్ష్యంగా, రాష్ట్రం దివాళా తీసినా ప‌ట్ట‌నంత అనాలోచితంగా, అహంకారంగా, ఇష్టారాజ్యంగా, బాధ్య‌తార‌హితంగా, తెంప‌రిత‌నంతో ప్ర‌వ‌ర్తించ‌డం వల్ల‌నే క‌ద‌రా! మ‌రి అలాంటి ప‌రిస్థితుల్లోనే క‌ద‌రా, చెత్త మీద సైతం ప‌న్ను ప్ర‌వేశ‌పెట్టింది మ‌న స‌ర్కారు?"

"అయ్య‌బాబోయ్‌... ఇంతుందాండీకానీ గురూగారూ, చెత్త‌ను శుభ్రం చేయ‌డం స‌ర్కారు వారి బాధ్య‌తే కదండీ, మ‌రి దాని మీద కూడా ప‌న్ను వేసేంత ప‌రిస్థితి రావ‌డానికి ఇద‌న్న‌మాట కార‌ణం... అయితే రాజ‌కీయాల్లో ఇదెలాంటి పాఠం గురూగారూ?"

"అస‌లు సిస‌లైన నీచ రాజ‌కీయ అధ్యాయంరా. నిజానికి నీకు ప్ర‌జ‌ల గురించి ప‌ట్ట‌దు... నీ దృష్టంతా కేవ‌లం ఓటు రాజ‌కీయాల మీద‌నే ఉండాలి. అందుకోసం ప్ర‌జ‌ల‌కు ఇంచుమించు లంచం ఇచ్చేలాంటి ప‌థ‌కాలు ర‌చించాలి. ఆ ప‌థ‌కాల ద్వారా నీ ఓటర్ల కాతాల్లోకి జ‌మ‌య్యే సొమ్ముల‌న్నీ నీకు అప్ర‌తిహ‌త అధికార సింహాస‌నానికి సోపానాలేన‌న్న‌మాట‌. అర్థ‌మైందా?"

"అర్థ‌మైంది కానీ గురూగారూ! ఇలా చెత్త మీద ప‌న్నులాంటివి వేయ‌డం అంటే ప‌రోక్షంగా మళ్లీ ఆ భారాన్ని ప్ర‌జ‌ల మీద వేయ‌డ‌మే క‌దండీ?"

 

"క‌రెక్టుగా చెప్పావురా... కానీ అంత ఆలోచ‌న పాపం ప్ర‌జ‌ల‌కి ఉండ‌దురా. దానికి మూల్యం వాళ్లే చెల్లిస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కి ఇప్పుడు ఏం జ‌రుగుతోందో తెలుసుగాఆఖ‌రికి వితంతువుల‌కు, విక‌లాంగుల‌కు ఇచ్చే పెన్ష‌న్ డ‌బ్బుల్లో కూడా చెత్త ప‌న్నును మిన‌హాయించి, కోత విధించి చెల్లించారురా. దీన్నే గార్బేజ్ మేనేజ్‌మెంట్ అంటారు. అంటే చెత్త పాల‌న అన్న‌మాట‌. ఆఖ‌రికి నిస్స‌హాయుల‌కు ఆస‌రాగా ఇచ్చే డ‌బ్బుకి కూడా చెత్త క‌త్తెర వేస్తోంద‌న్న‌మాటే క‌దా? మ‌రి దీన్నేమంటారో నువ్వే చెప్పు?" 

"ఉత్త‌మ చెత్త పాల‌న‌!"

"శెభాష్‌... ఇక  పోయిరా. అన్న‌ట్టు చెత్త బండి శ‌కునం వ‌స్తేనే వెళ్లు. అప్పుడే నీకు ఇలాంటి నీచ రాజ‌కీయాలు ఒంట‌బ‌డ‌తాయి!"

-సృజ‌న‌

PUBLISHED ON 29.8.2021 ON JANASENA WEBSITE

 

 

  

మంగళవారం, ఆగస్టు 24, 2021

ప్ర‌జాకోర్టులో ప‌చ్చి నిజాలు!



గురువుగారింటికి వ‌చ్చిన శిష్యుడు పొర‌పాటున వేరే వారింట్లోకి వ‌చ్చేశాన‌నుకుని భ్ర‌మ ప‌డ్డాడు. ఎందుకంటే హాల్లో ఓ ప‌క్క‌న కోర్టులో ఉండే బోను  ఏర్పాటు చేసి ఉంది. మ‌రో ప‌క్క ఎత్తుగా జ‌డ్డిగారు కూర్చునే వేదిక‌లాంటిది ఉంది. దాని ముందు కోర్టు గుమాస్తా సీటు, న్యాయ‌వాదుల బ‌ల్ల‌లు అన్నీ ఉన్నాయి. అచ్చం కోర్టు సెట్టింగు వేసిన‌ట్టు ఉంది.

శిష్యుడు గిరుక్కున వెన‌క్కి తిరిగి వెళ్ల‌బోతుంటే గురువుగారి మాట‌లు వినిపించాయి.

"స‌రైన ఇంటికే వ‌చ్చావ్‌రా శిష్యా! ఇది మ‌నిల్లే. రా..." అంటూ పిలిచారు.

"మ‌రిందేంటి గురూగారూ! పొర‌పాటున ఏదో కోర్టులోకి వ‌చ్చేశానేమోన‌ని భ‌య‌ప‌డ్డా..." అంటూ శిష్యుడు చుట్టూ ప‌రికిస్తూ లోప‌లికి వ‌చ్చాడు.

"కోర్టంటే భ‌య‌మెందుకురా. చేసిన త‌ప్పులు బ‌య‌ట‌ప‌డిపోతాయ‌నా?"

"నేనేం త‌ప్పులు చేశాను సార్‌... మీ ద‌గ్గ‌ర ఇంకా రాజ‌కీయాలు పూర్తిగా నేర్చుకోనైనా లేదు.  కానీ  ఎందుకో ఈ వాతావ‌ర‌ణం చూస్తే వ‌ణుకొస్తుంది సార్‌..."

"ఒరే... మ‌హా మ‌హా కుంభ‌కోణాలు చేసే నేత‌లే ద‌ర్జాగా కోర్టుకొచ్చి, అంత‌కంటే గొప్ప‌గా జ‌నం కేసి చేతులూపుతూ ఏదో ఘ‌న‌కార్యం చేసిన‌ట్టు న‌వ్వుతూ ఫొటోల‌కి పోజులిచ్చే రోజులు క‌దా ఇవి... మ‌ర‌లా భ‌య‌ప‌డితే ఎలా?"

"అద్స‌రే కానీ గురూగారూ! ఇంత‌కీ ఈ ఏర్పాట్ల‌న్నీ ఎందుకు చేశారు సార్‌?"

"ఏం లేదురా. నువ్వా నా ద‌గ్గ‌ర నీచ రాజ‌కీయాలు నేర్చుకుంటున్నావు. రేప్పొద్దున్న జ‌నం ఖ‌ర్మ కాలి ఏ ప‌ర‌గ‌ణాకో నేత అయిపోయావ‌నుకో. ఎప్పుడో ఒక‌ప్పుడు ఇలా కోర్టు సీన్‌లో న‌టించాల్సి ఉంటుంది.  అప్పుడు నువ్విలా భ‌య‌ప‌డిపోయి గ‌జ‌గ‌జా వ‌ణికిపోయావ‌నుకో. వీడెవ‌డో నిజంగానే దేశాన్ని దోచేశాడ‌ని నిర్దార‌ణ‌కి వ‌చ్చేసి, జ‌డ్జిగారు విచార‌ణ లేకుండానే శిక్ష వేసేస్తారు. అందుకే  నీకు కాస్త ప్రాక్టిక‌ల్ రిహార్స‌ల్స్ చేయిద్దామ‌ని ఇలా సినిమా సెట్టింగు వేయించాన‌న్న‌మాట‌..." 

"భ‌లే బాగుంది గురూగారూ! ఇప్పుడు  నేనేం చేయాలండి..."

"నువ్వో రాష్ట్రానికి సీఎం హోదాలో ఆ బోనులోకెక్కి నుంచోవాలిరా. నిన్ను ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నానా ప్ర‌శ్న‌లూ అడుగుతాడు. నువ్వు ఎలా స‌మాధానాలు చెబుతావో నేనా జ‌డ్జి కుర్చీలో కూర్చుని గ‌మ‌నించి ఆన‌క నీకు పాఠాలు చెబుతాన‌న్న‌మాట‌. స‌రేనా?"

"స‌రేసార్‌... ఇంత‌కీ నా మీద ఉన్న ఆరోప‌ణ‌లు, అభియోగాలు ఏమిటండీ?"

"నీ మీద లేనివేంటిరా... ఖ‌నిజాలు కొల్ల‌గొట్టావు. గ‌నులు దోచేశావు. సూట్‌కేసు కంపెనీలు పెట్టావు. నిధులు దారి మ‌ళ్లించావు. పోర్టులు, ఫ్యాక్ట‌రీలు ఎవ‌రెవ‌రికో క‌ట్ట‌బెట్టేశావు. వాళ్లిచ్చిన వాటాలతో నీ సొంత వ్యాపారాలు విస్త‌రించావు. ర్యాంపులు గుల్ల చేశావు. రాష్ట్రాన్ని దివాళా తీసే స్థితికి  తీసుకొచ్చేశావు. ఇలా... ఒక‌టా, రెండా అనేకానేక కేసులున్న‌యారా. కాబ‌ట్టి నువ్వా బోనులో నుంచుని నిజ‌మైన సీఎం లెవెల్లో నువ్వు చెప్ప‌ద‌లుచుకున్న‌ది మొద‌లు పెట్టు. ప‌ద‌..."

గురువుగారు చెప్పిన‌ట్టే శిష్యుడు బోనులోకెళ్లి నుంచున్నాడు. ఓ యువ‌కుడు న్యాయ‌వాదిగా సీన్లోకొచ్చాడు. గురువుగారుఉ జ‌డ్జిగారి కుర్చీలో కూర్చున్నారు.  ఆయ‌న చెయ్యి ఊప‌గానే, న్యాయ‌వాది బైబిల్ పుస్త‌కం తెచ్చాడు. శిష్యుడు ప్ర‌మాణం చేసి మొద‌లు పెట్టాడు.

"అవును. నేను ప్ర‌మాణం చేసి నిజ‌మే చెబుతున్నాను. నేను సీఎంగా అధికారంలోకి వ‌చ్చాను. నేనేం చేయాల‌న్నా ఇదే నాకు స‌రైన స‌మ‌యం..."

"అంటే మీరిప్పుడు రాష్ట్రాన్ని కొల్ల‌గొట్టిన‌ట్టేనా?"

"చ‌.. ఛ‌... అలా ఎన్న‌టికీ కాదు..."

"అయితే మీరు ప్ర‌జ‌ల సంక్షేమం కోసం పాటు ప‌డ‌తారా?"

"అవును. అదే నా జీవిత లక్ష్యం క‌దా..."

"మీరు ఖ‌నిజాలు దోచేసి, గ‌నులు కొల్ల‌గొట్టారా?"

"అబ్బెబ్బే... కాదు... ఆరునూరైనా అలా చేస్తే ఒట్టు..."

"అయితే మీరు ప్ర‌జ‌ల‌కు ఉద్యోగాలు క‌ల్పించి, జీవనోపాధి క‌ల్పించి, రాష్ట్రాన్ని స్వ‌ర్ణ‌యుగం చేస్తారా?"

"అవును. క‌చ్చితంగా. అందులో సందేహం ఏముంది..."

"మ‌రి మీరు అనేక కుంభ‌కోణాలు చేసి, ఆర్ధిక అవ‌క‌త‌వ‌క‌లకు పాల్పడి రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారా?"

"నీకేమైనా పిచ్చా? అస్స‌లు కాదు..."

"మేమంతా మిమ్మ‌ల్ని, మీ నిజాయితీని న‌మ్మ‌వ‌చ్చా?"

"త‌ప్ప‌కుండా. అందులో ఏమాత్రం అనుమానం లేదు..."

"అయితే...మీరు మా నిజ‌మైన నాయ‌కులేనన్న‌మాట‌..."

గుర‌వుగారు చెయ్యి ఊప‌గానే శిష్యుడు బోనులోంచి బ‌య‌ట‌కి వ‌చ్చేశాడు. ఆతృత‌గా గురువుగారి ద‌గ్గ‌ర‌కి వెళ్లి, "నేను జ‌వాబులు బాగా చెప్పానా సార్‌. ఓ నీచ రాజ‌కీయ నేత‌గా ఎద‌గ‌గ‌ల‌నంటారా?" అంటూ ఆశ‌గా అడిగాడు.

గురువుగారు నవ్వి, "ఒరే... నేను ముందే చెప్పాను క‌ద‌రా. ఇదొట్టి మాక్ ప్రొసీడింగ్స‌ని. నువ్వేదో మా గొప్ప‌గా జ‌వాబులు చెప్పానుకుంటున్నావు కానీ, నువ్వు బోనులోకి వెళ్లిన ద‌గ్గ‌ర్నుంచి, దిగే వ‌ర‌కు జ‌రిగిన సంభాష‌ణ‌ని ఇప్పుడు కింద నుంచి పైకి చ‌దువుకో. అప్పుడు బోధ ప‌డుతుంది, నువ్వెలా స‌మాధానాలు చెప్పావో..." అంటూ గుమాస్తా అందించిన ప్ర‌శ్న‌, స‌మాధానాల కాగితం చేతిలో పెట్టారు. శిష్యుడు ఆ స‌మాధానాల‌ను కింద‌నుంచి పైకి చ‌దివి తెల్ల‌బోయాడు.

"అయ్య‌బాబోయ్‌... ఓ సీఎంగా ఇలా స‌మాధానాలు చెబితే శిక్ష ప‌డ‌డం ఖాయం క‌దండీ"  అన్నాడు.

గురువుగారు ప‌క‌ప‌కా న‌వ్వి, "ఒరే మామూలు కోర్టులో ఇలా  అడిగే ప్ర‌శ్న‌ల‌కి రాటు దేలిన ఏ నీచ రాజ‌కీయ నాయ‌కుడైనా స‌రే ఇలాగే స‌మాధానాలు చెబుతాడు. వాడి నుంచి స‌రైన జ‌వాబులు రాబ‌ట్ట‌డం అసాధ్యం. కానీ ఇది ప్ర‌జాకోర్టురా. ప్ర‌జ‌లు అంత‌కంటే చురుకైన వాళ్లు. ఇందులో  అడిగే ప్ర‌శ్న‌ల‌కి నీచ రాజ‌కీయ నేత‌లు చెప్పే స‌మాధానాల‌ను ఇలా త‌ల‌కిందులుగా అర్థం చేసుకోవాలని వాళ్ల‌కు తెలుసు. అస‌లు నువ్వేంటో, నీ మాట‌ల్లో నిజ‌మేంటో వాళ్లు ఇట్టే ప‌ట్టేయ‌గ‌ల‌రు.  అస‌లైన కోర్టులో ప్ర‌మాణం చేసి ఏం చెప్పినా చెల్లుతుందేమో కానీ, ఇలాంటి ప్ర‌జాకోర్టులో నీ ఆట‌లు కొన్న‌ళ్లే సాగుతాయి. ఈ పాఠం నీకు చెప్ప‌డం కోస‌మే ఇలా ఏర్పాటు చేశా. అర్థమైందా?"

"అద్భుతం సార్‌!"

-సృజ‌న‌

PUBLISHED ON 23.8.21 ON JANASENA WEBSITE

 

 

గురువారం, ఆగస్టు 19, 2021

రాజ‌కీయ ఒలింపిక్స్‌

 


"ఏంట్రా... ఒళ్లంతా చెమ‌టలు ప‌ట్టి క‌నిపిస్తున్నావుమీ ఆవిడేమైనా ప‌ని చెప్పిందా, లేక రాజ‌కీయాల్లో రాటు దేలాల‌ని క‌స‌ర‌త్తులేమైనా చేస్తున్నావా?" అంటూ ప‌ల‌క‌రించారు గురువుగారు, అప్పుడే వ‌చ్చి ఆయాసంతో చ‌తికిల ప‌డిన శిష్యుడిని చూస్తూ.

"మా ఆవిడ ఏ ప‌ని చెప్పినా నేనెలాగూ చేయ‌లేను కాబ‌ట్టి ఆయాసం రాదండి. ఇక రాజ‌కీయాల్లో రాటు దేల్చ‌డానికి మీరెలాగూ ఉన్నారు. కాబ‌ట్టి ఈ రెండూ కావండి. ఈమ‌ధ్య వ్యాయామాలు, ఆట‌లు మొద‌లు పెట్టానండి. అందువ‌ల్లండి" అన్నాడు శిష్యుడు సేద‌తీరుతూ.

"ఉన్న‌ట్టుండి నీకిందే బుద్ధిరా. అంత క్రితం ఇస్త్రీ చేసిన జేబురుమాలులా ఉండేవాడివి, ఇప్పుడు న‌లిపి పారేసిన కాగితంలా వ‌డిలిపోయావ్‌. ఎందుక‌ని?"

"ఏం లేదు గురూగారూ! ఒలింపిక్స్‌లో మ‌న భార‌తీయులు ప‌త‌కాలు గ‌ట్రా సాధించారు క‌దండి అందువ‌ల్ల ఉత్సాహం వ‌చ్చిందండి. వ‌చ్చేసారిక‌ల్లా ఎలాగో అలా ఏదో ఒక క్రీడ‌లో నైపుణ్యం సాధించి దేశానికి ప‌త‌కం తెచ్చేద్దార‌ని బుద్ది పుట్టిందండి..."

"అయితే మ‌రి ఇక రాజ‌కీయాలు నేర్చుకోనంటావ్‌?"

"అమ్మ‌మ్మ ఎంత మాట‌.  ఇటు రాజ‌కీయాలు, అటు క్రీడ‌లు రెండింట్లోనూ దూసుకుపోదామ‌నండి... అందుకే మైదానం నుంచి నేరుగా మీ ద‌గ్గ‌ర‌కే వ‌చ్చాను..."

"బాగుందిరా... కానీ నీకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్ప‌నాక్రీడ‌ల్లో ఒలింపిక్స్ ప‌త‌కాల‌ను అమెరికా, చైనా, జ‌పాన్ లాంటి దేశాలు ఎగ‌రేసుకుపోతాయేమో కానీ, రాజ‌కీయాల్లో ఒలింపిక్స్ పెడితే ప‌త‌కాల‌న్నీ మ‌న‌వేరా... మ‌న నేత‌లు రాజ‌కీయ క్రీడ‌ల్లో అంత‌టి ప్ర‌బుద్ధులు తెలుసా?"

"భ‌లేవారు గురూగారూ! రాజ‌కీయ ఒలింపిక్స్ ఏంటండీ బాబూ... అందులో ఈవెంట్లు ఏముంటాయి?"

"ఎందుకుండ‌వురా... క్రీడ‌ల్లో ఉన్న‌వ‌న్నీ ఇక్క‌డా ఉంటాయి... మ‌రి కొన్ని ఎగ‌స్ట్రా కూడా ఉంటాయి..."

"ఇదేదో భ‌లే స‌ర‌దాగా ఉందండీ... ఉదాహ‌ర‌ణ‌కి కొన్ని చెప్పండి, మీరు చెప్పేదేంటో అర్థం చేసుకుంటాను..."

"ఏముందిరా... రిలే ర‌న్నింగు పోటీల్నే తీసుకో. ఒకడు కొంత‌దూరం ప‌రిగెత్తి, గొట్టంలాడి క‌ర్ర ముక్క‌ని మ‌రొక‌డికి అందిస్తే అక్క‌డ్నుంచి వాడు ప‌రిగెడ‌తాడు అవునా? అలాంటివే క‌ద‌రా మ‌న వార‌స‌త్వ రాజ‌కీయాలు? అల‌నాటి ఇందిర‌మ్మ ద‌గ్గ‌ర్నుంచి ఈ నాటి రాహుల్ గాంధీ వ‌ర‌కూ ఇదే జ‌ర‌గ‌డం లేదూ జాతీయ పార్టీలోరాజీవ్‌గాంధీ త‌ర్వాత ఆయ‌న స‌తీమ‌ణి సోనియాగాంధీ, ఆమె త‌ర్వాత రాహుల్‌గాంధీ రాజ‌కీయ ట్రాక్ మీద ప‌రుగులు పెట్ట‌డం లేదూ? అంత పెద్ద పార్టీలో ఓ కుటుంబం వార‌సులు త‌ప్ప చెప్పుకోద‌గ్గ మ‌రో నేత లేడంటే వింత‌గా లేదూ? ఇలా రిలే పొలిటిక‌ల్ ర‌న్నింగులో ఎంత మంది క్రీడాకారులు లేర్రా, మ‌న ద‌గ్గ‌ర‌. అప్పుడెప్పుడో బీహార్‌లో లాలూ ప్ర‌సాద్ జైలు కెళితే ఆయ‌న భార్య ర‌బ్రీదేవి రంగం న‌డ‌ప‌లేదూ? మ‌రి హోలాంధ్రా గురించి మాత్రం మ‌ర్చిపోగ‌ల‌మావైఎస్సార్ త‌ర్వాత ఆ రిలే గొట్టం ప‌ట్టుకుని అప్ప‌టిక‌ప్పుడే ప‌రిగెత్తేయాల‌ని జ‌గ‌న్మోహ‌నుడు ఉవ్విళ్లూర‌లేదూ? ఆ మేర‌కు సంత‌కాలూ గట్రా కూడా సేక‌రించి ట్రాక్‌లోకి దూకేద్దామ‌నుకున్నాడుగాకానీ అధిష్టానం హ‌ర్డిల్స్ పెట్టే స‌రికి రోడ్ల మీద బాగా ప్రాక్టీసు చేసి ఇప్పుడు ర‌న్నింగ్ లో రెచ్చిపోవ‌డం లేదూ? మ‌రిక్క‌డ తెలంగాణాలో కూడా కేసీఆర్ త‌ర్వాత కేటీఆర్ ట్రాక్ మీద సిద్దంగా నిల‌బ‌డి లేడూ? మ‌రాప‌క్క‌న త‌మిళ‌నాడులో కొత్త‌గా ర‌న్నింగ్ మొద‌లుపెట్టిన స్టాలిన్ తంబి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా? మ‌రి  ఇవ‌న్నీ చూస్తే రాజ‌కీయ రిలే ర‌న్నింగులో గోల్డు మెడ‌ళ్లు బోల్డు వ‌చ్చేస్తాయి మ‌నోళ్ల‌కి. ఏమంటావ్‌?"

"ఇక అన‌డానికేముందండీ, మీరింత బాగా చెప్పాకకానీ ఒలింపిక్స్‌లో మ‌న‌కి స్వ‌ర్ణ ప‌త‌కం తెచ్చిన జావెలిన్ థ్రో లాంటి  ఈవెంటు లాంటిది కూడా ఉంటుందాండీ, రాజ‌కీయ క్రీడోత్స‌వాల్లో?"

"ఎందుకుండ‌దురా... జావెలిన్ థ్రో అంటే ఏంటిఈటెలు విస‌ర‌డ‌మే క‌దాఅదే రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఈటెల్లాంటి మాట‌ల‌న్న‌మాట‌.  జావెలిన్ లో ఇన్నాళ్ల‌కి ఒక్క‌డు తెర మీద‌కి వ‌చ్చాడు కానీ, అదే పొలిటిక‌ల్ ఒలింపిక్సులో గ‌ల్లీగ‌ల్లీకో ఆరితేరిన రాజ‌కీయ నేత క‌నిపిస్తాడు. తెల్లారి లేస్తే అవాకులు చెవాకులు ఎగ‌స్పార్టీ వాళ్ల మీద విసిరేసే వాళ్లేగా అంద‌రూనూ. తాజాగా హుజూర్‌బాద్ ఉప ఎన్నిక రంగాన్ని తీసుకుంటే చాల‌దూ. ఓ ప‌క్క ఆ ఈటెల మాట‌లు విసురుతుంటే, ఇట్నుంచి ఎగ‌స్పార్టీ రేవంత్ రెచ్చిపోవ‌డం లేదాతెలంగాణా అధినేత అల్లుడుంగారు హ‌రిశ్‌ని త‌క్కువ చేయ‌గ‌ల‌మా? మ‌రి అటు ఆంధ్రా కేసి చూస్తే స్వ‌ర్ణ ప‌తకాలు ప‌ట్టేసే స్థాయిలో నిత్య రాజ‌కీయ జావెలిన్ థ్రోలు ఎడాపెడా జ‌రుగుతూనే ఉన్నాయిగాతాజాగా మంత్రి పేర్ని నాని ఏకంగా దిల్లీ దాకా ఈటెలు విస‌ర‌డం లేదూ? మ‌రి అక్క‌డ్నుంచి బీజేపీ క్రీడాకారులు కూడా రెచ్చిపోయి మ‌రీ ఇటు కేసి విస‌ర‌డం లేదూ? మ‌రి ఇలాంటి వాళ్ల‌కు కాక ఇంకెవ‌రికి వ‌స్తాయిరా గోల్డు మెడ‌ళ్లు?"  

"భ‌లేగా చెప్పారండీ బాబూ. మ‌రి బాక్సింగ్ సంగ‌తేంటండీ?"

"బాక్సింగంటే ఏంట్రా? బ‌రిలోకి దిగిన ఎదుటివాడిని మ‌ట్టి క‌రిపించ‌డ‌మేగా? ఇందులో మ‌న‌వాళ్లంద‌రూ ఆరితేరిన వాళ్లే. ఇక బంగారు ప‌త‌క స్థాయిలో క్రీడాకారుడెవ‌రంటే ఆంధ్రా కేసే చూడాల్రోయ్‌. అక్క‌డ సొంత పార్టీ ఎంపీ అయినా చిత‌క‌త‌న్నించిన గొప్ప క్రీడా నైపుణ్యం ఇంకెక్క‌డ క‌నిపిస్తుంది చెప్పు? ఆంధ్రా పోలీసుల్ని కూడా పోటీల‌కు పంపామ‌నుకో. ఇక ప‌త‌కాలే ప‌త‌కాలు. అక్క‌డి రాజ‌కీయ నేత‌లు చెప్పిన‌ట్ట‌ల్లా, ఓ గూండాల్లాగా, సొంత అనుచ‌రుల్లాగా మారిపోయి ఎవ‌ర్ని కొట్ట‌మంటే వారిని, ఎలాంటి కేసులు పెట్ట‌మంటే అలాంటి కేసులు పెట్టి మ‌రీ పంచ్‌లు విసురుతున్న ఆళ్ల‌కి మించిన అడ్డ‌గోలు ఆట‌గాళ్లు ఎవ‌రుంటారు చెప్పు?"

"బాగా చెప్పారండీ. మ‌రి హ‌ర్డిల్స్ పోటీ సంగ‌తేంటండి?"

"ఒరే... రాజ‌కీయ క్రీడ‌ల్లో హ‌ర్డిల్స్ రెండు ర‌కాలురా. ఒక‌టి ట్రాక్‌లో మ‌న‌కున్న హ‌ర్డిల్స్ దాటుకుంటూ ప‌రుగెట్ట‌డం ఒక‌టైతే, వేరే వాళ్లు ప‌రిగెట్టే ట్రాక్‌లో ప‌నిగ‌ట్టుకుని హ‌ర్డిల్స్ పెట్ట‌డం మ‌రో ర‌కం. ఈ రెండు ఈవెంట్ల‌లోనూ మీ ఆంధ్రా అధినేత‌ను మించిన గొప్ప ఆట‌గాడు ఇంకెవ‌డూ ఉండ‌డ్రా. మ‌రాయ‌న ప‌రిపాల‌న‌లో ఎదురవుతున్న హ‌ర్డిల్స్  ఇన్నీ, అన్నీనాపాల‌నా ప‌ర‌మైన ప‌రుగులో నైపుణ్యం లేక‌పోవ‌డం వ‌ల్ల అడుగ‌డుగునా అడ్డంకులే. ఓ ప‌క్క ఆర్థిక అవ‌క‌త‌వ‌కలు. మ‌రో ప‌క్క జీతాలు, పెన్ష‌న్లు ఇవ్వ‌డానికి కూడా క‌ట‌క‌ట‌లాడుతున్న ప‌రిస్థితి. ఇంకో ప‌క్క మితి మీరిన అప్పుల‌పై ఆరా తీస్తూ కేంద్రం పెడుతున్న హ‌ర్డిల్స్‌. ఇక ఆయ‌న గ‌తంలో చేసిన అక్ర‌మార్జ‌న కార్య‌క‌లాపాలే కేసులై వెంటాడుతున్న హ‌ర్డిల్స్‌. ఇంకో ప‌క్క  ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల‌పై హైకోర్టు, సుప్రీం కోర్టులు పెడుతున్న చీవాట్లు, మంద‌లింపులు కూడా లెక్క‌లోకి తీసుకుంటే అడుగ‌డుగునా హ‌ర్డిల్సే. అయినా వాటిని త‌న్నేసుకుంటూ మ‌రీ అడ్డ‌దిడ్డంగా ప‌రుగ‌ట్టేస్తున్నాడ్రా ఆయ‌న‌. ఇలా  ప‌రిగెట్ట‌డ‌మే కాదురోయ్‌. వేరే వాళ్ల‌కి హ‌ర్డిల్స్ క్రియేట్ చేయ‌డంలో కూడా ఆయ‌న‌కే ప‌తకం ఇచ్చేయాలి. మ‌రి మొన్నీ మ‌ధ్య అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం 600 రోజుల నుంచి ఆందోళ‌న చేస్తున్న రైతులు త‌మ నిర‌స‌న‌ను వినూత్నంగా తెల‌పాల‌ని అనుకుంటే ఈయ‌న పెట్టించిన అడ్డంకులు ఇన్నీ అన్నీనా నాయ‌నావేలాది మంది పోలీసుల్ని మొహ‌రించి, రోడ్ల మీద ఇనుప కంచెలు పెట్టించి మ‌రీ అడ్డుకోలేదూశాంతి యుతంగా నిర‌స‌న తెల‌ప‌డాన్ని కూడా స‌హించ‌లేనంత తెంప‌రిత‌నంతో అల‌నాటి ఎమ‌ర్జెన్సీ రోజుల్ని గుర్తుకు తేలేదూప్ర‌జాస్వామ్యాన్ని, భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ని కూడా ఉక్కు పాదంతో న‌లిపేసే ఈయ‌న త‌త్వం ఎలాంటిదంటే, ఒక‌వేళ బంగారు ప‌త‌కం ప్ర‌క‌టించ‌క‌పోతే  వెళ్లి లాగేసుకుని మ‌రీ త‌న‌ను తాను విజేత‌గా ప్ర‌కటించుకునేంత దారుణ‌మైన‌ది. అర్థ‌మైందా?"

"అద్భుతం సార్‌. ఇలాగే మిగ‌తా ఈవెంట్లు కూడా చెప్పండి సార్‌, స‌ర‌దాగా ఉంది..."

"ఒరేయ్‌... అస‌లైన ఒలింపిక్స్‌లో ఈవెంట్లు కొన్నేరా... కానీ పొలిటిక‌ల్ ఒలింపిక్స్‌లో లెక్క‌లేన‌న్ని. ఉదాహ‌ర‌ణ‌కి ఈత‌ల పోటీ పెట్టార‌నుకో, ఎదుటి వాడి కాలు ప‌ట్టుకుని లాగేసి మ‌రీ ఈదుకుంటూ పోతార్రా మ‌న రాజ‌కీయ నేత‌లు. ఇక సింక్ర‌నైజ్డ్ స్విమ్మింగంటే, త‌మ మంత్రులు, అనుచ‌రులను పోగేసుకుని  విన్యాసాలు చేస్తూ త‌మ ప‌రిపాల‌న అద్భుతంగా ఉంద‌ని భ్ర‌మ క‌ల్పిస్తూ క‌నువిందులాంటి క‌నిక‌ట్టు చేస్తుంటారు. ఇక హాకీలాంటి ఈవెంట్లు పెట్టామ‌నుకో, బంతిని కొట్టడం మీద క‌న్నా ఎదుటి వారి కాళ్లు విర‌గ్గొట్ట‌డం మీదే దృష్టి పెడ‌తారు. అంద‌రి కాళ్లూ విర‌గ్గొట్టాక బంతిని అడ్డ‌గోలుగా గోలు చేద్దామ‌ని చూస్తుంటారు. ఇందులో అన్ని పార్టీల నేత‌లూ ప‌త‌క స్థాయి ఆట‌గాళ్లే అనుకో. ఇలా చూస్తే, ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు చేసి గెల‌వ‌డ‌మంటే లాంగ్ జంప్ చేయ‌డ‌మ‌న్న‌మాట‌. ఎగ‌స్పార్టీ కంటే ఎక్కువ‌గా హామీలివ్వ‌డమంటే హైజంప్ చేయ‌డ‌మ‌న్న‌మాట‌. ఇక అనెథిక‌ల్ అథ్లెటిక్స్‌లో మ‌న వాళ్ల‌ని మించిన వాళ్లెవ‌రురా? ఇక ఎదుటివారి మీద విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసే ఫెన్సింగు ఈవెంట్లో మ‌న నేత‌ల‌కి కాక ఇంకెవ‌రికి వ‌స్తాయి ప‌త‌కాలు? అవ‌స‌ర‌మైతే  ఫెన్సింగ్ క‌త్తితో పొడిచేసి మ‌రీ గెలిచేస్తారు. ఇక షూటింగ‌నుకో, సున్నాల బోర్డు మీద కంటే ఎదుటి ఆట‌గాడి గుండెల మీద‌కే గురిపెడ‌తారు. పోనీ సైక్లింగ్ పోటీ పెట్టామ‌నుకో, ఆ సైకిల్‌ని కారు మీద నిల‌బెట్టి స్పీడు పెంచేసి గెలిచామంటారు. ఇలా ఏ ఆట‌లోనైనా అడ్డ‌గోలుగా, అక్ర‌మంగా ఆడేస్తారు. అంతేకాదురోయ్‌... రిఫ‌రీల‌ని, ఎంపైర్ల‌ని కూడా ప్ర‌లోభ‌పెట్టి, లంచాలు పెట్టి కొనేయాల‌ని చూస్తారు. అస‌లైన ఒలింపిక్స్‌లో రూల్సు, నిబంధ‌న‌లు, ప‌ద్ధ‌తులు ఉంటాయి. వాటి ప్ర‌కార‌మే ఆట‌గాళ్లంద‌రూ ఆడాలి. అదే పొలిటిక‌ల్ ఒలింపిక్స్‌లో అనుకో. ఆట‌గాళ్లే రూల్సు పెడ‌తారు. పైగా ఆ రూల్సుని ఎప్ప‌టిక‌ప్పుడు మార్చేస్తుంటారు. ఎవ‌డి నిబంధ‌న‌లు వాడివే. తెలిసిందా?"

"ఆహా... ఎంత బాగా చెప్పారండీ, పొలిటిక‌ల్ ఒలింపిక్స్ కామెంట్రీ. అయితే నేను కూడా ఇటు ఆట‌లు, అటు రాజ‌కీయాలు నేర్చుకుని అడ్డ‌గోలు ప‌త‌కాలు లాగేసుకుంటాను సార్‌. ఆశీర్వ‌దించండి".

-సృజ‌న‌

PUBLISHED ON 17.8.21 ON JANASENA WEBSITE



బుధవారం, ఆగస్టు 11, 2021

మొగుణ్ణి కొట్టి... మొగ‌సాల‌కెక్కి!

 



"మ‌న‌సేం బాగాలేదు గురూగారూ... కాసేపు మీతో క‌బుర్లు చెబుదామ‌ని వ‌చ్చా... ఇవాళ పాఠాలేం వ‌ద్దులెండి.." అంటూ నీర్సంగా వ‌చ్చాడు శిష్యుడు.

"ఏమైందిరా..." అంటూ అడిగారు గురువుగారు.

"ఆఫీసులో నా లెక్క‌ల మీద త‌నిఖీ చేశారండి. కొన్ని త‌ప్పులు జ‌రిగాయ‌ని తేలిందండి..."

"మ‌రి నువ్వేం అన్నావ్‌?"

"ఏముందండీ... పొర‌పాటైందండీ... ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉంటాన‌ని  సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వ‌చ్చిందండి..."

గురువుగారు న‌వ్వి,  "ఘోర‌మైన త‌ప్పు చేశావురా..." అన్నారు.

"అదేక‌దండీ నేనూ చెబుతుంట‌..." అన్నాడు శిష్యుడు నిట్టూరుస్తూ.

"ఏడిశావ్. నువ్వు ఆఫీసులో చేసిన త‌ప్పు గురించి కాదురా నేను మాట్లాడుతుంట‌..."

"మ‌రింకేం త‌ప్పండీ?" అన్నాడు శిష్యుడు అర్థం కాక‌.

గురువుగారు తాపీగా కుర్చీలో జార‌గిల ప‌డి "సంజాయిషీ ఇచ్చుకోవడం..."  అన్నారు.

"అదేంటండీ అలాగంటారు? జ‌రిగిన పొర‌పాటుకి మ‌న‌సు సిగ్గుతో చ‌చ్చిపోతున్న‌ట్టు అయిందండి. ఆత్మ‌న్యూన‌తా భావంతో కుదించుకుపోయానండి. మ‌రి అలాంటి ప‌రిస్థితుల్లో సంజాయిషీ ఇచ్చుకోక ఇంకేం చేయాలండీ?"

"ఏం చేయాలా? ఎదురెట్టాలి... ఎదురు దాడికి దిగాలి. ఏం ఆఫీసులో ఇంత‌వ‌ర‌కు ఎలాంటి త‌ప్పులూ జ‌ర‌గ‌లేదా? నువ్వు ఇంత‌వ‌ర‌కు త‌ప్పు చేయ‌లేదా? న‌న్నే అంటే ఎలా? అంటూ విరుచుకుప‌డాలి. కావాలంటే ఇదంతా పెద్ద కుట్ర అంటూ నానా యాగీ చేయాలి..."

"ఊరుకోండి గురూగారూ! మీ మాట‌ల‌న్నీ తిర‌కాసుగా ఉంటాయి. అరె... మ‌నిష‌న్న‌వాడెవ‌డైనా అలా అడ్డ‌గోలుగా మాట్లాడుతాడాండీ?  చీమూ నెత్తురూ ఉన్న‌వాడెవ‌డైనా అలా బూక‌రిస్తాడాండీ? జ‌రిగిన త‌ప్పు క‌ళ్ల ముందు క‌నిపిస్తుంటే క‌ళ్లు మూసుకుపోయి కొవ్వెక్కిన‌ట్టు వాగుతాడాండీ?" అంటూ శిష్యుడు ఆవేశ‌ప‌డిపోయాడు.

"ఓరెర్రోడా... క‌ళ్లెట్టుకుని చుట్టూ చూడ‌రా. నీ ప‌ర‌గ‌ణా అధినేతని ఎదురుగా పెట్టుకుని కూడా అలా ఆవేశ‌ప‌డిపోతే ఎలారా? యథా రాజా త‌థా ప్ర‌జా అన్నట్టు ఆయ‌న నిర్వాకాన్ని చూసి నేర్చుకోవ‌ద్దురా?" అంటూ గురువుగారు కేక‌లేశారు.

శిష్యుడు శాంతించి "ఏం చేశాడండీ ఆయ‌న‌? ఏం నేర్చుకోవాలి ఆయన నుంచి?" అంటూ అడిగాడు.

"అలారా దారికి! నీకు నీ బాస్ ఎలాగో, రాష్ట్రానికి కేంద్రం అలాగేగా? మ‌రి మ‌న అధినేత హ‌యాంలో ఎడా పెడా జ‌రుగుతున్న ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌పై కేంద్రం సంజాయిషీ అడిగిందా, లేదా? ప‌రిమితిని మించిన అప్పులు, నిధులు దారి మ‌ళ్లించ‌డాలు, ఒక దానికి కేటాయించిన డ‌బ్బును ఇష్టారాజ్యంగా మ‌రో ప‌నికి వాడేయ‌డాలు, భ‌విష్య‌త్తు ఆదాయాన్ని కూడా త‌న‌ఖా పెట్టేయ‌డాలు లాంటి అనేకానేక అవ‌క‌త‌వ‌క‌, అస‌మంజ‌స‌, అడ్డ‌గోలు ఆర్థిక కార్య‌క్ర‌మాల‌పై వివ‌ర‌ణ అడ‌గ‌డం ఎంత సిగ్గు చేటు? మ‌రి ఆ అధినేత నీలాగా సిగ్గుతో చితికిపోయి, కుమిలిపోయి, త‌ప్పు ఒప్పుకుని సంజాయిషీ ఇచ్చాడా?  లేదే? ఏకంగా కేంద్రానికే ఎదురెట్ట‌డం లేదూ? ఏం... కేంద్రం అప్పులు చేయ‌డం లేదా, అప్పు చేయ‌డం త‌ప్పా అంటూ మంత్రుల చేత ప్రెస్మీటెట్టి మ‌రీ ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దిగ‌లేదూ? అంత‌టితో ఆగాడా? ఇదంతా పెద్ద కుట్రా, న‌న్ను సీటు దింపించి మీ అస్మదీయుడికి క‌ట్ట‌బెట్టాల‌ని చూస్తున్నారూ... అంటూ నానా యాగీ చేయించ‌డం లేదూ?"

"అవునండి... గుర్తొస్తోందండి... కేంద్రం అకౌంటెంట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యం అధికారుల‌తో రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను త‌నిఖీ చేయించాని నిర్ణ‌యించిన‌ట్టు కూడా విన‌బ‌డుతోందండి... ఇదెంత సిగ్గు చేటండీ?  రాష్ట్రంలో ఓ పౌరుడిగా నాక్కూడా సిగ్గు వేస్తోందండి..."

"ఓరి నీ సిగ్గు చిమ‌డా?  రాజ‌కీయాల్లో సిగ్గేంట్రా?  సిగ్గూ ల‌జ్జా వ‌దిలేశాకే క‌ద‌రా ఇలాంటి నీచ రాజ‌కీయ నేత‌లుగా మార‌తారు?  కాబ‌ట్టి ఓ బాధ్య‌తగ‌ల పౌరుడిలాగా నువ్వు కూడా నీ అధినేత‌ను చూసి నేర్చుకో. కావాలంటే అర్జంటుగా కాశీకి పోయి సిగ్గు వ‌దిలేసి చ‌క్కా వ‌చ్చెయ్‌. లేక‌పోతే అస్స‌లు ఎద‌గ‌లేవు. అర్థ‌మైందా?"

"అర్థమైంది కానీ గురూగారూ, అస‌లు ఇంత దారుణంగా రాష్ట్రంలో ఆర్థిక త‌ప్పిదాలు ఎలా జ‌రిగాయండీ?"

"ఎందుకు జ‌ర‌గ‌వురా... నువ్వు నీ ఆఫీసులో ఏదో ఏమ‌రుపాటున చేసిన త‌ప్పులాంటిది కాదుక‌ద‌రా ఇది?  బాగా ఆలోచించి, ముందుగానే నిర్ణ‌యించుకుని, చ‌క్క‌గా ప్ర‌ణాళికలూ అవీ వేసుకుని, నేనేం చేస్తే అదే గొప్ప‌నీ, నా పాల‌న నా ఇష్టమ‌న్న‌ట్టుగా బ‌రితెగించీ, నిర్ల‌క్ష్యంగా, పొగ‌రుగా, ఏక ప‌క్షంగా చేసే ప‌నులే క‌ద‌రా ఇవి? ఎంత అడ్డ‌గోలుగా ఉండ‌క‌పోతే రాష్ట్రంలో అప్పులు ఏకంగా నాలుగు ల‌క్ష‌ల కోట్ల‌కు పెరుగుతాయి చెప్పు? ఎంత నిస్సిగ్గుగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే పెండింగ్ బిల్లుల విలువ‌ ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌కు చేరుతుంది చెప్పు? మ‌ద్యం అమ్మ‌కాల‌పై వ‌చ్చే ప‌దిహేను ఏళ్లలో రావాల్సిన ఆదాయాన్ని కూడా త‌న‌ఖా పెట్టి 25 వేల కోట్ల రూపాయ‌ల అప్పు చేయ‌డంతో పోలిస్తే, నువ్వు నీ ఆఫీసులో చేసిన త‌ప్పు ఏపాటిది చెప్పు?   ప్రతీ నెలా జీతాల‌కు, పెన్ష‌న్ల‌కు కూడా క‌ట‌క‌ట‌లాడిపోయే ప‌రిస్థితి ఎంత నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే త‌లెత్తుతుంది చెప్పు? ఎంత స‌మర్ధించుకున్నా, ఎంత‌లా స‌ర్ది చూపించినా కొన్ని ల‌క్ష‌ల కోట్ల మేర‌కు లెక్క‌లు తే ల్చ‌లేని దుర్భ‌ర‌మైన స్థితిలో రాష్ట్ర ఆర్ధిక వ్య‌వ‌హారాలు ఉన్నాయంటే ఎంత దారుణంగా ప‌రిపాల‌న సాగుతోందో చెప్పు? ఇంత చేసి కూడా కేంద్రం సంజాయిషీ అడిగింద‌ని దుగ్ధ‌తో విమర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారంటే, మొగుణ్ని కొట్టి మొగ‌సాలకెక్క‌డం కాక మ‌రేమిటి చెప్పు?"

శిష్యుడి త‌ల తిరిగిపోయింది. "అవునండోయ్‌... ఇప్పుడు బాగా అర్థమైంది. ఎదురుతిరిగిన వాడికి తెడ్డే లింగం అన్న‌ట్టుంది మ‌న అధినేత నిర్వాకం. మొత్తానికి మీ ద‌గ్గ‌ర‌కి రావ‌డం వ‌ల్ల నా ఉత్సాహం తిరిగి వ‌చ్చింది గురూగారూ! ఇక నాలో సిగ్గు, శ‌రం, ఆత్మ‌న్యూన‌త‌, అప‌రాధ భావంలాంటి ఆలోచ‌న‌ల‌కి తావు లేదండి. నేనిప్పుడే వెళ్లి మా ఆఫీసులో నానా గొడ‌వా చేస్తానండి. ఎదురు తిరిగి, ఎదురెట్టి, ఎడా పెడా వాయించేస్తానండి. నాద‌స‌లు త‌ప్పే కాద‌ని బుకాయిస్తానండి. బూక‌రిస్తానండి. నాకు ఆ అధినేతే స్ఫూర్తండి. ఆయ‌న తీరే నాకు పెద‌బాల‌శిక్షండి... ఆయ్‌!"

"శెభాష్‌రా... ఓ నీచ రాజ‌కీయ నేత‌గా ఎదిగే క్ర‌మంలో మొద‌టి అడుగు వేశావ్.  పోయిరా".

-సృజ‌న‌

PUBLISHED ON 12.8.21 ON JANASENA WEBSITE

 

 


బుధవారం, ఆగస్టు 04, 2021

పార్వ‌తి శివుడి క‌ళ్లు మూస్తే ఏం జ‌రిగింది?


 

వ్య‌ర్థ వ‌రాలు! (పిల్ల‌ల క‌థ‌)


 

స‌ర్ప‌లోకంలో ఎన్ని వింత‌లో!


 

పితృదోషాలు పోవాలంటే?


 

ఒలింపిక్స్‌లో జంతువులు పాల్గొంటే?


 

అక్ర‌మార్కుడి మార్కులు!

 

"ఇవాళ నీకో స్లిప్ టెస్టు పెడ‌తాన్రా... ఎలా రాస్తావో చూద్దాం..."  అన్నారు గురువుగారు, శిష్యుడు రాగానే.

"అంటే స్లిప్‌లు పెట్టుకుని రాసుకోవ‌చ్చాండీ?" అన్నాడు శిష్యుడు ఉత్సాహంగా.

"ఏడిశావ్‌. ఇన్నాళ్లుగా నా ద‌గ్గ‌ర రాజ‌కీయాలు నేర్చుకుంటున్నావు క‌దా... ఎంత వ‌ర‌కు ఒంట‌బ‌ట్టాయో చూద్దామ‌ని... " అంటూ ప్ర‌శ్న‌ప‌త్రం చేతిలో పెట్టారు. 


శిష్యుడు దాన్ని అందుకుని ఆత్రంగా చ‌దివి, రాయ‌డం మొద‌లు పెట్టాడు. మ‌ధ్య‌లో అడిష‌న‌ల్ షీట్లు కూడా
తీసుకున్నాడు. కాసేప‌య్యాక వ‌చ్చి, "రాసేశాను గురూగారూ! దిద్దుతారా?" అన్నాడు.

"ఒరేయ్‌...పేప‌ర్ దిద్దాలో, నిన్ను దిద్దాలో చూద్దాం కానీ, ఆ ప్ర‌శ్న‌లేంటో, నువ్వు రాసిన జ‌వాబులేంటో వినిపించు..." అంటూ గురువుగారు ప‌డ‌క్కుర్చీలో వాలారు. 

శిష్య‌డు గొంతు స‌వ‌రించుకుని చ‌ద‌వ‌డం మొద‌లు పెట్టాడు.

"మొద‌టి ప్ర‌శ్న‌.  'ఓ ప‌ర‌గ‌ణాకి అధినేత‌గా ప‌ద‌వీ స్వీకారం చేయ‌గానే చేయాల్సిన మొద‌టి ప‌నులు ఏవి?'  దానికి నా స‌మ‌ధానం సార్‌, వినండి. 'అధినేత‌గా ప‌ద‌వి చేప‌ట్ట‌గానే, అంత‌కు ముందు ప్ర‌భుత్వం చేసి ప‌నులు, ప‌ధ‌కాలు  ప‌రిశీలించ‌వ‌లెను. వాటిలో బాగున్న‌వాటిని కొన‌సాగించ‌వ‌లెను. కొన్ని ప‌థ‌కాల్లో లోపాలు ఉన్న‌చో స‌రిదిద్ది మ‌రింత మెరుగ్గా అమ‌లు చేయ‌వ‌లెను. రాష్ట్రం ప్ర‌గ‌తిప‌థంలో ముందుకు సాగ‌డానికి వీలుగా సుదీర్ఘ ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌వ‌లెను. ప్ర‌జ‌ల ఆర్థిక స్థితిగ‌తులు మెరుగుప‌ర‌చ‌డానికి  కుటీర ప‌రిశ్ర‌మ‌లు, స్వ‌యం ఉపాధి ప‌ధ‌కాల‌ను ప్రోత్సహించ‌వ‌లెను'. బాగా రాశానా సార్‌?  దీనికి అయిదు మార్కులు సార్‌... మీరెన్ని వేస్తారు?"

"సున్నా..." 

"అదేంటి సార్‌?  పోలిటిక్స్ పాఠ్య పుస్త‌కాల్లో ఇలాగే ఉందండి. య‌ధాత‌ధంగా దించేశానండి.  కానీ మీరు సున్నా వేశారెందుకండీ?"

"ఓరి స‌న్నాసీ! పుస్త‌కాల్లో ఉన్న‌ది దించేస్తే నువ్వు రాజ‌కీయ నేత‌గా ఎద‌గ‌లేవురా. ఒక‌వేళ ప‌ద‌వి వ‌చ్చినా ఉప‌న్యాసాలు ఇవ్వ‌డానికి త‌ప్ప ఎందుకూ ప‌నికిరావు. అదే నీ చుట్టూ ఉన్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించి నేర్చుకున్నావ‌నుకో. ప‌ది కాలాల పాటు నీచ నేత‌గా ఆరితేరుతావు. అర్థ‌మైందా?" 

"మ‌రైతే స‌రైన స‌మాధానం ఏంటండీ?"

"నువ్వుంటున్న ఆంధ్రా ప‌ర‌గ‌ణాకి అధినేత ఎవ‌రో, ఆయ‌న ఏం చేశాడో గ్ర‌హించి ఉంటే స‌మాధానం స‌రిగా రాశేవాడివి. స‌రే నేనే చెబుతాను రాసుకో. ముందుగా నువ్వు చేసే ప్రారంభ ఉప‌న్యాసంలో గొప్ప గొప్ప ఆద‌ర్శాలు వ‌ల్లించాలి. విన్న‌వాళ్లంద‌రూ రాజ‌కీయంలో స‌రికొత్త శ‌కం ప్రారంభ‌మైన‌ట్టు మురిసిపోవాలి. ఆ త‌ర్వాత ఏం చేయాలో తెలుసా?  ప్రారంభ ఉప‌న్యాసంలో ఒక్క ముక్కను కూడా నువ్వు పాటించ‌క‌పోవ‌డం". 

"అయ్యో అదేంటండీ?"

"మ‌రంతే క‌ద‌రా? ఆ అధినేత ఏం చెప్పాడు?  రాష్ట్రంలో ఎక్క‌డా అక్ర‌మ ఆక్ర‌మ‌ణ‌లు ఉండ‌కూడ‌ద‌న్నాడు. అంత‌కు ముందు ప్రభుత్వం క‌ట్టిన స‌భా భ‌వ‌నాన్ని క్రేన్ల‌తో కూల‌గొట్టించాడు. 'అబ్బో... సంస్క‌ర‌ణ మొద‌లైంద‌న్న‌మాట' అనుకున్నారు వెర్రిజ‌నం. కానీ ఆ త‌ర్వాత ఏం చేశాడు?  కేవ‌లం త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై క‌క్ష సాధించ‌డానికే ప‌రిమిత‌మ‌య్యాడు. ఆపై ఆయ‌న తొలి ఉప‌న్యాసంలో ఒక్క ఆద‌ర్శ‌మైనా అమ‌లు జ‌రిగిందా?  లేదు క‌దా? అంచేత చ‌క్క‌గా ప్ర‌జ‌ల‌ను వంచించేంత తియ్య‌గా మాట్లాడ‌డం మొద‌ట చేయాల్సిన ప‌ని. చెప్పింది చేయాల్సిన అవ‌స‌రం లేనంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం అస‌లైన ప‌ని. అర్థ‌మైందా? ఇక నీ రెండో ప్ర‌శ్న, దానికి నీ స‌మాధానం చ‌దువు".

శిష్యుడు నీర్సంగా పేప‌రు విప్పి చ‌ద‌వ‌డం మొద‌లు పెట్టాడు. "అధినేత ప‌రిపాల‌నా వ్య‌వ‌హార‌ములు ఎట్లుండ‌వ‌లెను?'  దానికి నా స‌మాధానం సార్‌. 'ఎన్నిక‌య్యేంత వ‌ర‌కే ప్ర‌తిప‌క్షం త‌ప్ప ఆ త‌ర్వాత అంద‌రినీ క‌లుపుకుని పోవ‌లెను. అన్ని పార్టీల స‌భ్యుల‌ను మిత్రులుగా ప‌రిగ‌ణిస్తూ వారి స‌ల‌హాల‌ను తీసుకొన‌వ‌లెను. ప్ర‌తిప‌క్ష‌నేత‌ల విమ‌ర్శ‌ల‌ను స‌హేతుకంగా ప‌రిశీలించి, వాస్త‌వాల‌ను గ్ర‌హించి త‌న ప‌రిపాల‌న‌లో లోటు  పాట్ల‌ను స‌రిదిద్దుకుంటూ పెద్ద మ‌న‌సును చాటుకోవ‌లెను. మేధావుల‌ ఆలోచ‌న‌లను ఆహ్వానించి పాల‌న‌తో పార‌దర్శ‌క‌త పాటించ‌వ‌లెను'. మ‌రి దీనికి ఎన్ని మార్కులు వేస్తారు సార్‌?"

"సున్నా..."

"అన్యాయం సార్‌. నేను రాసిన జ‌వాబు ఎంత ఆద‌ర్శంగా ఉందండీ? మ‌రైతే దీనికి స‌మాధానం ఏంటో చెప్పండి సార్‌..."

"రాజ‌కీయాల్లో ఆద‌ర్శాలేంట్రా వెర్రి స‌న్నాసీ! నీ ప‌ర‌గ‌ణా నేత వ్య‌వ‌హార శైలి చూసి కూడా నేర్చుకోపోతే ఎలారా? స‌రే నేనే చెబుతాను. రాసుకుని బ‌ట్టీ ప‌ట్టు. ముందు ఎవ‌రిని చూసినా చాలా స‌హృద‌యుడిలాగా, మొహ‌మాట‌స్తుడిలాగా న‌వ్వ‌డం నేర్చుకోవాలి.  ఆ న‌వ్వు చూస్తే 'ఎంత మంచి వాడ‌వురా... ఎన్ని నోళ్ల పొగ‌డుదురా...' అనే పాట పాడుకోవాల‌నిపించేంత మెత్త‌గా ఉండాలి. కానీ చేయాల్సిందేంటో తెలుసా?  కుర్చీ ఎక్క‌గానే ప్ర‌తి ప‌క్ష నేత‌ల‌పై క‌క్ష క‌ట్ట‌డం. వాళ్ల‌ని ర‌క‌ర‌కాల కేసుల్లో ఇరికించ‌డానికి ప్ర‌యత్నించాలి.  ఎప్ప‌టెప్ప‌టి సంఘ‌ట‌న‌లో వెతికి వెలికి తీసి, వాటి మీద అర్థం ప‌ర్థం లేని కేసులు పెట్టించాలి.  జైలులో పెట్ట‌డానికి చ‌ట్టాన్ని అడ్డ‌గోలుగా ఉప‌యోగించుకోవాలి. అరెస్టుల భ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌లు భ‌య‌భ్రాంతుల‌య్యేలా వెంటాడాలి. ఆఖ‌రికి ఆత్మహ‌త్య కూడా చేసుకునేంత‌గా కూడా వేటాడాలి.  తెలిసిందా? ఇప్పుడు త‌ర్వాతి ప్ర‌శ్న‌కి నీ జ‌వాబు అఘోరించు". 

శిష్యుడి మొహంలో ఏడుపొక్క‌టే త‌క్కువ‌. నెమ్మ‌దిగా చ‌ద‌వ‌సాగాడు.

"సార్‌. త‌ర్వాతి ప్ర‌శ్న‌. 'అధినేత ప్ర‌జ‌ల‌తో ఏ విధంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌లెను?'  దీనికి నా స‌మాధానం స‌ర్‌. 'అధినేత అనేవాడు ప్ర‌జ‌ల‌ను క‌న్న‌బిడ్డ‌ల వ‌లె చూసుకొన‌వ‌లెను. కుల‌, మ‌త‌, జాతి, వర్ణ, వ‌ర్గ విభేదాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌లెను. అంద‌రి సంక్షేమం కోసం స‌మానంగా పాటు ప‌డ‌వ‌లెను. ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేస్తూ వారికి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌డేందుకు దోహ‌దం చేసే ప‌ధ‌కాల‌ను బాధ్య‌తాయుతంగా ప్ర‌వేశ‌పెట్ట‌వ‌లెను'. ఇది సార్‌. క‌నీసం ఒక్క మార్కైనా వ‌స్తుందాండీ..."

"మ‌ళ్లీ సున్నా వేసుకోరా బ‌డుద్దాయ్‌..."

"ఎందుకో నా మ‌ట్టి బుర్ర‌కు తెలిసేలా చెప్పండి సార్‌..."

"నీ చుట్టూ ఏం జరుగుతోందో క‌ళ్లెట్ట‌కుని చూడ‌రా. ఓ మ‌తం వారి విశ్వాసాలు దెబ్బ‌తినేలా కొంద‌రు ఉన్మాదులు ఆల‌యాల విధ్వంసానికి  పాల్ప‌డితే ఏ కేసైనా ముందుకు సాగిందిరా? అలా చేసిన వాళ్లంతా మ‌తి స్థిమితం త‌ప్పిన వారేన‌న్న‌ట్టుగా చూపించ‌డం లేదూ? ఇది మ‌తాల వారీగా స‌మాజంలో చిచ్చుర‌గిల్చేలా చేయ‌డ‌మే క‌దా? అధినేత మాట‌ల్లో త‌ర‌చు కుల ప్ర‌స్తావ‌న వ‌స్తోందంటే ఏమ‌నుకోవాలి?  కులాల కుల‌కుల‌ల‌కు నాంది ప‌ల‌క‌డ‌మే క‌దా?  ముఖ్య‌మైన ప‌ద‌వుల‌న్నీ ఓ వ‌ర్గం వారికే ఎక్కువ‌గా కేటాయించ‌డం ద్వారా స‌మాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు? ఇక ప్ర‌జ‌ల పేరిట ప్రవేశ‌పెట్టిన న‌వ ప‌థ‌కాల ద్వారా ఏం జరుగుతోందో గ‌మ‌నించ‌లేదా?  ప్ర‌జ‌ల్లో జ‌వాబుదారీత‌నాన్ని పెంపొందించాల్సింది పోయి, ఉచిత ప‌థ‌కాల ద్వారా ఓటు రాజ‌కీయాలు న‌డ‌ప‌డం లేదూ? ఇది బాధ్య‌తంటావా?  బాధ్య‌తారాహిత్యం అంటావా?  పైగా నీ చ‌చ్చు స‌మాధానానికి మార్కులు రాలేద‌ని ఏడుస్తావ్‌. ఇప్పుడు త‌ర్వాతి ప్ర‌శ్న చ‌దువు. అదైనా బాగా రాశావేమో చూద్దాం..." 

శిష్యుడికి నీర‌సం వ‌చ్చేసింది. అయినా  త‌ప్ప‌క చ‌ద‌వ‌సాగాడు. 

 "తర్వాతి ప్ర‌శ్న సార్‌.  'అధినేత  ప‌రిపాల‌నా వ్య‌వ‌స్థ‌ల‌ను ఏ విధంగా ప‌రిపుష్టం చేయ‌వ‌లెను?'  దీనికి నా స‌మాధానం ఇలా రాశాను సార్‌. 'ప‌రిపాల‌న‌కు స‌హాయ ప‌డే చ‌ట్ట‌, అధికార‌, న్యాయ‌, సామాజిక‌, ఆర్థిక‌, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల్లో పార‌ద‌ర్శ‌క‌త పెరిగేలా చేయ‌వ‌లెను. ఆయా వ్య‌వ‌స్థ‌ల అధికారుల్లో విశ్వాసం పాదుకొనేలా వ్య‌వ‌హ‌రించ‌వ‌లెను. ప్ర‌జ‌ల క్షేమం కోస‌మే తామున్నామ‌నే భావ‌న వ్య‌వ‌స్థ‌ల ప్ర‌తినిధుల్లో ఎల్ల‌ప్పుడూ క‌లిగేలా చూడ‌వ‌లెను. వారికి అర్హ‌త రీత్యా ప‌దోన్న‌తులు, ప్రోత్సాహ‌కాలు అందిస్తూ ఉత్సాహంగా ప‌నిచేసే ప‌రిస్థితులు క‌లిగించ‌వ‌లెను. వారికి పాల‌నా వ్య‌వ‌హారాల్లో త‌గిన భాగ‌స్వామ్యం క‌లిగించి చైత‌న్య‌ప‌ర‌చ‌వ‌లెను'. మ‌రింతే క‌దండీ?  దీనికెన్ని వేసుకోమంటారు?" 

"చ‌క్క‌గా గుండ్రంగా, చెగోడీలాగా ఓ సున్నా వేసుకోరా స‌న్నాసీ..."

"స‌రేసార్‌... వేసుకున్నా... మ‌రి అస‌లైన జ‌వాబు  చెప్పండి సార్‌..."

"మ‌ళ్లీ నీ అధినేత కేసి చూడ‌రా నాయ‌నా! మ‌హ‌త్త‌ర‌మైన స‌మాధానం ల‌భిస్తుంది. అధికార వ్య‌వ‌స్థ‌ను అధినేత ఎలా మార్చాడురా? త‌ను లోగ‌డ చేసిన అవ‌క‌త‌వ‌క‌, అవినీతి కార్య‌క‌లాపాల్లో స‌హ‌క‌రించిన ఐయ్యేఎస్ అధికారుల‌ను ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మ‌రీ హోదాలు క‌ల్పించ‌లేదూ. మాట విన‌ని అధికారుల ప‌ట్ల అధినేత తీరు ఎలా ఉందో తెలిశాక ఏ అధికారైనా నోరెత్తుతున్నాడా అని? ఆ విధంగా అధికార వ్య‌వ‌స్థ కునారిల్ల‌లేదూ? త‌న‌కు వ్య‌తిరేకంగా తీర్పులు, మంద‌లింపులు వ‌స్తున్నాయ‌ని అధినేత స్వ‌యంగా దేశ రాజ‌ధానికి వెళ్లి న్యాయ వ్య‌వ‌స్థ‌పైనే ఫిర్యాదు చేసిన వింత ఎప్పుడైనా విన్నామా? క‌న్నామా? ఇది న్యాయ వ్య‌వస్థ‌ను అన్యాయంగా నీరుగార్చే ప్ర‌య‌త్నం కాదూ? ఇక చ‌ట్టాన్ని ర‌క్షించే పోలీసు వ్య‌వ‌స్థ సొంత గూండాలు, అనుచ‌రుల మాదిరిగా మారిపోలేదూ? ఆఖ‌రికి పోలీసులు త‌మ ఉన్న‌తాధికారుల ఆదేశాల క‌న్నా, స్ధానిక అధికార పార్టీ నేత‌ల ఆదేశాలే పాటించేంత‌గా వ్య‌వ‌స్థ భ్ర‌ష్టుప‌ట్టిపోలేదూ?  ప్ర‌శ్నించిన పాపానికి సొంత పార్టీ ఎంపీపైనే క‌క్ష క‌ట్టిన వారికి సామాన్యులొక లెఖ్ఖా? అరెస్టులు, గృహ‌నిర్భంధాల‌తో ప‌ర‌గ‌ణా ప్ర‌తిధ్వ‌నించ‌డం లేదూ? ఇక అదుపులేని అప్పుల‌తో, నిధుల మ‌ళ్లింపుతో, ఉచిత ప‌ధ‌కాల‌తో ఆర్ధిక వ్య‌వ‌స్థ అణ‌గారిపోయిందాలేదా?  ఇలా ప్ర‌తి వ్య‌వ‌స్థ‌ను పిడికిట్లో పెట్టుకోవాల‌ని క‌ద‌రా నువ్వు రాయాల్సిన స‌మాధానం? మ‌రింకా మార్కులంటావేం?" 

శిష్యుడికి దుఃఖం త‌న్నుకొచ్చింది. దాదాపు ఏడుస్తూ... "ఇదేంటి సార్‌... మీరు పెట్టిన స్లిప్‌టెస్టులో 20 మార్కుల‌కి ఒక్క మార్కు రాలేదు? ఎక్కడ పొర‌పాటు జ‌రిగిందండీ?" అని అడిగాడు.

గురువుగారు ప‌గ‌ల‌ప‌డి న‌వ్వి, "ఓరి నా వెర్రి శిష్యా! నువ్వు స్వ‌చ్ఛ రాజ‌కీయ జ‌వాబులు రాశావురా. రాయాల్సింది నీచ రాజ‌కీయ జ‌వాబులు. నువ్వు ఒక నేత‌గా ఎదిగి... ప్ర‌జ‌ల క్షేమం కాకుండా నీ సంక్షేమం,  జ‌నం అభివృద్ధి కాకుండా  నీ ప‌రిజ‌నం అభివృద్ది,  రాష్ట్రం ఎదుగుద‌ల కాకుండా నీ ఎదుగుద‌ల‌, ప‌ర‌గ‌ణా ప్ర‌గ‌తి కాకుండా నీ బంధుమిత్రుల పురోగ‌తి చూసుకుని ప‌దికాలాల పాటు ప‌ద‌విలో ఉండాల‌నుకున్నా, ప‌ది త‌రాల పాటు త‌ర‌గ‌ని ఆస్థిపాస్థులు సంపాదించుకోవాల‌న్నా... ఈ జ‌వాబులే క‌రక్టురా. అప్పుడే నేను చెప్పే పాఠాల‌కీ, నువ్వు నేర్చుకున్న విద్య‌కీ సార్ధ‌క‌త ఏర్ప‌డుతుంది. అర్థ‌మైందా? స‌రే నువ్వు తెగ బాధ ప‌డిపోతున్నావు కానీ, ఆఖ‌రుగా బోన‌స్ ప్ర‌శ్న అడుగుతా. దీనికైనా స‌రిగా స‌మాధానం చెప్పు. ఇప్పుడు నీ రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న అక్ర‌మార్కుడి ప‌రిపాల‌నా శైలికి ఎన్ని మార్క‌లు వేస్తావు?" 

శిష్యుడు ఉత్సాహంగా చెప్పాడు.

"చ‌క్క‌గా, గుండ్రంగా, చ‌క్కిలంలా, చెగోడీలా, బండి చ‌క్రంలా, బ‌స్సు టైరులా, అప్ప‌డంలా... ఏది ఉంటుందో అన్ని మార్కులు సార్‌..."

"శెభాష్‌... ఇప్పుడు నీకు నూటికి నూరు మార్కులురా. ఇక పోయిరా!"

-సృజ‌న‌

PUBLISHED ON 3.8.2021 ON JANASENA WEBSITE