story లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
story లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, మే 29, 2025

మార్స్‌పై సెల్ఫీ... అందులో ఓ దెయ్యం!


ఎక్కడికి వెళ్లినా సెల్‌ఫోన్‌ పైకెత్తి అందులోని కెమేరాతో ఓ సెల్ఫీ కొట్టకపోతే తోచదు కదా! ఆ సెల్ఫీని చూసుకుని మీరు మురిసిపోయి మీ స్నేహితులందరికీ పంపిస్తారవునా?

కానీ ఎవరూ వెళ్లలేని చోట తీసుకున్న సెల్ఫీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఆ సెల్ఫీని ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తి కరంగా చూస్తోంది. అంతేకాదండోయ్‌... అందులో ఓ 'డెవిల్‌' కూడా ఉందని గమనించారు. ఇంతకీ ఏంటా సెల్ఫీ? ఎవరు తీసుకున్నారు? ఎక్కడ? ఆ దెయ్యం ఏంటి? 

.... ఇవన్నీ తెలుసుకోవాలంటే చదువుకోండి మరి. 

ఆ సెల్ఫీ భూమ్మీద తీసినది కాదు. భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో తీసుకున్నది! 

తీసుకున్నది ఎక్కడో తెలుసా? మార్స్‌ గ్రహం మీద!

తీసిందెవరనుకుంటున్నారు? నాసా వాళ్లు అక్కడికి పంపిన రోవర్‌! రోవరంటే తెలుసుగా? వేరే గ్రహాల మీద పరిశోధనల కోసం వేర్వేరు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు  పంపే ఓ చిన్న రోబో వాహనం అన్నమాట. దాని పేరు పెర్‌ సెర్వరెన్స్‌ రోవర్‌. దీన్ని అమెరికా వాళ్లు అక్కడికి పంపి 1500 మార్షియన్‌ డేస్‌ అయింది. ఆ సందర్భంగా అదొక సెల్షీ తీసుకుని భూమికి పంపించింది. ఒక మార్షియన్‌ డే అంటే సుమారు 24 గంటల 39 నిమిషాలు. ఇంచుమించు మన భూమి మీద రోజుతోనే సమానం. దాన్ని మన భూమి రోజుల్లోకి మారిస్తే అది సుమారు నాలుగేళ్ల రెండు నెలలతో సమానం. ఈ రోవర్‌ 2021 ఫిబ్రవరిలో మార్స్‌ గ్రహం మీద దిగింది. ఈ నాలుగేళ్లూ అదక్కడ ఏం చేసిందయ్యా అంటే... తన బుల్లి బుల్లి చక్రాల సాయంతో 22 మైళ్లు చక్కర్లు కొట్టింది. 37 బండల్ని తొలిచి వాటిలో ఏముందో చూసింది. మరో 27 మార్స్‌ ఉపరితలం శాంపిల్స్‌ను తీసుకుంది. అంతేకాదు, ఇప్పటి వరకు ఏ రోవరూ పంపనంత సమాచారాన్ని భూమికి పంపించింది. మార్స్‌ మీద వాతావరణం ఎలా ఉంటుందో పరిశోధించడానికి ఇవన్నీ చాలా విలువైన వివరాలన్నమాట. 

ఇంతకీ సెల్షీ ఎక్కడ తీసుకుందో తెలుసా? మార్స్‌ మీద 'జెజొరో' అనే ఓ బిలం ఉంది. దాని పక్కనే 'విచ్‌ హాజిల్‌' అనే కొండ ఉంది. రోవర్‌ గారు ఆ ఎత్తయిన ప్రదేశానికి ఎక్కి అక్కడి నుంచి చకచకా సెల్ఫీలు తీసుకుని 'చూసుకోండ్రా' అన్నట్టు భూమ్మీదకి పంపేసింది. వాటన్నింటినీ ఇక్కడి అంతరిక్ష పరిశోధకులు కొన్ని నెలలుగా క్షుణ్ణంగా పరిశీలించారు. 

అలా చూస్తుంటేనే వాటిలో ఓ 'దెయ్యం' కనిపించింది!

ఏంటా దెయ్యం?

మార్స్‌ మీద దెయ్యమా? అమ్మో! అని భయపడకండి. అది శాస్త్రవేత్తలు పెట్టిన పేరు. రోవర్‌కి మూడు మైళ్ల దూరంలో దుమ్ము ధూళితో కూడిన ఓ పెద్ద సుడిగాలి అన్నమాట. దీన్ని 'డస్ట్‌ డెవిల్‌' అని పిలుస్తున్నారు. రోవర్‌గారు పంపిన 59 సెల్ఫీలను క్రోడీకరించి ఒకే పెద్ద దృశ్యంగా మార్చినప్పుడు అందులో ఓ డస్ట్‌ డెవిల్‌ కనిపించిందన్నమాట. 'ఇలాంటి సమాచారాన్ని, ఫొటోలను విశ్లేషించినప్పుడు ఆ గ్రహం గురించి ఆశ్చర్యకరమైన ఎన్నో విషయాలు తెలస్తాయి' అంటూ కాలిఫోర్నియాలోని అంతరిక్ష పరిశోధకులు తెగ సంబరపడిపోతున్నారు. అదన్నమాట... ఈ అరుదైన సెల్షీ, అందులో దెయ్యం కథ!

గురువారం, మే 08, 2025

కలం స్నేహంలో కలవరం!


ఇప్పుడంటే వాట్సాప్‌లు, జూమ్‌లు, వీడియో కాల్సూ గట్రా వచ్చేశాయి కానీ, ఓ నలభై ఏళ్ల కిందట ఉత్తరాలే కదా, కబుర్లు బట్వాడా చేసేవి? అంత పాత ముచ్చటే ఇది. నేను డిగ్రీ చేసి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న సమయం అది. కుర్రతనం వెర్రితలలు వేస్తూ ఉండేది. అప్పట్లో దాదాపు అన్ని వార పత్రికల్లోనూ కలం స్నేహం కోసం ఓ పేజీ కేటాయించేవారు. అందులో ఓ వైజాగ్‌ అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయికి అమ్మాయి పేరుతో ఉత్తరం రాయాలనే కొంటె ఊహ కలిగింది. ఏ పేరుతో రాయాలి? వెంటనే తట్టింది కల్పన అని. ఇది నా కల్పనే కదా? ఆ అబ్బాయిని కలం స్నేహానికి ఆహ్వానిస్తూ ఓ అందమైన ఉత్తరం రాశాను. ఉత్తరానికి అందమేమిటనుకోకండి. అందులోని భావాలు అందమైనవన్నమాట. 

''కలం స్నేహం కాలమ్‌లో మీ వివరాలు చూశాను. మీ అభిరుచులు నచ్చాయి. మీతో స్నేహం చేయాలనిపించింది. నా పేరు కల్పన. ఏలూరులో ఉంటాను...'' అంటూ పరిచయ వాక్యాలతో పాటు, ఏవేవో రాసి పోస్టు చేసేశాను. 

మేం ఏలూరు పవర్‌ పేటలో శ్రీమతి అరుంధతి రావు గారి ఇంట్లో వెనక పోర్షన్‌లో అద్దెకుండేవాళ్లం. ఉత్తరాలేమైనా వస్తే ఆవిడే అందుకునే వారు. తర్వాత ఎవరివి వారికి అందించేవారు. ఎందుకంటే వాళ్లింట్లో రెండు మూడు పోర్షన్లు ఉండేవి. అద్దెకుండే వాళ్లందరికీ ఆవిడ వీధి గదే కబుర్ల ఖజానా. అందరం ఆవిడ ల్యాండ్‌ లైన్‌ నెంబర్నే బంధువులకి ఇచ్చేవాళ్లం. వాళ్లెవరైనా ఫోన్‌ చేస్తే ఆవిడ స్వయంగా పిలిచేవారు. మాకే కాదు, ఆ వీధి మొత్తానికి ఆవిడ ఫోన్‌ నెంబరే గతి. వేరే ఇళ్ల వాళ్లకి ఫోన్‌ వస్తే పనిమనిషి సుందరమ్మని పంపి కబురంపేవారు. ఇలా ఎప్పుడు చూసినా ఆవిడ వీధి గది సందడిగా ఉండేది. అద్దెకుండే వాళ్లు ఎవరు బయటి నుంచి వచ్చినా ముందు ఆ హాల్లోకే వెళ్లి ఆంటీని పలకరించి నాలుగు కబుర్లు చెప్పి ఆ తర్వాతే తమ పోర్షన్‌లోకి వెళ్లేవారు. మనం సందడిగా జోక్స్‌ వేస్తూ లొడలొడా మాట్లడతాం కాబట్టి ఆంటీకి ప్రత్యేకమైన ఇష్టం. అదీగాక నేనప్పట్లో కాలక్షేపానికి ఓ స్థానిక సాయంకాలం పత్రికలో పనిచేస్తుండేవాడిని. ఆంటీ రాసిన కవితల్ని అందులో వేసేస్తూ ఉండేవాడిని. దాంతో పాటు వార పత్రికల్లో వచ్చే పద బంధ ప్రహేళిక (క్రాస్‌ వర్డ్‌) లాంటి పజిల్స్‌ని నేను చకచకా పూర్తి చేస్తుండేవాడిని. వాటిని ఆంటీ తన పేరుతో పంపుకుంటూ ఉండేవారు. 

ఓసారి నేను వీధిలోంచి ఇంటి ఆవరణలోకి  రాగానే ఆంటీ నన్ను పిలిచి ''కల్పన ఎవరు శర్మా?'' అని అడిగారు. అప్పటిదాకా నాకు కలం స్నేహానికి ఆహ్వానం పంపిన సంగతే గుర్తు లేదు. నా చిరునామా 'కల్పన, కేరాఫ్‌ శర్మ...' వగైరా వివరాలతో ఇచ్చానన్నమాట. నేను ఆత్రుతగా ఆ ఉత్తరం అందుకుని ఆ వైజాగ్‌ అబ్బాయి రాసిన ఉత్తరం చదివేశా. ఆ తర్వాత నవ్వుతూ మొత్తం సంగతి చెప్పా. ఆంటీయే కాదు, అక్కడ ఉన్న వాళ్లందరూ పగలబడి నవ్వేశారు. ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని ఒకరి తర్వాత ఒకరు చదివేశారు. 

ఇహ అక్కడి నుంచి కల్పనకి వచ్చే ఉత్తరాలన్నీ మాకు గొప్ప హాస్య కాలక్షేపమై పోయాయి. నేను ఠంచనుగా జవాబులు రాస్తూ ఉండేవాడిని. ఆ వైజాగ్‌ అబ్బాయి పాపం... కల్పన అనే అమ్మాయిని ఊహించుకుని తెగ ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. ఆ ఉత్తరాలను నేను నెమ్మదిగా స్నేహం స్థాయిని దాటించి, ఇష్టం దశకి చేర్చాను. నా జవాబులు, కల్పనకి వచ్చే ఉత్తరాల కోసం ఆ ఇంట్లో అందరూ ఎదురు చూసేవారు. 

ఆఖరికి ఆ కుర్రాడిని కల్పనని ప్రత్యక్షంగా కలవడానికి తహతహలాడే స్థితకి తీసుకొచ్చా.  నేను మాత్రం 'అమ్మో... తల్లిదండ్రుల చాటు పిల్లని. అన్నయ్య ఊరుకోడు...''లాంటి కబుర్లు చెబుతూ ఉండేవాడిని. ఆఖరికి అతడు హైదరాబాద్‌ వెళుతూ నన్ను మధ్యలో ఏలూరు స్టేషన్‌కి వచ్చి కలుసుకోవాలని ప్రతిపాదించాడు.

''మరి ఇప్పుడేం చేస్తావ్‌?'' అని అడిగారు, ఆంటీ నవ్వుతూ. 

''ఏముందాంటీ? ఎర్ర చీర కట్టుకొస్తానని రాస్తా. ఆ చీర కట్టుకున్నవాళ్లందరినీ వెతుక్కుంటాడు...'' అన్నాన్నేను. 

ఆ వైజాగ్‌ అబ్బాయి పాపం తాను ఎక్కిన రైలేంటో, బోగీ ఏంటో లాంటి వివరాలన్నీ ఏకరువు పెట్టాడు. 

ఆ రోజు రానే వచ్చింది. ఆంటీ సహా అందరిలోనూ ఉత్కంఠ. 

''పాపం.... ఆ కుర్రాడు డిజప్పాయింట్‌ అవుతాడేమో... ఇప్నుడేం చేస్తావ్‌?'' అని అడిగారు ఆంటీ.

''జ్వరం వచ్చి రాలేకపోయానని చెబుతానాంటీ...'' అనేశా నేను తేలిగ్గా. 

అయితే విషయం అంత తేలిగ్గా వదల్లేదు. 

రెండు రోజులు పోయాక ఆంటీ మా వెనక పోర్షన్‌ లోకి కంగారు పడుతూ వచ్చి, ''ఆ కుర్రాడు వచ్చాడు శర్మా... కల్పన ఉండేది ఇక్కడేనా అని అడిగాడు. నాకేం చెప్పాలో తెలియక హాల్లో కూర్చోబెట్టి వచ్చా.... ఇప్పుడెలా?'' అన్నారు. 

నాక్కూడా కాస్త కంగారనిపించింది. ''ఎలాగరా బాబూ... '' అనుకున్నా. వెనక పోర్షన్‌ లోంచి  ఆంటీ వాళ్ల హాల్లోకి తొంగి చూశా. ఆ కుర్రాడెవరో తెల్లగా, నాజూగ్గా ఉన్నాడు. ఏదో పత్రిక తిరగేస్తూ కనిపించాడు. 

''ఏం చెప్పమంటావో చెప్పు మరీ...'' అంటూ ఆంటీ రెట్టించారు. 

ఈలోగా మా అమ్మగారు కల్పించుకుని, ''ఇలాంటివన్నీ వద్దని చెబుతూనే ఉన్నాను. వినలేదు. ఇప్పుడు నిజం తెలిస్తే అతడేం గొడవ పెడతాడో ఏంటో...'' అంటూ కంగారు పడ్డారు. 

నేను కాసేపు ఆలోచించి, ''సరే ఆంటీ... నేనే మీ వీధి గదిలోకి వస్తాను. నన్ను కల్పన వాళ్ల అన్నయ్యగా పరిచయం చేయండి...'' అన్నాను. ఆవిడ సరే నని వెళ్లారు. నేను తయారై, ప్యాంటు, షర్టు వేసుకుని, మొహం వీలయినంత గంభీరంగా పెట్టుకుని సందు చుట్టూ తిరిగి ఆంటీ వీధి గదిలోకి వెళ్లాను. 

ఆంటీ ఓ పక్క నవ్వు ఆపుకుంటూనే నన్ను చూసి, ''ఇతడేనండీ కల్పన వాళ్ల అన్నయ్య...'' అంటూ పరిచయం చేశారు. 

ఆ కుర్రాడి మొహంలో కూడా కాస్త కంగారే. 

''ఎవరండీ మీరు? మీకు కల్పన ఎలా తెలుసు?'' అని అడిగాను నేను కాస్త సీరియస్‌గా. 

ఆ కుర్రాడు కాస్త తడబడి, ''నేను కల్పన ఫ్రెండ్‌నండీ... వైజాగ్‌లో ఉంటాను...'' అంటూ తడబడుతూ చెప్పాడు.

''మీ ఇద్దరికీ స్నేహం ఎలా? కల్పన మాకేమీ చెప్పలేదే?'' 

''అంటే... అది కలం స్నేహమండీ. ఉత్తరాలు రాసుకుంటున్నాం. తనకి జ్వరమంటేను కలవాలని వచ్చా...'' అన్నాడు.

ఓ పక్క నాకు ఏం చెప్పాలో, ఎలా దీన్ని ముగించాలో తెలియడం లేదు. అయినా మేక పోతు గాంభీర్యంతో ''కల్పన లేదండీ. ఊరెళ్లింది. అయినా కలం స్నేహం అని చెప్పి ఇంటికి వచ్చేస్తే ఎలా? ఇంట్లో పెద్ద వాళ్లకి తెలిస్తే ఊరుకుంటారునుకున్నారా?'' అంటూ కాస్త గొంతు పెంచి అడిగా. 

ఆ సరికే అతడికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. చటుక్కున లేచి, ''సరేనండీ... సారీ... పని మీద ఈ ఊరికి వచ్చాను కదాని కలుద్దామని వచ్చానంతే.... ఉంటానండీ...'' అంటూ బయల్దేరాడు. ఒక్క క్షణం ఆగి నాతో, ''పాపం... కల్పనని ఏమీ అనకండీ..'' అంటూ వడివడిగా వెళ్లిపోయాడు. 

అతడు వీధి గేటు దాటి వెళ్లగానే ఆంటీ పగలబడి నవ్వసాగారు. టెన్షన్‌గా ఉన్నా, నేనూ నవ్వేశాను. 

''అవును శర్మా... మరి ఇప్పుడేం చేస్తావు?'' అన్నారాంటీ. 

''కల్పన చేత ఉత్తరం రాయిస్తానండీ. ఇంట్లో పెద్ద వాళ్లకి తెలిసిపోయినట్టూ, తిట్టినట్టూ, ఇంటికి చెప్పకుండా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టినట్టూ రాయమంటా. ఈ వంకతో ఈ కలం స్నేహానికి బైబై చెప్పిస్తా...'' అన్నాను. 

ఆ తర్వాత ఆ వైజాగ్‌ అబ్బాయి నుంచి ఉత్తరాలు రాలేదు. కల్పన కూడా ఏమీ రాయలేదు. 

బుధవారం, ఆగస్టు 21, 2024

ఓ జీవితం... ఓ పుస్తకం... ఓ సినిమా!



'ఇన్నాళ్లూ ఎందుకు చూడలేకపోయాను?'... అనిపించింది  సినిమా చూశాక!

చూశాక దాని గురించి నా అభిప్రాయం రాయాలని కూడా అనిపించింది...

ఇప్పటికే చాలా మంది చూసుంటారు... మాట్లాడుకుని ఉంటారు... రాసి కూడా ఉంటారు...

అయినా నేను కూడా చెప్పాల్సిందే... చెప్పి తీరాల్సిందే!

 సినిమా... ''ట్వెల్త్ఫెయిల్‌''!

దేశంలోనే అతి కఠినమైన ఐఏఎస్‌, ఐపీఎస్పరీక్షల్లో విజేతల జీవితాల్లోకి తొంగి చూస్తే, ఎన్నో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉంటాయి.  అతి సామాన్యమైన కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్లు, పేదరికం నుంచి ఎదిగిన వాళ్లు, ఎన్నో కష్టాలు పడి అనుకున్నది సాధించిన వాళ్లూ ఎంతో మంది కనిపిస్తారు. ఒకొక్కరిదీ ఒకో కథ! అందరూ హీరోలే!

'ట్వెల్త్ఫెయిల్‌' కథ కూడా ఇదే. అయితే ఇది కేవలం కథ కాదు... నిజ జీవితం ఆధారంగా తీసినది.

 జీవితం మనోజ్కుమార్శర్మది. అత్యంత పేదరికంలోంచి వచ్చి ఐపీఎస్అధికారిగా ఎదిగిన వ్యక్తిది. 2005 బ్యాచ్కి చెందిన ఇతడి గురించి 2019లో 'ట్వెల్త్ఫెయిల్‌' పేరుతో హిందీ రచయిత అనురాగ్పాథక్ నవల రాశాడు.  నవలను ఆధారం చేసుకుని తీసిందే  సినిమా. 2023 అక్టోబరులో విడుదలైంది. నవలకీ, సినిమాకి మూలమైన మనోజ్కుమార్శర్మ ప్రస్తుతం మహారాష్ట్ర క్యాడర్లో సెంట్రల్ఇండస్ట్రియల్సెక్యూరిటీ ఫోర్స్ఇనస్పెక్టర్ జనరల్ఆఫ్పోలీస్గా పని చేస్తున్నారు.

మధ్యప్రదేశ్లో బందిపోట్లకు పేరొందిన చంబల్ప్రాంతానికి చెందిన ఇతడు, ట్వెల్త్ క్లాస్ఫెయిల్అయి, బీఏ అయిందనిపించుకున్న  సామాన్య నిరుపేద యువకుడు.  డిగ్రీతో దొరికిన ఏదో ఉద్యోగంలో  గుమాస్తాగానో ఇమిడిపోయి ఉంటే, ఇతడి గురించి చెప్పుకోవలసిన పనే లేదు. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలో తెలియాలంటే అతడి ట్వెల్త్క్లాస్రోజుల్లోకి వెళ్లి చూడాలి.

పరీక్షకి సిద్ధం అవ్వాలంటే, జేబుల నిండా స్లిప్పులు పెట్టుకుని వెళ్లాలనుకునే స్థాయి అతడిది. గ్వాలియర్కాలేజీలో ప్రిన్సిపాల్సాయంతో పరీక్ష రాసే ట్వెల్త్క్లాస్స్టూడెంట్లందరిదీ అదే స్థాయి. స్వయంగా ప్రిన్సిపాల్ బోర్డు మీద జవాబులు రాస్తుంటే, వాటిని మక్కికి మక్కీగా ఎక్కించేస్తూ కుర్రాళ్లంతా పరీక్ష రాసే సమయంలో ఫ్లయింగ్స్క్వాడ్రూపంలో నిజాయితీ గల  డీఎస్పీ వచ్చాడక్కడికి. ప్రిన్సిపాల్బెదిరింపులకి గానీ, లంచానికి గానీ అతడు లొంగలేదు. ఫలితంగా  ఏడాది  కాలేజీలో మొత్తం స్టూడెంట్లందరూ ''ట్వెల్త్ఫెయిల్‌'' అయ్యారు.  బ్యాచ్లోని వాడే మనోజ్కుమార్శర్మ.

ఫ్రెండ్సంతా  డీఎస్పీని తిట్టుకుంటే, అతడికి మాత్రం ఆయనలోని నిజాయితీ నచ్చింది.  నిజాయితీ ఇచ్చిన ధైర్యం నచ్చింది.

అప్పుడొక కల కన్నాడతడు. అది నిద్రలో వచ్చే కల కాదు. మెలకువగా ఉన్నప్పుడు తరిమే కల!

''ఎలాగైనా డీఎస్సీ అవ్వాలి!''... అదీ  కల!!

అతడి స్థాయికి అది ఎవరెస్ట్శిఖరం అంత పెద్దది. అయినా ఎక్కాలనే అనుకున్నాడు.

''నేను మీలా  నిజాయితీ పరుడైన పోలీసు అధికారి అవ్వాలంటే ఏంచేయాలి?'' అని  డీఎస్పీనే అడిగాడు.

''ముందు నిజాయితీగా ఉండు...'' అన్నాడాయన.  మాటలు అతడి మనసులో నాటుకున్నాయి.

అప్పటికి అతడికి ఐపీఎస్అంటే ఏంటో కూడా తెలియదు.

మళ్లీసారి పరీక్షల సమయానికి గ్వాలియర్కాలేజీ కుర్రాళ్ళంతా దర్జాగా స్లిప్పులు పెట్టి ఫస్ట్క్లాస్తెచ్చుకుంటే... వాటి కేసి చూడనైనా చూడకుండా నిజాయితీగా తనకొచ్చిందేదో రాసి సాధారణంగా ప్యాస్అవడం అతడి తొలి విజయం.

కాపీ కొట్టి ఫస్ట్ క్లాస్తెచ్చుకోవడం కంటే, నిజాయితీగా వచ్చిన థర్డ్క్లాసే అతడికి ఆనందాన్ని ఇచ్చింది.

 తర్వాత డీఎస్పీ అవ్వాలన్న కలే అతడిని నడిపించింది.  చేతిలో పైసా లేకపోయినా  స్నేహితుడి సాయంతో దిల్లీ తీసుకెళ్లింది. పగలంతా 15 గంటలు పని చేస్తూ, రాత్రి వేళ 6 గంటలు చదువుకునేలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు మూడు సార్లు ప్రిలిమ్స్ఫెయిలయినా పట్టువదలకుండా నిలబెట్టింది. చివరి ప్రయత్నంలో మెయిన్స్క్లియర్చేయించింది!

ఇదంతా చెప్పినంత సులువు కాదు... అనుభవించినంత కష్టం!

ఇంటికి దూరంగా... ఊరుకాని ఊర్లో... దిల్లీ మహానగరంలో... కడుపు నిండడానికి కూడా పని చేయక తప్పని పరిస్థితిలో... ఐపీఎస్కి సిద్ధం కావాలంటే... ఏం చేయాలో అన్నీ చేశాడతడు!

బత్రూంలు క్లీన్చేశాడు!

పిండిమరలో పని చేశాడు!

మూడడుగుల స్థలంలోనే రాత్రిళ్లు గుడ్డి బల్బు వెలుగులో చదువుకున్నాడు!

ఎన్నో వెటకారాలు ఎదుర్కొన్నాడు!

అవమానాలు భరించాడు!

ఇంత కష్టపడుతున్నా... ఎక్కడా చిరునవ్వును చెరగనీయలేదు. పట్టుదల సడలనీయలేదు. నిజాయితీని వదులుకోలేదు.

కానీ...  నిజాయితీకే పెద్ద గండం ఎదురైంది మెయిన్స్ఇంటర్య్యూలో!

''ట్వెల్త్ఎందుకు ఫెయిలయ్యావు?'' అనే ప్రశ్నే  గండం!

ముందుగానే  ప్రశ్నను ఊహించిన చాలా మంది అతడికి చెప్పారు... అబద్దం ఆడమని. ఎవరో చనిపోయారని చెప్పమన్నారు.

మనోజ్కుమార్నాలుగేళ్ల కష్టం  ప్రశ్న ముందు నిలబడింది!

అబద్దం ఆడి ఇంటర్వ్యూ గెలవాలా?

నిజం చెప్పి ఓడిపోవాలా?

ఓడిపోయినా పరవాలేదు కానీ నిజమే చెప్పాలనుకున్నాడు నిజాయితీగా.

'' ఏడాది ఛీటింగ్జరగలేదు. అందుకే ఫెయిల్అయ్యాను...'' అన్నాడు ధైర్యంగా.

ఇంటర్వ్యూ గదిలో బాంబు పేల్చిందా జవాబు. బోర్డు సభ్యులే నివ్వెరపోయారు  జవాబుకి!

ఏమనాలో తెలియక, '' రెండు నిమిషాలు బయట వేచి ఉండు'' అన్నారు.

తిరిగి పిలిచాక అడిగారు... ''ఎందుకలా చెప్పావు? అబద్దం ఆడి ఉండవచ్చుగా?'' అని నేరుగా అడిగారు.

''అబద్దం చెప్పి ఐపీఎస్ఆఫీసర్ని అవడం కంటే... నిజం చెప్పి ఇంటర్వ్యూలో ఫెయిల్అవడమే నయమనుకున్నాను...'' అన్నాడతను చిరునవ్వుతో ధైర్యంగా, నిజాయితీగా.

 తర్వాత ప్రశ్నలకు... అతడు  ఛీటింగ్వ్యవహారం గురించి చెప్పాడు.  ఛీటింగ్వెనకాల ఉండే స్థానిక నాయకుల ప్రాబల్యం గురించి చెప్పాడు. సమాజంలో అధికారం చేసే ఆగడాల గురించి చెప్పాడు.  నిజాయితీ పరుడి చేతిలో అదే అధికారం ఉంటే వ్యవస్థలో మార్పు వస్తుందనే అతడి నమ్మకం గురించి చెప్పాడు.

అప్పుడు దూసుకొచ్చింది ఆఖరి ప్రశ్న, ఇంటర్వ్యూ ఛీఫ్మెంబర్నుంచి...

'' ఇంటర్వ్యూలో ఫెయిలైతే ఏం చేస్తావ్‌?''.

నిజాయితీనే నమ్ముకున్న అతడు స్థిరంగా చెప్పాడు...

''సూర్యుడినై వెలుగు పంచాలనుకున్నాను. ఓడిపోయినా పరవాలేదు. ఇంటికెళ్లిపోయి  దీపాన్నై మా వీధికి వెలుగునిస్తా.  టీచరునై చిన్నపిల్లలకి నిజాయితీని పరిచయం చేసి భావి తరాన్ని తయారు చేస్తా...''

 ఛీఫ్మెంబర్ఊరుకోలేదు...

''ఓకే... యూకెన్గో అండ్బికమ్ స్ట్రీట్ల్యాంప్‌...'' అన్నాడు వెటకారంగా.

అతడు గదిలోంచి బయటకి వచ్చేస్తుంటే... ''వేస్ట్ఆఫ్టైమ్‌...'' అనే  బోర్డు మెంబర్కామెంట్వినిపించింది.

 కామెంట్విన్నాక... అతడికి అర్థం అయింది. ఇన్నాళ్ల తన ప్రయత్నమంతా వృధా!

ఇదేనా నిజాయితీకి దక్కిన ఫలితం? అనుకున్నాడు దిగులుగా.

కానీ... అతడు నమ్మిన నిజాయితీ అతడిని ఓడిపోనివ్వలేదు....

ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లలో చర్చ జరిగింది.

''ఇతడిని సెలెక్ట్చేయకపోతే  ఇంటర్వ్యూలన్నీ వేస్ట్‌...'' అన్నారు మెజర్టీ సభ్యులు!

అలా నిజాయితీ గెలిచింది!  నిరుపేద పల్లెటూరి కుర్రాడిని ఐపీఎస్అధికారిగా యూనిఫాం వేసి కుర్చీలో కూర్చోబెట్టింది!!

................

ఇదంతా... కేవలం 2005 బ్యాచ్లో దేశం మొత్తం మీద 121 ర్యాంకుతో సివిల్స్విజేతగా నిలిచిన మనోజ్కుమార్శర్మ కథ కాదు. ఏటా సివిల్స్కి సిద్ధమయ్యే లక్షలాది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే యదార్థం. నిజం చెప్పాలంటే... ఒక్క సివిల్స్విద్యార్థులకే కాదు. ప్రతీ విద్యార్థికీ స్ఫూర్తి దాయకమే. ఇంకా చెప్పాలంటే... ప్రతి ఒక్కరికీ కూడా. ఎందుకంటే,  విద్యార్థి అయినా,  ఉద్యోగి అయినా... ఎవరైనా ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు.  పోరాటంలో ఓడిపోతూ ఉంటారు. అలా ఓడిపోయిన ప్రతీసారీ తిరిగి తేరుకుని ఎలా పోరాడాలో చెప్పే కథ ఇది. ఓటమిని ఒప్పుకోకుండా మళ్లీ ప్రయత్నించి ఎలా గెలవాలో చెప్పే కథ ఇది. అందుకే  కథ హిందీ రచయిత అనురాగ్పాఠక్ని ఆకర్షించింది. ఆయన రాసిన రెండో నవలే 'ట్వెల్త్ ఫెయిల్‌'. ఆయన మొదటి పుస్తకం 'వాట్సాప్పార్క్రాంతి' అనే కథల సంపుటి.  కథలన్నీ సోషల్మీడియా ప్రభావం మీద రాసినవి.  పరీక్షలంటే భయపడే విద్యార్థులందరికీ సాయపడాలనే ఉద్దేశంతో మనోజ్కుమార్జీవితాన్ని 'ట్వెల్త్ఫెయిల్‌' నవలగా రాశారీయన.  పుస్తకం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

 నవల బాలీవుడ్దర్శక నిర్మాత విధు వినోద్చోప్రా దృష్టిలో పడింది. ఆయన సామాన్యుడా? 'మున్నాభాయ్‌', 'త్రీ ఇడియట్స్‌', 'పీకే', 'సంజు' లాంటి మంచి చిత్రాలను అందించిన నిర్మాత. 'పరిందా', '1942- లవ్స్టోరీ', 'మిషన్కాశ్మీర్‌' లాంటి సినిమాలతో అలరించిన దర్శకుడు. జాతీయ చలన చిత్ర అవార్డులు, ఫిలింఫేర్అవార్డులు అందుకున్న ప్రతిభాశాలి. అలాంటి అతడి చేతిలో పడిన 'ట్వెల్త్ఫెయిల్‌' నవల,  మరపురాని చిత్రంగా తెరకెక్కింది. రూ. 20 కోట్ల బడ్జెట్తో తీస్తే దాదాపు రూ. 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాసుల కంటే అధికంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

మనోజ్కుమార్శర్మ పాత్రలో నటుడు విక్రాంత్మాసీ చాలా చక్కగా కుదిరాడు. టీవీ, సినిమాల నటుడిగా ఫిలింఫేర్అవార్డులు అందుకున్న ఇతడు మనోజ్పాత్రలో ఒదిగిపోడానికి ఎంతో కష్టపడ్డాడు. మనోజ్కుమార్ఐపీఎస్కోసం దిల్లీలో చదువుకునే సమయంలో అతడికి పరిచయమై,  తర్వాత అతడి జీవిత భాగస్వామిగా మారిన శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్అద్భుతంగా నటించింది. అంతక్రితం 'బీచమ్హౌస్‌', 'షాదిస్తాన్‌' 'దిల్బేకరార్‌' చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకి, శ్రద్ధా జోషి పాత్ర పెద్ద బ్రేక్గా మారింది. అయిదు ఫిలింఫేర్అవార్డులను అందుకున్న 'ట్వల్త్ఫెయిల్‌' సినిమా, తొలి ఫ్రేమ్నుంచి చివరి వరకు ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనివ్వదు.

ప్రేక్షకులు మనోజ్కుమార్తో కలిసి ప్రయాణిస్తారు. అతడి కష్టాలు చూసి నిట్టూరుస్తారు. అతడి పట్టుదల చూసి ఆశ్చర్యపోతారు. అతడి పరిస్థితికి కన్నీరుమున్నీరవుతారు.  అతడి అవమానాలకు బాధ పడిపోతారు. ఆఖరికి అతడు గెలిస్తే, తామే గెలిచినంతగా కేరింతలు కొడతారు. అలా అడుగడుగునా ప్రేక్షకులు మమేకమయిపోయేంత గొప్పగా వినోద్చోప్రా సినిమాను మలిచాడు. సినిమాలో చాలా మంది నిజ జీవిత పాత్రలనే పోషించారు. యూపీఎస్సీ కోచ్వికాస్దివ్యకీర్తి అదే పాత్రలో నటించాడు. సివిల్స్కి సిద్ధమవుతున్న విద్యార్థులే వేర్వేరు పాత్రల్లో కనిపించారు. ఇది సినిమాకి సహజత్వాన్ని తీసుకొచ్చింది.

ఇంతకు మించి  సినిమా గురించి చెప్పడం కన్నా, చూడ్డమే మంచింది.  సినిమాను చూడకపోతే ఏదో మిస్సయ్యేవాళ్లమనే సంగతి...  సినిమాను చూసిన వాళ్లందరికీ అర్థం అవుతుంది. మొత్తం మీద అందరూ 'వితౌట్ఫెయిల్‌' తప్పకుండా చూడాల్సిన సినిమా 'ట్వెల్త్ఫెయిల్‌''.

+  సినిమాలో నటులను ఎంపిక చేసుకోడానికి పెద్ద ప్రక్రియే జరిగింది. ముఖ్యమైన ఒకో  పాత్రకి 35 మంది కంటే ఎక్కువ మందిని పరీక్షించి మరీ ఎంపిక చేశారు. కానీ మనోజ్కుమార్పాత్రకి మాత్రం విక్రాంత్ని ఒక్కరినే పరీక్షించి వెంటనే తీసుకున్నారు.

+ పల్లెటూరి కుర్రాడిగా కనిపించడం కోసం విక్రాంత్ సినిమాలో ఎలాంటి మేకప్వేసుకోలేదు. పైగా సహజత్వం కోసం పల్లెటూర్లో ఎండలో గంటల తరబడి గడిపి, చర్మం రంగును ఛామనఛాయగా మార్చుకున్నాడు.  ప్రయత్నంలో అతడి చర్మం కొన్ని చోట్ల బాగా కమిలిపోయింది కూడా. ఇది కొన్ని సీన్లలో స్పష్టంగా కనిపిస్తుంది.

+ మూడేళ్ల కాలంలో  సినిమా స్క్రీన్ప్లేను వినోద్చోప్రా 200 సార్లకు పైగా మార్చి రాసుకున్నాడు.

+ సినిమాలో ట్రూత్అండ్డేర్ఆట సన్నివేశంలో నటి  మేధా శంకర్‌  తనే స్వయంగా లైవ్షూటింగ్లో పాట పాడింది.

+ యూపీఎస్సీ ఇంటర్వ్యూ సన్నివేశాన్ని  భవనంలో చిత్రీకరించడానికి అనుమతించకపోవడంతో అచ్చం అలాగే సెట్ ని వేశారు. సినిమా చూసిన యూపీఎస్సీ ఉద్యోగులు అది సెట్అని గ్రహించలేనంత సహజంగా దాన్ని సృష్టించారు.

+ సినిమాలో చూపించిన గ్రామం సెట్టింగును నిజానికి ముంబై దగ్గర్లో ఎక్కడైనా వేయవచ్చు. కానీ వినోద్చోప్రా అందుకు ఒప్పుకోకుండా చంబల్నది దగ్గర సహజమైన  గ్రామాన్నే ఎంచుకున్నాడు. రోజూ షూటింగ్సిబ్బంది అందరూ మూడు గంటలు ప్రయాణించి  గ్రామానికి వెళ్లాల్సి వచ్చేది.

+ బాక్సాఫీస్ప్రకారం, 18 ఏళ్ల తర్వాత 25 వారాలు ఆడిన సినిమాగా ఇది నిలిచింది