శనివారం, సెప్టెంబర్ 21, 2024

తిరుపతి లడ్డూలో అరాచకం కల్తీ!

తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే...

భక్తులు ముందు కాలి చెప్పులు విప్పేస్తారు!

పులకించిపోతూ అరచెయ్యి చాస్తారు!

చేతిలో పడిన ప్రసాదాన్ని వినయంగా కళ్లకు అద్దుకుంటారు!

'ఏడు కొండలవాడా! వెంకట రమణా!' అని స్మరిస్తూ అత్యంత పవిత్ర భావంతో దాన్ని ఆరగిస్తారు!

అలాంటి భక్తులందరూ  ఇప్పుడు నిశ్చేష్టులవుతున్నారు...

ఆ లడ్డూ ప్రసాదంలో చేప నూనె ఉందా?!

పంది కొవ్వు చేరిందా?!

కళ్లకద్దుకుని తినే  ఆ పవిత్రమైన ప్రాసాదంలో అపవిత్ర పదార్థాల కల్తీ జరిగిందా?! అంటూ వాపోతున్నారు!

''ఎంత అపచారం! ఎంత ఘోరం! ఇదే ప్రసాదాన్ని వెంకన్న బాబుకు నివేదించారా?'' అనుకుంటూ తల్లడిల్లి పోతున్నారు!

తిరుపతి లడ్డూలో ఉపయోగించే నెయ్యి నాణ్యమైనది కాదని తేలిన సంగతి...

ఓ ఆలయానికి చెందిన అంశం కాదు...

ఓ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు...

ఓ దేశానికే పరిమితమైన వ్యవహారం కూడా కాదు...

ప్రపంచ వ్యాప్తంగానే ఇప్పుడిది ఓ ప్రకంపనం! ఓ కలవరం!

తిరుమలను కలియుగ వైకుంఠంగా, వేంకటేశ్వరుడిని అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిగా భావించే భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు...

ఇది... వేర్వేరు దేశాల నుంచి తరలి వచ్చి, వ్యయప్రయాసలకోర్చి, కేవలం అరక్షణం దర్శనంతో జన్మ ధన్యమైపోయిందనుకుని భావించే కోట్లాది మంది మనసులను కలచి వేసే అంశం!

ఈ సంగతిని ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు...

లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడుతున్నారన్న అంశంపై వెల్లువలా పెల్లుబుకుతున్న స్పందనలే అందుకు సాక్ష్యం!

దేశవ్యాప్తంగా అనేక మంది పీఠాధిపతులు, సనాతన ధర్మ ప్రచారకులే కాదు... కేంద్ర స్థాయి రాజకీయ నాయకులు, అనేక రాష్ట్రాల నేతలు, ప్రముఖుల నుంచి వినిపిస్తున్న విమర్శలే నిదర్శనం!

ఈ పాపం ఎవరిది?

ఇందుకు భాధ్యులు ఎవరు?

ఈ ప్రశ్నలకు సమాధానం ప్రత్యేకంగా వెతకక్కరలేదు...

ఇది కచ్చితంగా జగన్ప్రభుత్వం నిర్వాకమే!

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైకాపా నిర్లక్ష్యమే!

అన్ని వ్యవస్థలను అవస్థల పాలు చేసిన గత పాలకుల అరాచకమే!

బయట ఆవునెయ్యి కొనుక్కోవాలంటే కిలో రూ. 600 పైగా వెచ్చించాల్సిందే...

కిలో గేదె నెయ్యి కొనాలంటే కూడా దాదాపు అంతే ఇచ్చుకోవాల్సందే...

అలాంటిది... తిరుమల తిరుపతి దేవస్థానానికి కేవలం రూ. 320 కే కిలో నెయ్యి ఇస్తామంటూ ఓ సంస్థ ముందుకు వచ్చిందంటే ఏమిటి దానర్థం?

కచ్చితంగా అది నాణ్యతా ప్రమాణాలకు తగినట్టుగా ఉండదనే!

యధేచ్చగా కల్తీ జరుగుతోందనడానికి నిదర్శనమే!

ఈ సంగతి అక్షరజ్ఞానం లేని సామాన్యుడికి కూడా అర్థమయ్యే విషయమే!

కానీ  ఇంత చిన్న అనుమానం తితిదే పాలక వర్గానికి రాకపోవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది...

అలా ఎప్పుడు రాదు?

టెండర్వ్యవహారంలో అవినీతికి ఆనవాళ్లు ఉన్నప్పుడు!

అయిన వాళ్లకి కాంట్రాక్టు కట్టబెట్టినప్పుడు!

ప్రభుత్వం అండదండలు ఉన్నప్పుడు!

జగన్ప్రభుత్వం హయాంలో ఇదే జరిగిందనేది నిర్వివాదాంశమే!

అవడానికి తితిదే స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థే...

కానీ అందులో నియామకాలన్నీ జగన్కనుసన్నల్లో జరిగినవే!

రాజకీయ కోణంలో నింపినవే!

అస్మదీయ బంధువర్గానికి కట్టబెట్టినవే!

అందుకనే కలియుగ వైకుంఠంగా భక్త జనులు భావించే ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానంలో ఇంతటి అపచారం గత ఐదేళ్లుగా జరిగింది!

తిరుమలలో ప్రతి రోజూ 3 లక్షల లడ్డూలు తయారవుతాయి...

ఇందుకు రోజూ 11 వేల కిలోల నెయ్యి అవసరం అవుతుంది...

ఆ లెక్కన నెలకెంత, ఏడాదికెంత అని లెక్కలేసుకుంటే ఇది కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా కురిపించే నెయ్యి సరఫరా కుంభకోణంలో కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగి ఉంటుందనేది ఇప్పుడు సామాన్యులకు సైతం అర్థమవుతున్న బహిరంగ రహస్యం.

జగన్హయాంలో గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయిన ఈ అపచారం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పిడిన తర్వాత భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చేసిన తనిఖీలో నిర్ద్వందంగా బయటపడింది.

తితిదేకి తమిళనాడుకు చెందిన ఏఆర్సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో పంది కొవ్వు (లార్డ్‌), చేపనూనె లాంటి అవాంఛనీయ పదార్థాల ఉనికి ఉందని తేల్చిన నేషనల్డెయిరీ డెవలప్మెంటు బోర్డు సామాన్యమైనదేమీ కాదు. గుజరాత్లోని ఈ సంస్థ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పని చేస్తుంది. అత్యాధునికి లేబరేటరీలు, పరీక్ష విధానాలు అక్కడ ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా బాలాజీ భక్తులందరినీ నివ్వెరపరుస్తున్న ఈ నివేదిక లోని అంశాలు బయటకి రాగానే ఉలిక్కి పడిన గత పాలకుల స్పందనలు చూస్తుంటే 'తాటి చెట్టు ఎందుకెక్కావంటే, దూడ గడ్డికోసం అన్నట్టు'గా కనిపిస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన బాబాయి తితిదే మాజీ ఛైర్మన్వైవీ సుబ్బారెడ్డి విలేకరుల సమావేశంలో చెబుతున్న అంశాలన్నీ ఇలాగే ఆకకు అందనట్టుగా, పోకకు చెందనట్టుగా ఉన్నాయి.

తిరుమల శ్రీవారి ప్రాసాదాలకు రాజస్థాన్లోని ఫతేపూర్నుంచి రోజుకు అరవై కిలోల స్వచ్ఛమైన నెయ్యిని లక్ష రూపాయలు వెచ్చించి కొనేవాళ్లమని వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. అంటే కిలో నెయ్యి రూ. 1667 అన్నమాట. మరి లడ్డూ తయారీలకు వాడే నెయ్యిని మాత్రం కిలో రూ. 320లకు ఎలా కొన్నారు? బయటి మార్కెట్టు ధరతో పోలిస్తే అంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం ఎలా సాధ్యమనే ఆలోచన ఆయనకు తప్ప అందరికీ తలెత్తుతోంది.

మామూలుగా ఒక కిలో ఆవునెయ్యి తయారవ్వాలంటే దాదాపు 18 లీటర్ల పాలు అవసరం. లీటరు 40 రూపాయలనుకున్నా  700 రూపాయలకు పైగానే ఖర్చవుతుంది. మరాలంటప్పుడు ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి రవాణా ఖర్చులు సైతం భరించి అంత తక్కువ ధరకు ఏ సంస్థయినా ఎలా సరఫరా చేయగలరు?

అవినీతి, ఆశ్రిత పక్షపాతాలతో పరిపాలన సాగించిన జగన్ప్రభుత్వానికి కానీ, ఆయన కనుసన్నల్లో పదవులు సంపాదించుకున్న తితిదే బోర్డులోని పెద్దలకి కానీ ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమే కావు.

అసలు ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి ప్రమాణాలు, పద్ధతులు పాటించాలనే విషయానికి వస్తే జగన్ప్రభుత్వానికి ముందు ఉన్న విధానాల గురించి చెప్పుకోవాలి.

అప్పట్లో నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న సంస్థతో ఒప్పందానికి ముందే తితిదే నుంచి అధికారుల బృందం ఆ సంస్థను సందర్శించేది. ఆ సంస్థ సామర్థ్యం, తయారీ పద్ధతులు, సరఫరా విధానాలను క్షుణ్ణంగా పరిశీలించేది. ఆ తర్వాత గుజరాత లోని నేషనల్డెయిరీ డెవలప్మెంటు బోర్డు నుంచి ఆ సంస్థ సర్టిఫికెట్తెచ్చుకోవాలనే నిబంధన ఉండేది. ఆపై సరఫరా అయ్యే నెయ్యి నాణ్యతపై వివిధ దశలలో తనిఖీలు, పరీక్షలు కూడా ఉండేవి. అయితే జగన్ప్రభుత్వంలో ఈ విధానాలన్నీ అటకెక్కాయి. నెయ్యి నాణ్యత తనిఖీలు సైతం తూతూ మంత్రంగా, మొక్కుబడిగా మారిపోయాయి.

నిజానికి శ్రీవారి ప్రసాదాలు, అన్న ప్రసాదాల నిమిత్తం తితిదే సుమారు 48 రకాల సరుకులు కొంటుంది. వీటన్నింటినీ తిరుపతిలోని గోడౌన్లో భద్రపరుస్తారు. వీటి నాణ్యతను పరిశీలించే ల్యాబ్ఒకటి తిరుమలలో ఉన్నప్పటికీ వైకాపా పాలనలో పరీక్షలు నామమాత్రంగా జరిగేవనే ఆరోపణలు ఉన్నాయి. తితిదేకి రోజూ పది వరకు నెయ్యి ట్యాంకర్లు వస్తాయి. ఒకో ట్యాంకరులో 12,000 లీటర్ల నెయ్యి ఉంటుంది. కొన్ని ట్యాంకర్లలోని నెయ్యిని ర్యాండమ్గా నమూనాలు తిరుమల ల్యాబ్కి తీసుకెళ్లి పరీక్షిస్తారు. ఈ పరీక్షలు నిక్కచ్చిగా చేసే పరికరాలు ల్యాబ్లో లేకపోవడంతో పాటు, ఉన్నంతలో చేసే పరీక్షలు కూడా నామమాత్రంగా ఉంటాయని పలు విమర్శలు ఉన్నాయి.

కిం కర్తవ్యం?

సరే... సాక్షాత్తు గోవిందుడికే అపచారం జరిగింది! అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో జంతు, వృక్ష అవశేషాలు కల్తీ అయినట్టు బయటపడి కోట్లాది మంది భక్తుల మనసులు గాయపడ్డాయి!

మరి ఇప్పుడు ఏం చేయాలి?

ఇప్పటికే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారుల సమీక్షలు జరుపుతున్నారు. తిరుమల క్షేత్రం పవిత్రతను, ఆలయ సంప్రదాయాలను పరిరక్షించడానికి ఆగమ, వైదిక, ధార్మిక సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఆలయ సంప్రోక్షణ లాంటి చర్యలు కూడా తీసుకోడానికి సమాయత్తమవుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే ఇక ముందు ఇలాంటివి జరగకుండా చేయాల్సిన చర్యలను తక్షణం చేపట్టాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా యుద్దప్రాతిపదిక మీద పనులు మొదలయితేనే భక్తుల మనోభావాలకు ఊరట లభిస్తుంది.

ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్సూచించినట్టు... సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆగమ శాస్త్రాల్లో ఉన్నట్టు ఆలయాలను పరిరక్షించాలి. రాజకీయ శక్తుల చేతుల్లోకి ఆధ్యాత్మిక సంస్థలు వెళ్లకుండా చూడాలి. ఇందుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడాలి.

తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి, తదితర సరుకుల నాణ్యతను పకడ్బందీగా పరీక్షించగలిగే అధునాతన లేబరేటరీని తిరుమలలో ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు నెయ్యిని పరీక్షించాలంటే గ్యాస్క్రొమొటోగ్రఫీ, హైపెర్ఫార్మెన్స్లిక్విడ్క్రొమొటోగ్రఫీ లాంటి ఏర్పాట్లు ఉండాలి. ఇలాంటి పరీక్షలు చేయగలిగే యంత్రాలను ఆ ల్యాబ్లో అమర్చాలి. టెండర్ల ప్రక్రియ నుంచి సరఫరా వరకు, సరఫరా అయిన సరుకును వినియోగించే వరకు వివిధ దశల్లో తనిఖీలకు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

వీటన్నింటి కన్నా అతి ముఖ్యమైనది ఒకటుంది...

తిరుమల లడ్డూల్లో పంది కొవ్వు, చేప నూనె, ఇతర వృక్ష, జంతు సంబంధమైన కల్తీ ఎలా జరిగిందనే విషయమై కూలంకషమైన సమీక్ష జరపాలి. అత్యున్నత సంస్థ ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలి.

ఇందుకు బాధ్యులైన గత పాలకుల అరాచక విధానాలను అమలు జరిపిన వ్యక్తులకు కఠినమైన శిక్షలు పడాలి! ఇది త్వరగా జరిగితేనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి భక్తకోటి మనస్సులు కుదుట పడతాయి.

PUBLISHED ON JASENA WEBSITE ON 21.9.24

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి