ఇంట్లో తేనె సీసా ఉందా? అయితే ఓ చెంచాడు తేనె తీసుకోండి. తీసుకున్నాక ఈ విషయం తెలుసుకోండి. మీ చేతిలో ఉన్న చెంచాడు తేనె 12 తేనెటీగల జీవితకాల శ్రమ నుంచి తయారైంది. ఈ తేనెను అవి 30,000 పువ్వుల నుంచి సేకరించాయి. అందుకోసం అవి 800 మైళ్లు ప్రయాణించాయి.
ఇప్పుడు మీ చేతిలో ఉన్న చెంచాడు తేనెను నోట్లో పెట్టుకుని చప్పరించండి. తర్వాత ఈ విషయాలు కూడా తెలుసుకోండి.
· * మీకు తెలుసా — ఒక చెంచా తేనె మనిషిని 24 గంటల పాటు బతికించగలదని!
· * మీకు తెలుసా — ప్రపంచంలోని తొలి నాణేలలో ఒక దానిపై తేనెటీగ (Bee) చిహ్నం ఉండేదని!
· * మీకు తెలుసా — తేనెలో సజీవ ఎంజైములు (live enzymes) ఉంటాయని!
· * మీకు తెలుసా — ఈ ఎంజైములు లోహపు చెంచాతో తాకినప్పుడు చనిపోతాయని! అందుకే తేనె తీసుకోడానికి మట్టి లేదా చెక్క చెంచా ఉపయోగించాలి. లేకపోతే ప్లాస్టిక్ చెంచా వాడండి.
· * మీకు తెలుసా — తేనెలో మెదడు పనితీరును మెరుగుపరిచే పదార్థం ఉంటుందని!
· * మీకు తెలుసా — ఆఫ్రికాలో కరువు వచ్చినప్పుడు తేనెటీగలు అక్కడి ప్రజలను ఆకలిమరణం నుండి రక్షించాయని!
· * మీకు తెలుసా — తేనెటీగలు తయారు చేసే ప్రోపోలిస్ (Propolis) అనే పదార్థం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సహజ యాంటీబయోటిక్స్‌లో ఒకటని!
· * మీకు తెలుసా — తేనె గడువు కాలం (ఎక్పైరీ డేట్) లేకుండా చిరకాలం నిలవ ఉంటుందని!
· * మీకు తెలుసా — ప్రపంచంలోని కొందరు మహా చక్రవర్తుల మృతదేహాలను బంగారు పేటికల్లో ఉంచి, వాటిపై తేనె పోసి కుళ్లిపోకుండా కాపాడారని!
· * మీకు తెలుసా — “హనీమూన్” (Honeymoon) అనే పదం, వివాహం తర్వాత కొత్త దంపతులు సంతానోత్పత్తి కోసం తేనె తీసుకునే సంప్రదాయం నుండి పుట్టిందని!
· * మీకు తెలుసా — ఒక తేనెటీగ జీవితకాలం 40 రోజుల కన్నా తక్కువే కానీ, ఆ కాలంలో కనీసం 1000 పువ్వులు సందర్శించి, ఒక చెంచా కన్నా తక్కువగానే తేనెను ఉత్పత్తి చేస్తుందని! కానీ అది దాని జీవితకాలపు సాధనని!
మరి ఇంత తెలిశాక తేనెటీగకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండగలమా? అసలు దాని రుణం మనం తీర్చుకోగలమా అని!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి