(ఎప్పుడో చిన్నప్పుడు రాసిన కవిత)
కాగితాన్ని చూడగానె రాయాలని ఉబలాటం...
మనసులోని భావాలను కక్కాలని ఆరాటం...
రాయాలని ఉత్సాహం మది నిండా ఉన్నా,
భావాలను వ్యక్తపరుచు సామర్థ్యం సున్నా
ఏదో ఒక కవిత్వాన్ని రాసేయాలి...
నాలో గల నవత్వాన్ని చూపించాలి...
ఒక్కసారి ఉరికింది నాలో గల ఆవేశం...
కళపెళమని మరిగింది నాలోపలి రక్తం
కలంపట్టి, కాగితాన్ని చేతబట్టి...
పట్టుపట్టి రాయాలని పట్టుబట్టి కూర్చున్నా...
అంతలోనె అంతరాత్మ నన్ను చూసి నవ్వింది...
అంతావేశం వద్దని నెమ్మదిగా ఇలా అంది...
నీకెందుకు బాలుడా రాయాలని ఉబలాటం?
రాయలేని నీకెందుకు లేనిపోని ఝంఝాటం?
చీకటినే చూడలేని నీకెందుకు కవిత్వం?
జీవితాన్ని వడబోయక నీకు రాదు నవత్వం...
అంతరాత్మ మాటలోని పచ్చి నిజం చూశా...
క్షణమైనా యోచించక పెన్ను క్యాప్ మూశా
పెన్నుక్యాపు మూసేస్తే ఏమవుంతుదా నేస్తం ...సిరా ఎండి మండుతుంది మీ ఊహల సమస్తం... ఆపవద్దు కవితా ఝరి హృదయ కవాటం... మీ కవితలు వినాలనే మా ఆరాటం. ... ఆచారం షణ్ముఖాచారి
రిప్లయితొలగించండి