ఒక్కరోజు జైకొడితే తీరేనా ఆమె రుణం?
అనునిత్యం తలవకుంటే అదే కదా దారుణం?
ఎముకలు విరిగే బాధను అమ్మ ఓర్చుకోకుంటే...
అవని మీద నీ జననం కాదా ప్రశ్నార్థకం?
ఇంటిపేరు మార్చుకుని నీ ఇంటికి చేరుకునే...
జంట తోడు లేకుంటే నిలిచేనా నీ వంశం?
తోడబుట్టి నీడలాగ నీ క్షేమం కోరుకునే...
సోదరి ఉనికే కదా నీ బతుకుకు నిండుదనం?
చిరునవ్వులు చిందిస్తూ పలకరించు అతివ లేక...
అడుగడుగున నీ పయనం అవుతుందా పరిపుష్టం?
అవునో కాదో తెలియదు ఆకశాన 'ఆమె' సగం...
అయినా కాకున్నా 'అతడు' తీర్చలేడు ఆమె రుణం!
(on the occation of womens day)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి