మంగళవారం, జనవరి 06, 2026

వెంకన్నతో... ఏకాంతంలో...



 

స్వామి--నేను

స్వామి: 
--------------
ఏంటయ్యా ఇలా వచ్చావ్, అది కూడా ఇంత చలిలో

నేను: 
------------
నిన్ను చూడాలనే సంకల్పం ముందు ఈ చలి ఎంత స్వామీ

స్వామి:
-------------
ఐతే నా దర్శనం కోసం నువ్వేమైనా చేస్తావా

నేను:
------------
అవును స్వామి, అలిపిరి మెట్లు ఎక్కమన్నా ఎక్కుతా గంటల తరబడి waiting hall లో ఉండమన్నా ఉంటా చలి చూడను, ఎండను పట్టించుకోను మంచుందని భయపడను

స్వామి:
--------------
 నా దర్శనం ఎందుకు నీకు

నేను:
-----------
 అదేంటి స్వామీ అలా అంటారు. నిన్ను చూస్తే వచ్చే ధైర్యం, హాయి, సంతోషం, మనశ్శాంతి అంతా ఇంత కాదు

స్వామి:
---------------
నన్ను చూస్తే నీకు ఇవన్నీ కలుగుతాయంటావు, అవునా,

నేను:
------------
అవును స్వామి

స్వామి:
--------------
దేవుడు అంటే ఏమిటి నీ దృష్టిలో

నేను:
-------------
 దేవుడు అంటే మనల్ని నడిపించే నమ్మకం కాపాడే శక్తి, కాసే కాపు.

స్వామి:
--------------

ఇవన్నీ నేను చేస్తానా

నేను:
------------
చేస్తున్నావు కాబట్టే కదా స్వామీ ఇంతమంది నిన్ను ఇలా కొలుస్తున్నది.

స్వామి:
---------------
నీ దృష్టిలో ఇలాంటివి చేసేవాళ్లే దేవుళ్లు అంటావు, అంతేనా

నేను:
------------
అవును స్వామీ

స్వామి:
--------------
ఇంత కన్నా ఎక్కువ చేస్తే

నేను:
-----------
అసంభవం స్వామీ, ఇంతకన్నా ఎక్కువ ఎవరూ చేయరు, చేయలేరు నిన్ను మించిన majesty ఎవరూ లేరు,ఉండరు.

స్వామి: 
-------------
అదేంటయ్యా, ఉంటే ఏం చేస్తావ్

నేను: 
------------
ఉండనే ఉండరు.స్వామి
 ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఉంటే నా ఊపిరి ఆగే వరకూ వాళ్లకు సేవ చేస్తా

స్వామి: 
---------------

సరే, ready ఐపో

నేను:
------------
 ఏంటి స్వామి, నిజంగా నీకన్నా నాకోసం ఎక్కువ కష్టపడే వాళ్లు ఉన్నారా

స్వామి: ఉన్నారు
-------------
నేను:
----------
 ఎవరు స్వామి, వాళ్లు ఎక్కడ ఉంటారు

స్వామి: ఉన్నారు
------------

నేను: 
-----------
ఎవరు స్వామి, వాళ్లు ఎక్కడ ఉంటారు.

స్వామి:
------------
నీ కోసం నీకంటే ముందు మేల్కొన్న వాళ్లు నీ నిద్ర కోసం తమ నిద్రను త్యాగం చేసిన వాళ్లు నీ ఆకలికి తమ ఆకలిని అడ్డేసిన వాళ్లు నీ నవ్వు కోసం తమ కన్నీళ్లను దాచుకున్న వాళ్లు.

నేను:
------------
స్వామీ, అలా మాట్లాడొద్దు, అర్థమవుతోంది.

స్వామి: 
--------------
నీవు అలిపిరి మెట్లు ఎక్కుతావన్నావు కదా వాళ్లు నీ పుట్టుక నుంచే జీవితమంతా మెట్లు ఎక్కుతూనే ఉన్నారు నీవు గంటల తరబడి waiting hall లో ఉంటావన్నావు. వాళ్లు ఏళ్ల తరబడి నీ భవిష్యత్తు కోసం వేచి చూస్తూనే ఉన్నారు

నేను:
------------
స్వామీ, ఆపండి, నా గుండె తట్టుకోలేకపోతోంది

స్వామి:
-------------
నీవు చలిని పట్టించుకోనన్నావు వాళ్లు వర్షాన్ని, ఎండను, ఆకలిని కూడా పట్టించుకోలేదు నీవు మంచుకి భయపడనన్నావు వాళ్లు అప్పుల్ని, అవమానాల్ని, ఒంటరితనాన్ని భయపడలేదు

నేను:
-----------
స్వామీ, వాళ్లేనా

స్వామి: 
--------------

అవును నిన్ను భవిష్యత్తులా చూసిన వాళ్లు నీ విజయంలో దేవుణ్ణి చూసిన వాళ్లు
నీ ఓటమిలో కూడా నిన్ను వదలని వాళ్లు

నేను:
------------
వాళ్లు ఎవరో కాదు, మా అమ్మా, నాన్నా కదా స్వామీ

స్వామి:
--------------
నువ్వు నా కోసం వచ్చావ్ కానీ నిన్ను నా దగ్గరకు నడిపించింది వాళ్లే నన్ను చూసి ధైర్యం వస్తుందన్నావు నీకు ధైర్యం నేర్పింది వాళ్లే

నేను:
-----------
స్వామీ, నేను ఇంతకాలం దర్శనాల వెంటే పరిగెత్తాను కానీ నా ఇంట్లోనే ఉన్న దేవుళ్లను చూడలేకపోయాను

స్వామి:
--------------
అందుకే చెప్పాను నా దగ్గరకు రావడం పుణ్యం కానీ వాళ్ల దగ్గర ఉండటం మోక్షం

నేను:
-----------
స్వామీ, ఇక నా సేవ అక్కడే నా ఊపిరి ఆగే వరకూ ఆ ఇద్దరికీ

స్వామి:
-------------
ఎప్పుడైతే నీ తల్లితండ్రులను నాకన్నా ఎక్కువగా గౌరవించి పూజిస్తావోఅప్పుడే నువ్వు నన్ను పూర్తిగా దర్శించినట్టు.
అంతవరకూ నువ్వెన్ని సార్లు మెట్లెక్కినా ఎన్ని ముడుపులు కట్టినా నా హుండీలోకి ఎన్ని డబ్బులేసినా నాకోసం నీ తలనీలాలిచ్చినా నా తలకు బంగారు కిరీటం పెట్టినా అవన్నీ వేస్ట్.

వచ్చి నా దర్శనం చేసుకుని రెండు reels చేసి అవి social media లో post చేసి  వైరల్ అవుతావు తప్ప లైఫ్ లో సక్సెస్ అవ్వవు.

నీ తల్లితండ్రుల కళ్లలో హాయిగా నిద్ర వస్తే అదే నీ first success వాళ్ల ఒంటికి, మెదడుకి రోగాలు లేకుండా వాళ్ల ముఖంలో భయం తగ్గితే అదే నీ real ప్రమోషన్.

వాళ్ల బాధ్యతలు కొన్ని నీ భుజాన వేసుకో నన్ను పూజించడమంటే పూలు, కొబ్బరికాయలు కాదు
మీ అమ్మ అలసినప్పుడు ఒక్క గ్లాస్ నీళ్లు ఇవ్వడం
నీ నాన్న మౌనంగా కూర్చున్నప్పుడు కారణం అడగకుండా పక్కన కూర్చోవడం.

నువ్వు నాకోసం వ్రతాలు చేస్తే ఆకాశం నుంచి నేను చూడగలను.
కానీ వాళ్ల కోసం నువ్వు ఒక్కసారి త్యాగం చేసి చూడు
నేనే నీ ఇంటికొచ్చి కూర్చుంటాను.

నా గుడిలో నువ్వు భక్తుడిగా కాదు  మీ ఇంట్లో 
మీ అమ్మానాన్నలకు సేవ చేసే
అర్చకుడిగా ఉండిపో

అందుకే గుర్తుంచుకో

నా కాళ్ల దగ్గర పువ్వులు కాదు.
మీ తల్లితండ్రుల చేతుల్లో నేనున్నానే భరోసా పెట్టు
నీ జీవితంలో మీ అమ్మ నవ్వితే నేను నవ్వినట్టే
మీ నాన్న గర్వపడితే నేను ఆశీర్వదించినట్టే.

24 గంటలు నిన్ను చూస్తూ బతికేస్తారు వాళ్లు అలాంటి వాళ్లకోసం నువ్వెంత చేసినా తక్కువే.

అందుకే గుర్తుంచుకో
నా కాళ్ల దగ్గర పువ్వులు కాదు
మీ తల్లితండ్రుల చేతుల్లో నేనున్నానే భరోసా పెట్టు

నీ జీవితంలో మీ అమ్మ నవ్వితే నేను నవ్వినట్టే మీ నాన్న గర్వపడితే నేను ఆశీర్వదించినట్టే
24 గంటలు నిన్ను చూస్తూ బతికేస్తారు వాళ్లు అలాంటి వాళ్లకోసం నువ్వెంత చేసినా తక్కువే

మా అమ్మ వకుళ మాత ఎప్పుడూ నా పక్కనే ఉంటుంది బిడ్డ ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో అని
అలాంటి తల్లితండ్రులను మించిన దేవుళ్లు ఉండరు.

చివరగా ఒక్క మాట

దేవుళ్లకు, అమ్మానాన్నలకు ఉండే చిన్న తేడా ఏంటో చెప్తా విను పడిపోయాక పట్టుకునే వాళ్లు దేవుళ్లు.

పడిపోకుండా పట్టుకునే వాళ్లు మీ తల్లితండ్రులు
వాళ్లను మించిన దేవుళ్లు లేరు.

(ఎవరు రాశారో కానీ... బాగుందని...) 

(బొమ్మ వాడకం... బాపుగారిపై వెలకట్టలేని అభిమానంతో చనువుగా...) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి