మంగళవారం, జనవరి 20, 2026

పాకిస్తాన్‌లో ఉంటూ అయోధ్య రాముడి కోసం తపించిన రాజపుత్ర వీరుడు!






అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతున్న వేళ, పాకిస్తాన్‌లోని సింధ్ (ఉమర్‌కోట్ రియాసత్) పాలకుడు, రాజపుత్ర వీరుడు 'రాణా హమీర్ సింగ్' రావల్సా ..
రామయ్యకు దాదాపు 6 కోట్ల రూపాయలను విరాళంగా సమర్పించారన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..

ఇది సామాన్యమైన వంశం కాదు... చరిత్రలో షేర్ షా సూరి దెబ్బకు భయపడి పారిపోతున్న మొఘల్ చక్రవర్తి హుమాయున్‌కు తమ కోటలో ఆశ్రయం ఇచ్చిన ధీర సోధా రాజపుత్ర వంశం వీరిది..

అక్బర్ పుట్టింది కూడా వీరి కోటలోనే! "శరణు కోరి వచ్చిన వారిని ప్రాణాలకు తెగించి కాపాడటమే రాజపుత్ర ధర్మం" అని చరిత్ర సాక్షిగా నిరూపించిన గొప్ప వంశం వీరిది..

నేటికీ పాకిస్తాన్ గడ్డపై రాణా హమీర్ సింగ్ జీ ఒక సింహంలా, రాజసంతో జీవిస్తున్నారు:

శిరస్సుపై రాజపుత్రుల తలపాగా, నుదుటన తిలకం ధరించి సగర్వంగా ఉంటారు..

తమ ఆధీనంలోని 25,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 'గోవధ'ను పూర్తిగా నిషేధించిన ధర్మకర్త.
ఇప్పటికి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..

అక్కడి హిందువులు, ముస్లింలు అందరూ వీరిని తమ రాజుగా భావించి గౌరవిస్తారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి