ఇది1965 నాటి మాట. మద్రాసులో రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ ‘వీరాభిమన్యు’ షూటింగ్ జరుగుతోంది. బ్రేక్ లో నటీనటులంతా పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు ఉన్నట్టుండి రాజకీయాల వైపు మళ్ళాయి. చర్చ ఆసక్తి కరంగా జరుగుతోంది. ఆ సమయంలో అక్కడికి శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ వచ్చారు. రసవత్తరంగా సాగుతున్న రాజకీయ చర్చ విని పెదవి, మొహం చిట్లించి, “మనకెందుకు బ్రదర్ ఈ రాజకీయాలు? కూడు పెడతాయా? గుడ్డనిస్తాయా? మన పని సినిమాల్లో నటించడం, మన కుటుంబాల్ని పోషించుకోడం!” అంటూ తన పని లో తాను మునిగిపోయారు.
కట్ చేస్తే... అప్పటికి పదిహేడేళ్ళ తర్వాత 1982 లో ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టడం, ముఖ్యమంత్రి కావడం అందరికీ తెలిసిందే! ఎవరికైనా కాలాన్ని బట్టి అభిప్రాయాలు, ఇష్టానిష్టాలు మారుతుంటాయనడానికి ఇదో ఉదాహరణ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి