సోమవారం, ఆగస్టు 19, 2024

ఘంటసాల గొంతుకు అడ్డం పడిన చెవి!

ఒక గాయకుడు పాడలేదంటే గొంతు సమస్య కారణం కావచ్చు. కానీ చెవి సమస్య కారణమవుతుందా? ఘంటసాల విషయంలో అదే జరగడం విచిత్రం. సాధారణంగా కొందరు గాయనీ,గాయకుల అలవాట్లు చిత్రంగా ఉంటాయి.  ఘంటసాలకి  రికార్డింగ్ సమయంలో చేతిలో కర్చీఫ్ ఉండాల్సిందే. పొరబాటున మరచిపోతే –‘కర్చీఫ్ లేకుండా ఎలా పాడటం?’ అనేవారట. ఆయనకున్న ఇంకో అలవాటు ఏంటంటే... పాడేటప్పుడు కుడిచెవిని కుడి చేత్తో మూసుకునేవారు. అలా అయితేనే  తన పాట తనకు స్పష్టంగా వినిపిస్తుందని అయన అభిప్రాయం.  ఒకసారి ఏదో సమస్య వచ్చి  తన పాట తన చెవికి వినిపించనట్లు అనిపించింది ఆయనకు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చెవి చూపించుకున్నారు.  డాక్టర్‌ పరీక్షించి ‘ఇదేమంత ఇబ్బంది కాదు. సర్దుకుంటుంది. పాడేందుకు గొంతు అవసరం. మీ గొంతు బాగానే ఉందిగా?’ అన్నారట. అయితే అందుకు ఘంటసాల అంగీకరించలేదు. తన పాట తన చెవికి తన చెవికి వినిపించే దాకా పది రోజులపాటు  రికార్డింగ్ లకు  వెళ్ళలేదు. కొన్నాళ్లకు డాక్టర్‌ చెప్పినట్టుగానే చెవి సమస్య దానంతట అదే సర్డుకొంది. అప్పుడాయన రికార్డింగ్‌కి హాజరయ్యారు. అప్పుడు ఆయన పాడిన పాట ఏంటో తెలుసా? ‘బుద్ధిమంతుడు’ (1969)లో ని ‘వేయి వేణువులు మ్రోగే వేళా... నను పాలింపగ నడచి వచ్చితివా...’ పాట! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి