వేటూరి సుందరరామమూర్తి జయంతి నివాళిగా అయన పాటలలో ని కొన్ని అలంకారాలను గుర్తు చేసుకుందాం. ఇవి కేవలం కొన్నే. తెలుగు భాషలో అలంకారాలు వేటూరి పాటల్లో సొబగులద్దుకున్నాయి. భాషలో ఆయా అలంకారాల గురించి పూర్తిగా తెలియకపోయినా, ఆయన పాటలను తల్చుకుంటే కొంత వరకు తెలిసే అవకాశం ఉంది.
పాటలు - అలంకారాలు
.......
అర్ధాలంకారాలు
ఉపమాలంకారం
త్యాగరాజ కీర్తనల్లె ఉన్నాది బొమ్మ (శుభోదయం చిత్రం - కంచికి పోతావా కృష్ణమ్మా )
పాలకడలిలా వెన్నెల పొంగింది..
పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలను?
మనసున మమతై కడతేరగలను! - పంతులమ్మ (మానస వీణ మధుగీతం)
ఉత్ప్రేక్షాలంకారం
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
(శంకర నాద శరీర పర - శంకరాభరణం)
రూపకాలంకారం
కైలాసాన కార్తీకాన శివరూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం (సాగర సంగమం - నాద వినోదం )
శబ్దాలంకారాలు
లాటనుప్రాసాలంకారం
మారేడు నీవని ఏరేరి తేనా..
మారేడు దళములు నీ పూజకు (భక్త కన్నప్ప శివ శివ శంకర)
కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి (సప్తపది - వ్రేపల్లియ ఎద జల్లున్న )
యమకాలంకారం
ఐలవ్ యు ఓ హారిక మన ప్రేమకే జోహారిక (ఛాలెంజ్)
వృత్యనుప్రాసాలంకారం
ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళ
ఒహొ పిల్లా... శుభానల్లా...
సరాగంలో... విరాగాలా...
మిసమిస వయసు రుసరుసల దరువుల
గుసగుస తెలిసె కలికి చిలకా
కసికసి పెదవి కదలికల కవితల
పిలుపులు తెలిసె కవిని గనకా (చైతన్య)
ఛేకానుప్రాసాలంకారం
తుళ్ళి తుళ్ళి నిన్నమొన్న తూనీగల్లే ఎగిరిన
పిల్లదాని కొచ్చిందీ కళ... పెళ్లికళా..
తలపులన్ని వలపులైన చూపులు విరితూపులైన
పెళ్లికొడుకు నవ్వితే తళా... తళ తళా (అడవి రాముడు కోకిలమ్మ పెళ్ళికీ )
తొలకరి కోరికలే తొందర చేసినవే...ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా(ఇంటింటి రామాయణం -మల్లెలు పూసే)
అతిశయోక్తి అలంకారం :
రవి వర్మ కె అందని ఒకే ఒక అందానివో (రావణుడే రాముడైతే )
సారాలంకారం
చినుకులా రాలి..నదులుగా సాగి
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు..కడలి నేను
మరచి పోబోకుమా..మమత నీవే సుమా..(నాలుగు స్తంభాలాట )
ముక్తపదగ్రస్తలంకారం
గజ్జెఘల్లుమంటుంటే... గుండె ఝల్లుమంటుంది
గజ్జెఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది
గుండె ఝల్లుమంటుంటే... కవిత వెల్లువవుతుంది
గుండె ఝల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది
అంత్యానుప్రాసాలంకారం
ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
పడుచమ్మ దక్కే.. దుప్పట్లో
దిండల్లె ఉండు.. నిద్దట్లో

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి