ప్రభూ!
నేను చేసేది పూజ కాదు
నాకు ఉన్నది భక్తి కాదు
ఎందుకంటే...
నిత్య పరిశుద్ధుడవు నీవు
నిత్య పవిత్రుడవు నీవు
మరి నేను...?
భావాలు మలినం
ఆలోచనలు మలినం
మాటలు మలినం
చేతలు మలినం
కానీ ఒకే ఒక నమ్మకం...
బురదలో పుట్టిన కమలాన్ని చేత ధరిస్తావు నీవు
అలాంటి కమలం మీదనే ఆశీనుడవుతావు నీవు
కాబట్టి ప్రభూ!
మలినాల బురదలోంచి నన్ను కమలమై ఎదగనీ!
నీ పాదాలు ఆన్చడానికి పీఠమై నిలవనీ!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి