మనం కదలకుండా కూర్చునే ఉండవచ్చు. కానీ మన భూమి మాత్రం అలా కాదు. నిరంతరం గంటకు 1000 మైళ్ల వేగంతో కదులుతూనే ఉంది. తన చుట్టూ తాను అంత వేగంతో కదులుతూ మనకి పగలు, రాత్రి ఇస్తోంది. అలాగే సూర్యుని చుట్టూ గంటకు 67,000 మైళ్ల వేగంతో తిరుగుతోంది. ఇలా ఏడాదికి 584 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణిస్తోంది. ఇంత ప్రచండ వేగంతో తిరుగుతూ ఉన్నా మనకేమీ అనిపించదు. ఎందుకంటే భ్యూమ్యాకర్షణ శక్తి మనలందరినీ మన చుట్టూ ఉన్న వాతావరణంతో సహా బలంగా పట్టి ఉంచుతుంది కాబట్టి. మనకి మనం స్థిరంగానే ఉన్నట్టు ఉంటుంది కానీ, మనందరం ఈ భూమి మీద అనూహ్యమైన వేగంతో అంతుతెలియని అంతరిక్షంలో కదిలిపోతున్న ప్రయాణికులమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి