‘జాతస్యహి ధృవో మృత్యు:’ అంటుంది భగవద్గీత. మరణం ఒక అంతం కాదని కూడా చెబుతుంది. పుట్టాక బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎంత సహజమో మరణించాక మరో దేహాన్ని తీసుకోవడం కూడా అంతే సహజమని చెబుతుంది. ఏమైనా మరణం మనిషిని వెంటాడుతూనే ఉంది, ఆలోచనల్లోనో, భయంలోనో. ఇప్పుడు మరణం, దాని తర్వాత ఉనికి గురించి ‘క్వాంటమ్ ఫిజిక్స్’ కూడా చెబుతోంది. ‘బయోసెంట్రిజం’ అనే సిద్ధాంతం ప్రస్తుతం అటు శాస్త్రవేత్తలను, ఇటు తత్వవేత్తలను కూడా సమానంగా ఆకర్షిస్తోంది. దీని ప్రకారం జీవం, ఉనికి అనేవి ఈ విశ్వంలో అనుకోకుండా ఏర్పడిన ఘటనలు కావని, నిజానికి అవే విశ్వానికి పునాదులని చెబుతోంది. ఈ కొత్త సిద్ధాంతం ప్రకారం మరణం అనేది ఒక అంతం కాదు. ఒక పరిశీలకుడి కోణంలో చూస్తే మరణం అనేది ఒక విశ్వంలోంచి మరో సమాంతర విశ్వంలోకి ఉనికి మార్పు మాత్రమే అంటుంది. సమాంతర విశ్వం అనేది కూడా ఒక సిద్ధాంతమే. మనకి తెలిసిన విశ్వమే కాకుండా, దానికి సమాంతరంగా అనేక విశ్వాలు ఉన్నాయని చెబుతుందది. అంటే మనం చూసే వాస్తవం అనేది మనం ఎలా అనుభూతి చెందుతున్నామనేదానికి ముడిపడి ఉంటుంది.
బయోసెంట్రిజమ్
సిద్ధాంతానికి క్వాంటమ్ ఎఫెక్ట్, పరిశీలకుడి కోణం, క్వాంటమ్ ఎన్టాంగిల్ మెంట్, రెట్రో కాసాలిటీ లాంటి మరికొన్ని సిద్దాంతాలకు అనుగుణంగా ఉంది. వీటి ప్రకారం సృష్టిలో కణాలు గతంలోని ఘటనలపై కూడా ప్రభావం చూపుతాయని
చెబుతారు. అలాగే సృష్టిలో కణాలన్నీ తమ మధ్య ఎంతెంత దూరాలున్నా సరే ఇతర
కణాల మీద నిరంతర ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయంటారు. విశ్వంలో ఉనికి అనేది వాస్తవికతను రూపుదిద్దడంలో కీలక
పాత్ర పోషిస్తుంది. ఈ ఆధునిక సిద్ధాంతాల ప్రకారం మరణం అనేది ఒక అంతం కాదు. అది స్థల కాలాలకు అతీతంగా ఉనికి అనేది మరో ఉనికిలోకి జరిగే రూపాంతరం
మాత్రమే. ఈ సిద్ధాంతం మీద చాలా వివాదాలు, వాదనలు ఉన్నప్పటికీ… మరణం, మరణానంతర జీవితం గురించి మరో కొత్త
ఆలోచనా కోణాన్ని ఆవిష్కరిస్తోందన్నది
మాత్రం నిజం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి