నీకు తెలుసో తెలియదో కానీ, నువ్వొక ఖగోళ అద్భుతం గురూ. అసలు నీ శరీరంలో ఎన్ని పరమాణువులున్నాయో తెలుసా? తెలియక పోతే ఓ కలం, కాగితం తీసుకుని 7 పక్కన ముఫ్ఫై సున్నాలు చుట్టు. ఆ సంఖ్య ఎంతో లెక్కేసుకో. దాన్ని ఆక్సిలియన్ అంటారు. అంటే అది...
7,000,000,000,000,000,000,000,000,000,000 అన్నమాట.
ఇవన్నీ
ఎక్కడివో తెలుసా? వందల కోట్ల ఏళ్ల క్రితం పుట్టిన పురాతన నక్షత్రాలు, సూపర్ నోవాల
నుండి ఉద్భవించినవే. నీ శరీరాన్ని తయారు చేసిన ఈ కార్బన్, ఆక్సిజన్, కాల్షియం,
ఐరన్ లాంటి పరమాణువులన్నీ విశ్వంలో అనేక దూరాల నుంచి ప్రయాణించి వచ్చి అన్నీ కలిసి
చివరికి నిన్ను సృష్టించాయి. ఒక విధంగా నువ్వొక ‘నక్షత్ర ధూళి’ గాడివన్నమాట.
నిజానికి ఈ విశ్వం జీవంతో, అనేక అవకాశాలతో నిండి ఉందనడానికి నువ్వే ప్రత్యక్ష
సాక్ష్యం. మరి
ఇదొక అద్భుతం కాక మరేమిటి గురూ?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి