‘అరె... ఏం మెదడురా నీది?’అంటూ ఎవరినైనా ఆట పట్టిస్తాం కానీ, నిజానికి మనందరి మెదళ్లూ అంతే.
విశ్వం మొత్తం మీద అత్యంత సంక్లిష్టమైన అంశాల్లో మనిషి మెదడు ఒకటి. ఎవరిదైనా సరే, మెదడులో 86 బిలయన్ న్యూరాన్లు ఉంటాయి. అంటే 8600 కోట్లన్నమాట. ఇవన్నీ కలిసి ఒకదానితో ఒకటి వేలాది రకాలుగా అనుసంధానం అవుతూ ఉంటాయి. సినాప్సెస్ అనే ఈ కలయికలన్నీ కలిసి మొత్తం 100 ట్రిలియన్లు ఉంటాయి. అంటే కోటి కోట్లు అన్నమాట.
ఇప్పుడొక పోలిక చూద్దాం. మన భూమి, సూర్యకుటుంబం ఉండే మన పాలపుంత నక్షత్ర మండలంలో దాదాపు 100 నుంచి 400 బిలియన్ల తారలు ఉంటాయని అంచనా. అంటే అత్యధికంగా 40 వేల కోట్లన్న మాట.
దీన్ని బట్టి మనకేం అర్థం అవుతోంది?
మన మెదడులో న్యూరాన్ల కలయికల సంఖ్య పాలపుంతలోని నక్షత్రాల సంఖ్య కన్నా ఎన్నో రెట్లు ఎక్కువనే కదా.
ఇలా మన మెదడులో ఉండే న్యూరాన్ల కలయికల వల్ల మన ఆలోచనలు, గురుతులు, భావోద్వేగాలు కలుగుతూ మన ప్రవర్తనను నిర్దేశిస్తూ ఉంటాయి.
చూశారా, మన మెదడు శక్తి ఎంత గొప్పదో. మరి మెదడా? మజాకా?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి