చెంబై వైద్యనాద్ భాగవతార్, ఏసుదాస్ గురుశిష్యుల బంధం గురించి చాలా మందికి తెలుసు. అలాంటిదే వీ. దక్షిణామూర్తి - ఇళైయారాజా బంధం, అనుబంధం కూడా.
ఏసుదాస్, ఇళైరాజా...
ఇద్దరూ చరిత్ర సృష్టించిన కళాకారులు. అందుకు తొలి దశల్లో వాళ్ల గురువులు అందించిన
సహకారం చెప్పుకోదగ్గది.
ఇళైయరాజాకు తొలిదశ
కర్ణాటక సంగీతం గురువు వీ. దక్షిణామూర్తి. ఆయన తమిళ బ్రాహ్మణులు. ఇళైయరాజా తమిళ సమాజంలో
మాలగా పేర్కొనే వర్గం వాడు. ఇళైయరాజా కులాన్ని దక్షిణామూర్తి పరిగణనలోకి
తీసుకోలేదు! ఇళైయరాజాలోని విద్యార్థిని పరిగణనలోకి తీసుకున్నారు. అతని లోని తపనను పరిగణించారు.
తారతమ్యాలు చూపించకుండా ఎంతో చనువుగా ఇళైరాజాను చూసుకున్నారు.
ఇళైయరాజాను తన మంచం
మీద కూర్చోబెట్టుకుని మరీ దక్షిణామూర్తి, ఎంతో ఆప్యాయంగా విద్య నేర్పించారు. ఈ గురుశిష్యులిద్దరూ...సమాజంలోని కులవాద వికృత
జీవులకు సరైన పాఠంగా నిలిచారు.
దక్షిణామూర్తిని
మలయాళ, తమిళ
సినిమా పరిశ్రమలు 'సామి' అని పిలుస్తాయి.
ఇళైయరాజా కూడా సామి అనే పిలుస్తారు.
చెంబై వైద్యనాధ్ బాగవతార్, దక్షిణామూర్తి వంటి
గురువుల శిష్యరికంలో ఏసుదాస్, ఇళైయరాజాలు కులమతాలకు అతీతంగా రాణించి
అంతర్జాతీయ స్థాయి వ్యక్తులయ్యారు.
బ్రాహ్మణ్యం, దళితత్వం పుట్టుకతో
రావు.
బ్రాహ్మణ డీఎన్ఏ,
దళిత డీఎన్ఏ అని విడివిడిగా లేవు.
బ్రాహ్మణ్యం, దళితత్వం అన్నవి
స్థితులు. కొందరు తమ మనస్తత్వ రీత్యా, తమ జీవన విధానంవల్లా
ఆ స్థితుల వాళ్లయ్యారు.
ఇవాళ ఏసుదాస్, ఇళైయరాజాలది
ఓ గొప్ప చరిత్ర.
కులం, మతం ఒక మనిషిని ఉన్నతుణ్ణి
చెయ్యవు. అతడి తపన, పట్టుదల, వినయం, విద్య పట్ల ఉన్న అనురక్తి... ఇవే ఎవరినైనా గొప్పవాళ్లను
చేస్తాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి